అభిజీత్, హారిక సీక్రెట్ పార్టీ: చాలా రోజుల తర్వాత జంటగా.. ఐలవ్యూ అంటూ పోస్ట్ చేయడంతో!

తెలుగు టాలీవుడ్ హిస్టరీలోనే భారీ స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందనను దక్కించుకుని విజయవంతమైన షోగా పేరు సంపాదించుకుంది బిగ్ బాస్. అందుకే రికార్డు స్థాయి రేటింగ్‌తో హవాను చూపించింది. ఫలితంగా ఐదు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఇక, ఈ షో విజయం సాధించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.

అందులో ప్రేమ వ్యవహారాలు కూడా ప్రధాన పాత్రను పోషించాయని చెప్పొచ్చు. ప్రతి సీజన్‌లోనూ ఏదో ఒక జంట బాగా హైలైట్ అయింది. అలా నాలుగో దానిలో దేత్తడి హారిక - అభిజీత్ జంటగా సందడి చేశారు. అయితే, షో తర్వాత మాత్రం వీళ్లిద్దరూ దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత వీళ్లు జంటగా సందడి చేశారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

జంటగా రచ్చ చేసిన అభి, హారిక

జంటగా రచ్చ చేసిన అభి, హారిక

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అభిజీత్.. దేత్తడి హారిక ఎంతో క్లోజ్‌గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు చూపించారు. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం.. హగ్గులు చేసుకోవడం.. అలగడం.. గొడవలు పడడం వంటివి చేశారు. దీంతో బయట వీళ్ల పెళ్లి ప్రస్తావన కూడా వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

తనకు చెల్లిలాంటిదన్న అభిజీత్

తనకు చెల్లిలాంటిదన్న అభిజీత్

బిగ్ బాస్ హౌస్‌లో అద్భుతమైన ఆటతీరుతో నాలుగో సీజన్ విజేతగా నిలిచాడు అభిజీత్. బయటకు వచ్చిన తర్వాత నుంచి వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడిపాడు. ఈ క్రమంలోనే హారిక గురించి ప్రశ్నలు ఎదురవగా.. ఆమె తనకు సిస్టర్ అని షాకిచ్చాడు. అంతేకాదు, హౌస్‌లో ఉన్నప్పుడు కూడా ఆమెను సోదరి అని సంభోదించినట్లుగా పలు ఇంటర్వ్యూల్లో క్లారిటీ ఇచ్చాడు.

బిగ్ బాస్‌ షోపై హారిక ఆరోపణలు

బిగ్ బాస్‌ షోపై హారిక ఆరోపణలు

హారిక కూడా అభిజీత్ రిలేషన్‌పై మాట్లాడుతూ.. ‘హౌస్‌ లోపలికి వెళ్లేప్పుడు బిగ్ బాస్ కనెక్షన్ కలిపే గేమ్ పెట్టాడు. అప్పుడు నాకు షూ, అభికీ సాక్స్ వచ్చాయి. అలాగే, ఇద్దరికీ నీట్‌నెస్ ఉండాలి. ఇలా మా ఇద్దరికీ ఒకే రకమైన లక్షణాలు ఉన్నాయి. అందుకే అభీకి నాకు మధ్య కనెక్షన్ అలా కుదిరింది. అదే 15 వారాలు పాటు కొనసాగించాం' అని చెప్పడంతో పుకార్లుకు పుల్‌స్టాప్ పడింది.

ఇద్దరూ దూరంగా.. ఎవరికి వాళ్లే

ఇద్దరూ దూరంగా.. ఎవరికి వాళ్లే

బిగ్ బాస్ షోలో జంటగా సందడి చేసిన దేత్తడి హారిక, అభిజీత్‌.. బయటకు వచ్చిన తర్వాత మాత్రం దూరంగానే ఉన్నారు. ఆ మధ్య జరిగిన ఓ పార్టీలో సైతం అభి కనిపించలేదు. దీంతో షో కోసమే వీళ్లను నిర్వహకులు జంటగా చూపించారని అంతా అనుకున్నారు. ఆ తర్వాత కూడా ఎవరికి వాళ్లే అన్నట్లుగా విడిపోయి ఉండడంతో వీళ్లిద్దరి అభిమానులు నిరాశకు గురయ్యారు.

హారిక ఫుల్ బిజీ.. అభి ఖాళీగానే

హారిక ఫుల్ బిజీ.. అభి ఖాళీగానే

బిగ్ బాస్ షో తర్వాత దేత్తడి హారిక ఫుల్ బిజీ అయిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు, సినిమాలు చేసిన ఈ భామ.. ఇప్పటికే చేతి నిండా ఆఫర్లతో సత్తా చాటుతోంది. అయితే, అభిజీత్ మాత్రం ఖాళీగానే ఉంటున్నాడు. అతడు సినిమాల్లోకి రీలాంచ్ అవుతాడని అంతా అనుకున్నా.. అలా చేయకుండా ఫ్యాన్స్‌ను ఢీలా పడేలా చేస్తున్నాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Vijay Devarakonda Supports His Life Is Beautiful Co Star Abhijeet
చాలా కాలం తర్వాత కలిశారుగా

చాలా కాలం తర్వాత కలిశారుగా

బిగ్ బాస్ షోలో జంటగా కనువిందు చేసిన తర్వాత దూరమైపోయిన అభిజీత్, దేత్తడి హారిక సుదీర్ఘ విరామం తర్వాత కలుసుకున్నారు. వీళ్లతో పాటు ఆ సీజన్ కంటెస్టెంట్, ప్రముఖ సింగర్ నోయల్ సీన్ కూడా ఉన్నాడు. వీళ్లు ముగ్గురు కలిసి ఓ పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ట్రెండ్ అవుతోన్న అభిక జంట

ట్రెండ్ అవుతోన్న అభిక జంట

అభిజీత్, దేత్తడి హారిక మరోసారి కలుసుకోవడం.. ఇద్దరూ ఫొటోల్లో క్లోజ్‌గా ఫోజులివ్వడంతో ఈ పిక్స్‌కు భారీ స్పందన దక్కుతోంది. మరీ ముఖ్యంగా హారిక ఆ ఫొటోలను షేర్ చేస్తూ ‘లవ్యూ గాయ్స్' అంటూ లవ్ సింబల్స్ పెట్టింది. దీంతో నోభిక పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక, అభి, హారిక కలవడంతో వాళ్ల అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X