Just In
- 25 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 11 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- Sports
మౌమా, సుధా సింగ్‌తో సహా ఏడుగురికి పద్మశ్రీ
- News
వెర్టికల్ ఛార్లీ స్పెషల్ అట్రాక్షన్: విన్యాసాల కోసం ఎదురు చూపులు: కాస్సేపట్లో నింగిలోకి
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ట్రైయాంగిల్ లవ్ గురించి తొలిసారి స్పందించిన అభిజీత్: వాళ్లిద్దరి గురించి నిజాలు బయటపెట్టాడు
తెలుగులో అతి తక్కువ సమయంలోనే ఎంతో ఎక్కువ మందికి చేరువై.. సక్సెస్‌ఫుల్ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. కనీవినీ ఎరుగని రికార్డులను క్రియేట్ చేసి దూసుకుపోయిన ఈ షో.. ఏకంగా నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇటీవల ముగిసిన సీజన్‌లో అందరి దృష్టినీ ఆకర్షించిన అంశాల్లో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఒకటి. షో ముగిసినా ఎంతో మందికి ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలి పోయిన దీని గురించి బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ తాజాగా స్పందించాడు. ఈ సందర్భంగా కొన్ని షాకింగ్ నిజాలను బయట పెట్టాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

మొదట మోనాల్‌తో ఆ తర్వాత హారికతో
తెలుగులో హీరోగా కొన్ని సినిమాలు చేసి ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యాడు అభిజీత్. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అతడు.. బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. రావడం రావడమే హీరోయిన్ మోనాల్ గజ్జర్‌తో క్లోజ్ అయిన అతడు.. ఆ తర్వాత ఆమెకు దూరమయ్యాడు. అదే సమయంలో దేత్తడి హారికతో క్లోజ్‌గా ఉండడం మొదలెట్టాడు.

ఆమెను ఎనిమీలా.. ఈమెను ఫ్రెండ్‌లాగ
షో ఆరంభంలో అభిజీత్‌తో క్లోజ్‌గా ఉన్న మోనాల్.. అఖిల్ సార్థక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతడితో చనువుగా ఉండడం మొదలు పెట్టింది. ఆ తర్వాత కొద్ది రోజులకు పూర్తిగా అతడి వైపే వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమెను అభిజీత్ దూరం పెట్టడంతో పాటు ఎనిమీలా ట్రీట్ చేశాడు. అదే సమయంలో హారికతో మాత్రం చనువుగా ఉంటూ ట్రాక్ నడిపినట్లు చూపించారు నిర్వహకులు.

బిగ్ బాస్ విజేత.. ఫుల్ బిజీగా మారాడు
అసాధారణ పరిస్థితుల్లో అద్భుతమైన మైండ్ సెట్‌తో నెగ్గుకొచ్చాడు అభిజీత్. బిగ్ బాస్ అంటే టాస్కులు గెలవడం మాత్రమే కాదు.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడం అని నిరూపిస్తూ నాలుగో సీజన్ విన్నర్‌గా నిలిచాడు. అప్పటి నుంచి తీరిక లేకుండా తిరుగుతున్నాడీ యంగ్ హీరో. విజేతగా నిలిచిన తర్వాత వరుస ఇంటర్వ్యూలు, లైవ్ చాట్‌లతో ఫుల్ బిజీగా అయిపోయాడు.

ట్రైయాంగిల్ లవ్ గురించి తొలిసారి అలా
ఇటీవల అభిజీత్ ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా.. ఫాలోవర్లతో లైవ్ చాట్ చేసినా అతడికి లవ్ ట్రాకుల గురించి చాలా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే మోనాల్ గజ్జర్.. అభిజీత్.. దేత్తడి హారిక ట్రైయాంగిల్ లవ్‌పై తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అతడికి ఓ ప్రశ్న ఎదురైంది. దీంతో తొలిసారి దీనిపై స్పందించిన అతడు.. ఇద్దరి గురించి కొన్ని నిజాలు చెప్పి షాకిచ్చాడు.

నాగార్జున గారితో ఆట వల్లే ఆమెతో ట్రాక్
మోనాల్ గజ్జర్‌తో కలవడానికి కారణం.. బిగ్ బాస్ స్టేజ్‌పై జరిగిన ఫన్నీ గేమే అని చెప్పాడు అభిజీత్. ‘ఆరోజు స్టేజ్ మీద గేమ్ ఆడిన తర్వాత.. లోపలికి వెళ్లి మోనాల్‌ను ఎప్పుడు కలుస్తానా అనుకున్నా. ఆమెతో చాలా రోజులు ట్రావెల్ చేయాలని భావించా. అందుకే తన గురించి తెలుసుకోడానికి ట్రై చేశా. అంతేకానీ, ట్రాకులు నడపడం వంటివి కాదు' అని చెప్పుకొచ్చాడు.

ఆయన వల్లే ఆమెతో కలవాల్సి వచ్చింది
ఇక, హారికతో క్లోజ్ అవడానికి కారణం చెబుతూ.. ‘నేను మోనాల్‌తో దూరం అవడం వల్ల హారికతో క్లోజ్ అవలేదు. అంతకు ముందే బిగ్ బాస్ మా ఇద్దరికీ కనెక్షన్ కుదిర్చాడు. మా ఇద్దరికీ ఓసీడీ ఉందని తెలిశాక క్లోజ్ అయ్యాం. ఆ తర్వాత మా ఇద్దరినీ ఎక్కువగా చూపించారేమో అంతే. ఇంకో విషయం ఏంటంటే హారిక నాకు సిస్టర్ లాంటిది. ఇది ఇదివరకే చెప్పాను' అంటూ వివరించాడు అభి.