Just In
Don't Miss!
- News
జో బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవంలో మెరిసిన నల్లజాతి యువ కవయిత్రి అమండా గోర్మాన్
- Finance
డిసెంబర్ నెలలో గూగుల్ పేను వెనక్కి నెట్టిన ఫోన్ పే
- Sports
IPL 2021: తెలుగు ప్లేయర్లను వదులుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్!
- Automobiles
భారత్‌లో కొత్త వోల్వో ఎస్60 సెడాన్ విడుదల : ధర & ఇతర వివరాలు
- Lifestyle
Shukra Neeti Rules : ఇలా చేస్తే మీ వయసు మంచులా కరిగిపోతుందని మీకు తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫైనల్‌కు చేరేందుకు అభిజీత్ మాస్టర్ ప్లాన్: అదిరిపోయే గేమ్‌తో వాళ్లను చిత్తు చేశాడు!
అభిజీత్.. అభిజీత్.. అభిజీత్.. కొద్ది రోజులుగా ఎవరి నోట విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. దీనికి కారణం అతడు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అసాధారణ ఆటతో రాణిస్తుండడమే. ఈ కారణంగానే అతడికి బయట ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాదు, ఈ సీజన్‌కు అభినే విన్నర్ అవుతాడని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అసలు ఈ యంగ్ హీరోకు మంచి పేరు రావడానికి మైండ్ గేమర్ అనే పేరు ఉండడం కూడా కారణమే. ఇప్పటికే ఎన్నోసార్లు తన సత్తాను నిరూపించుకున్న అభిజీత్.. తాజాగా మరోసారి మాస్టర్ ప్లాన్‌తో రాణించాడు. వివరాల్లోకి వెళ్తే...

ట్రాకులతో హైలైట్ అయిన అభిజీత్
‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అభిజీత్. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు దక్కలేదు. కానీ, బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన తర్వాత అతడు విపరీతమైన ఫాలోయింగ్‌ను అందుకున్నాడు. మరీ ముఖ్యంగా మోనాల్ గజ్జర్, దేత్తడి హారికతో లవ్ ట్రాకులు నడుపుతూ బాగా హైలైట్ అయిపోయాడు.

మాస్టర్ మైండ్ గేమ్‌తో హాట్ టాపిక్
నాలుగో సీజన్ ఆరంభంలోనే జరిగిన ఓ టాస్కులో మాస్టర్ మైండ్‌తో తన జట్టుకు విజయం అందించడంతో ద్వారా అభిజీత్ బాగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ సమయంలో ప్రత్యర్థి జట్టు సభ్యులు అతడిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడినా ఏమాత్రం చలించకుండా ఉండిపోయాడు. దీంతో అతడికి సానుభూతి కూడా బాగా వచ్చింది. అలాగే మిస్టర్ కూల్ అన్న పేరూ దక్కింది.

అదే దెబ్బకొట్టడంతో విమర్శల వర్షం
ప్రతి టాస్క్‌కు సంబంధించి అభిజీత్ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తుంటాడు. అందుకే బిగ్ బాస్ పంపే లెటర్‌ను పలుమార్లు చదువుతూ ఉంటాడు. ఆ సమయంలోనే తన బుర్రకు పని చెబుతుంటాడు. మైండ్‌తో ఎంత పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేస్తాడో.. టాస్కులను శారీరకంగా ఆడలేడన్న చెడ్డ పేరును సైతం మూటగట్టుకున్నాడు. ఈ కారణంతోనే పలుమార్లు నామినేట్ అయ్యాడు.

అభిజీత్ నామస్మరణతో కొత్త ట్రెండ్
బిగ్ బాస్ నాలుగో సీజన్ ఎవరు గెలుస్తారన్న దానిపై బయట ఎటువంటి చర్చలూ జరగడం లేదు. దీనికి కారణం ఈ సీజన్‌ను అభిజీతే గెలుచుకుంటాడని దాదాపు అందరూ ఫిక్స్ అయ్యారు కాబట్టి. అంతలా అతడి ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే అతడి పేరుతో ట్విట్టర్‌లో ఎన్నో ట్యాగ్‌లు ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల నాగార్జునను సైతం ట్రోల్ చేశారు అభి ఫ్యాన్స్.

మాస్టర్ ప్లాన్‌తో వాళ్లను చిత్తు చేసి
ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో ‘రేస్ టు ఫినాలే' టాస్క్ మొదలైంది. మొదటి లెవెల్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న ఆవు నుంచి వచ్చే పాలను తమ దగ్గర ఉన్న బాటిల్స్‌లో నింపుకోవాలి కంటెస్టెంట్లు. ఈ టాస్కులో అఖిల్, సోహెల్ అందరినీ తోసేసి పాలు నింపుకున్నారు. అలాంటి సమయంలో అభిజీత్ తన మాస్టర్ మైండ్‌కు మరోసారి పని చెప్పి సక్సెస్ అయ్యాడు.

సత్తా నిరూపించుకున్న మిస్టర్ కూల్
పాలను నింపుకునేందుకు కంటెస్టెంట్లకు ఓ మగ్, ఓ క్యాన్ ఇచ్చారు. అందరూ వాటితోనే పాలు పట్టుకుని బాటిళ్లలో నింపుకున్నారు. కానీ, అభిజీత్ మాత్రం తన బాటిళ్లను క్యాన్‌లోనే తీసుకొచ్చి, ఎప్పటికప్పుడు వాటిని నింపేశాడు. అంతేకాదు, తన బాటిళ్లను ఎవరూ దొంగిలించే అవకాశం లేకుండా ఆ క్యాన్‌లోనే దాచి పెట్టాడు. ఫలితంగా ఇందులో గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు.