బిగ్‌బాస్ తెలుగు 89వ రోజు సందడిగా సాగింది. ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. ఇంటిలో ఇప్పటి వరకు సాగిన ప్రయాణాన్ని పరిగణనలోకి తీసుకొని మీ ఫెర్ఫార్మెన్స్ ఆధారంగా మీరు ఏ ర్యాంక్‌కు సరిపోతారనుకొంటారో.. మీరే ఎందుకు ఆ ర్యాంక్‌లో ఉండాలనుకొంటారో.. చర్చలు జరిపాలి. మీ చర్చలు పూర్తయిన తర్వాత వివరాలను మాకు చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
విజేతగా నిలిచేందుకు కారణాలను
నంబర్ ర్యాంప్‌పై నిలబడి తమ బలాలను, బలహీనతలను బిగ్‌బాస్‌కు వెల్లడించాలి. ఈ గేమ్‌లో విజేతగా నిలిచేందుకు ఎందుకు అర్హత ఉందో చెప్పాలని ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ సూచించాడు. నంబర్ వన్ స్థానంలో నిలిచిన వ్యక్తి ఉత్తమ కంటెస్టెంట్‌గా బెస్ట్ ఫెర్ఫారర్ ఆఫ్ ది సీజన్‌గా నిలుస్తాడు. ఒక నంబర్ మీద ఒక్కరే నిలబడాలి. నంబర్ 6లో నిలిచిన కంటెస్టెంట్‌ను చెత్త ఆటగాడిగా పరిగణిస్తామని చెప్పారు.
సోహెల్ నంబర్ 1 స్థానంలో
ఇంటి సభ్యులు నంబర్ ర్యాంప్‌పైకి ఎక్కారు. నంబర్ 1 పోజిషన్‌పై నిలబడేందుకు అఖిల్, సోహెల్ పోటీ పడ్డారు. ఆ తర్వాత నీవు రోడ్ టూ ఫినాలే టాస్క్‌లో గెలిచినందున ఈ ర్యాంప్‌పై నిలబడాల్సిన అవసరం లేదని బిగ్‌బాస్ ఆదేశించడంతో అఖిల్ ఈ గేమ్ నుంచి తప్పుకొన్నారు.
నేను స్ట్రాంగ్ అంటూ సోహెల్
ఇక సోహెల్ తాను ప్రతీ టాస్క్‌లో 100 శాతం తన శక్తిని ప్రదర్శించాను. ప్రతీ విషయంలో నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను. కాబట్టి నేనే నంబర్ వన్ అని భావిస్తున్నాను. ఆ తర్వాత అరియానా, హారిక, అవినాష్, మోనాల్ తన వెర్షన్‌ను వినిపించారు. ఇక చివర్లో ఆరో నెంబర్ మీద నిలబడి ఉన్న అభిజిత్ తన వెర్షన్‌ను వినిపించాడు.
మోనాల్‌తో డేటింగ్ టాస్క్ తప్ప...
బిగ్‌బాస్ సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ప్రతీది 100 శాతం ఆడాను. 12వ వారంలో మోనాల్ డేటింగ్ టాస్క్‌లో తప్ప మిగితా అన్ని విషయాల్లో నేను బెస్ట్ ఇచ్చాను. అయితే ఆ ఒక్క విషయంలో నేను పొరపాటు చేశాను. కాబట్టి నేను 6వ స్థానాన్ని ఎంచుకొన్నాను అంటూ అభిజిత్ తన వాదనను వినిపించారు.
Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Controversial Post On Bigg Boss Contestants
ఖైదీగా మారిన అభిజిత్
ఇంటి సభ్యుల అందరి వాదనలు విన్న బిగ్‌బాస్ తన తీర్పును వెల్లడించారు. నంబర్ వన్ స్థానంలో నిలబడి ఉన్న సోహెల్‌ను ఉత్తమ ఆటగాడిగా, నంబర్ 6వ స్థానంలో నిలబడి ఉన్న అభిజిత్ వరస్ట్ ఫెర్ఫార్మర్ అంటూ కామెంట్ చేశారు. చెత్త ఆటగాడిగా నిలిచిన అభిజిత్‌కు జైలు శిక్ష విధించాడు. దాంతో ఖైదీగా అభిజిత్ మారి జైలులోకి వెళ్లాడు.
Bigg Boss Telugu 4s 89th day update: Abijeet Duddala become prisoner with Bigg Boss Punishment, Akhil Sarthak entered into Bigg Boss Telugu 4's Final, Sohel skips Road to Finale task. Abijeet Duddala reveal secret about Monal Gajjar proposal to Harika Dettadi Bigg Boss Telugu 4s 13 week nominations list: As per Latest report, Abijeet, Akhil, Monal, Harika, Avinash has been nominated for elimination. In this occassion, Heat Arguments went between contestants. Monal Gajjar bursts over Akhil Sarthak and Mukku Avinash amid 13th nomination process
Story first published: Friday, December 4, 2020, 23:30 [IST]