For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ కంటెస్టెంట్ చేసిన పనికి అవాక్కైన నాగబాబు: బిగ్ బాస్ చరిత్రలో తనే బెస్ట్ అంటూ పోస్ట్!

  |

  తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ షో చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లను హీరోలతో సమానంగా కొలిచేస్తున్నారు వాళ్ల అభిమానులు. రియల్ క్యారెక్టర్లతో నడిచే ఈ షో వల్ల ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు బడా సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారు. అందుకే ఈ రియాలిటీ షోపై ఆదరణ పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నాలుగో సీజన్ కంటెస్టెంట్ చేసిన పనికి మెగా బ్రదర్ నాగబాబు అవాక్కైపోయారు. దీంతో బిగ్ బాస్ షో చరిత్రలోనే తనే బెస్ట్ కంటెస్టెంట్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  ఆసక్తికరంగా సాగిన నాలుగో సీజన్

  ఆసక్తికరంగా సాగిన నాలుగో సీజన్

  గత వాటితో పోలిస్తే బిగ్ బాస్ నాలుగో సీజన్ మరింత ఆసక్తికరంగా సాగిందనే చెప్పాలి. సరికొత్త టాస్కులు, లవ్ ట్రాకులు, సర్‌ప్రైజ్‌లు, గొడవలు ఇలా ఎన్నో అంశాల వల్ల షో రంజుగా మారింది. వీటికితోడు సినిమా థియేటర్లు మూతపడి ఉండడంతో ఈ షోకు ప్రేక్షకుల నుంచి ఆదరణ బాగా లభించింది. ఈ కారణంగానే టీఆర్పీ రేటింగ్ విషయంలో ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి.

  సెలెబ్రిటీలు సైతం తొలిసారి స్పందన

  సెలెబ్రిటీలు సైతం తొలిసారి స్పందన

  బిగ్ బాస్ షో తెలుగు సినీ ఇండస్ట్రీపై ఎంతో ప్రభావం చూపిస్తోంది. దీని ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న వారు టాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. ఈ కారణంగానే సినీ సెలెబ్రిటీలు సైతం ఈ షోకు అలవాటు అయిపోతున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రముఖులంతా ఇళ్లకే పరిమితం అవడంతో బిగ్ బాస్ షోను వీక్షించారు. తద్వారా సీజన్‌పై తమ అభిప్రాయాలు వెల్లడించారు.

  అతడికే పట్టం కట్టిన తెలుగు జనం

  అతడికే పట్టం కట్టిన తెలుగు జనం

  ఈ సీజన్‌ మధ్యలో నుంచే బిగ్ బాస్‌కు కాబోయే విన్నర్ విషయంలో అంతా ఓ క్లారిటీకి వచ్చేశారు. బయట ట్రెండ్ ప్రకారం ఈ సారి అభిజీతే గెలుస్తాడని అంతా అనుకున్నారు. అందుకు అనుగుణంగానే గత ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో ప్రేక్షకుల మద్దతుతో అతడు విజేతగా నిలిచాడు. తద్వారా బిగ్ బాస్ టైటిల్‌తో పాటు రూ. 25 లక్షల ప్రైజ్ మనీని సైతం అందుకున్నాడు.

  అదే పనిలో ఉన్న బిగ్ బాస్ విన్నర్

  అదే పనిలో ఉన్న బిగ్ బాస్ విన్నర్

  బిగ్ బాస్ షో ముగిసినప్పటి నుంచి అభిజీత్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నాడు. అదే సమయంలో సోషల్ మీడియాలో లైవ్ చాట్‌ను నిర్వహిస్తున్నాడు. అంతేకాదు, తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నాడు. అలాగే, సినీ సెలెబ్రిటీలను సైతం కలుస్తానని తెలిపాడు. అందుకు అనుగుణంగానే అభిజీత్ తన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాడు.

  అతడు చేసిన పనికి నాగబాబు షాక్

  కొద్ది రోజుల క్రితం మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ.. ‘ఈ సీజన్‌ కంటెస్టెంట్లందరిలో అభిజీత్ టైటిల్ విన్నర్ అవుతాడని అనిపిస్తుంది. షోలో అతడు ఆడే విధానం చాలా నచ్చింది. ఎప్పుడూ ఎంతో కూల్ అండ్ కామ్‌గా కనిపిస్తాడు. కాబట్టి నా ఉద్దేశ్యంలో అభినే విజయం సాధిస్తాడు' అని చెప్పాడు. దీనిని గుర్తు ఉంచుకున్న అభిజీత్.. తాజాగా నాగబాబును కలిసి ధన్యవాదాలు తెలిపాడు.

  బిగ్ బాస్ చరిత్రలో తనే బెస్ట్ అంటూ

  బిగ్ బాస్ చరిత్రలో తనే బెస్ట్ అంటూ

  తనను కలవడానికి వచ్చిన అభిజీత్‌కు శుభాకాంక్షలు తెలియజేశాడు నాగబాబు. అంతేకాదు, తన ట్విట్టర్‌లో దానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడాయన. అలాగే, ‘బిగ్ బాస్ నాలుగు సీజన్లలో బెస్ట్ కంటెస్టెంట్ నువ్వే మై బాయ్ (అభిజీత్). నీ కాన్ఫిడెన్స్, కూల్‌నెస్‌తో నాతో పాటు ఎంతో మంది హృదయాలు గెలుచుకున్నావు' అంటూ అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు.

  English summary
  Abijeet Duddala is an Indian film actor who works in Telugu films. He made his debut as the main lead in the film Life Is Beautiful, directed by Sekhar Kammula in 2012. In 2020, he entered as a contestant in the Telugu reality TV show Bigg Boss 4.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X