»   » ఆమిర్‌ కొత్త లుక్‌ సీక్రెట్ రివీలైంది, అద్బుతమైన ఆలోచన ,రెస్పాన్స్ కూడా సూపర్

ఆమిర్‌ కొత్త లుక్‌ సీక్రెట్ రివీలైంది, అద్బుతమైన ఆలోచన ,రెస్పాన్స్ కూడా సూపర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: సామాజిక సందేశాలను ప్రమోట్ చేయటంలో బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌ ముందుంటున్నారు. అది సత్యమేవ జయితే లాంటి సోషల్ మెసేజ్ తో సాగే టీ షో కావచ్చు లేదా నర్మదా బచావో అందోళలను సపోర్ట్ చేయటం కావచ్చు, లేదా రీసెంట్ గా వచ్చిన దంగల్ లాంటి సనిమాలో పాత్రతో కావచ్చు. ఏది చేసినా అందులో సమాజానికి ఉపయోగపడే అంశం ఎంతో కొంత ఉండాలని ఆయన కోరుకుంటారు. తన స్టార్ ఇమేజ్ ని సమాజానికి ఉపయోగించి, మంచి ఫలితాలను సాధించటంలో ముందుంటారు. ఇప్పుడు అలాగే అదే పద్దతిలో బాలికలను ఉద్దేశించి మరో చక్కటి సందేశంతో ముందుకు వచ్చారు.

ఇటీవల విడుదలైన 'దంగల్‌' సినిమాలోనూ కుమార్తెలను రెజ్లర్లుగా తీర్చిదిద్దే తండ్రి పాత్రను పోషించారు. 'ఆడబిడ్డ అయితేనే, మగబిడ్డ అయితేనే దేశానికి కావాల్సింది బంగారు పతాకమేగా' అని సాగే ఈ చిత్రానికి విశేషమైన స్పందన లభించింది. అమ్మాయిలూ దేనిలోనైనా రాణించగలరు అనే సందేశాన్ని ఈ చిత్రం అందించింది.
ఇప్పుడు మరో సందేశంతో ఆమిర్‌ ఓ ప్రకటనతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ యాడ్ లో అమీర్ ఖాన్ స్వీట్ షాప్ యజమాని గురు దీప్ సింగ్ గా కనిపించారు. ఆ షాప్ కు వచ్చిన ఓ కష్టమర్... స్వీట్స్ తెగ అమ్ముడైపోతూంటే..ఆశ్చర్యపోతూ అదే మాట అంటాడు. అదంతా మా బిడ్డలు గొప్పతనం ఇదంతా..వాళ్ళు మా షాపులో ఉన్న ఐటమ్స్ ని లిస్ట్ అవుట్ చేసి, ఇంటర్ నెట్ లో పెట్టారు. అని చెప్తూంటే మీ అబ్బాయిలు గ్రేట్ అన్నట్లుగా ..కష్టమర్ చెప్తూంటే..అబ్బాయిలు కాదు అమ్మాయిలు అంటాడు అమీర్. తన పిల్లలిద్దరినీ చూపిస్తూ..

'విజయం ఓ అబ్బాయి నుంచో, అమ్మాయి నుంచో రాదు.. సరైన ఆలోచనలతోనే విజయం వరిస్తుంది' అంటూ ఈ ప్రకటనను చూపించారు.
ఇందులో ఆమిర్‌ సర్దార్‌ లుక్‌లో కనిపించారు. ఇటీవల దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ఆమిర్‌ తన తర్వాతి చిత్రం 'తగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌' లుక్‌ ఇదేనని వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఆ లుక్‌ ఈ ప్రకటన కోసమేనని ఆమిర్‌ సన్నిహితులు పేర్కొన్నారు.

English summary
Riding high on the success of his film Dangal - one that breaks many stereotypes about women - Aamir Khan is now seen in a feel-good television commercial promoting women empowerment.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu