For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కొడుకు పెళ్లిపై అభిజీత్ మదర్ క్లారిటీ: అమ్మాయి ఎవరో అలా హింట్.. ఎప్పుడు జరగబోతుందంటే!

  |

  కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేర్లలో అభిజీత్‌ ఒకటి. హీరోగా నటించినా దక్కని గుర్తింపు.. ఆదరణ బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతడి సొంతం అయ్యాయి. అలాగే, ట్విట్టర్‌లో పలుమార్లు ట్రెండ్ అవడంతో దేశ వ్యాప్తంగా హైలైట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే రియాలిటీ షోలో విన్నర్‌గా ఎంపికవడంతో మరింత పాపులర్ అయ్యాడు. అప్పటి నుంచి అతడు ఫుల్ బిజీ అయిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో అభిజీత్ పెళ్లి గురించి అతడి మదర్ క్లారిటీ ఇచ్చారు. ఎవరితో.. ఎప్పుడు జరుగుతుందో చెప్పారు. ఆ వివరాలు మీకోసం!

  రావడం రావడమే మొదలు పెట్టాడు

  రావడం రావడమే మొదలు పెట్టాడు

  సినిమా హీరో స్థాయితో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అభిజీత్. రావడం రావడమే మోనాల్ గజ్జర్‌తో పులిహోర కలపడానికి ప్రయత్నించాడు. ఇలాంటి సమయంలో ఆమె మరో కంటెస్టెంట్ వైపు వెళ్లిపోయి ఇతడికి దూరమైంది. ఇలాంటి సమయంలో దేత్తడి హారికకు అభిజీత్ బాగా దగ్గరయ్యాడు. దీంతో ఈ యంగ్ హీరోకు లవర్ బాయ్ బిరుదు ఇచ్చేశారు ప్రేక్షకులు.

  మైండ్‌ గేమ్‌తో ప్రేక్షకులను గెలిచాడు

  మైండ్‌ గేమ్‌తో ప్రేక్షకులను గెలిచాడు

  బిగ్ బాస్ అంటే టాస్కులు మాత్రమే గెలవడం కాదు.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడం అనే విషయాన్ని నిరూపించాడు అభిజీత్. హౌస్‌లోకి కంటెస్టెంట్లు చెమటోడ్చి మరీ టాస్కులు చేయగా, అతడు మాత్రం బుర్రకు పని చెప్పేవాడు. ఈ విషయాన్ని కంటెస్టెంట్లు గుర్తించకున్నా ప్రేక్షకులు తమ ఓట్ల ద్వారా అభికి మద్దతు తెలిపారు. ఫలితంగా అతడు విజేతగా నిలిచాడు.

  ఫుల్ బిజీ అయిన అభి.. ఆఫర్ల వర్షం

  ఫుల్ బిజీ అయిన అభి.. ఆఫర్ల వర్షం

  బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అభిజీత్ ఫుల్ బిజీ అయిపోయాడు. న్యూస్ ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్లు చేసే ఇంటర్వ్యూలతో పాటు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నాడు. అదే సమయంలో తనకు మద్దతు తెలిపిన వాళ్లందరికీ ధన్యవాదాలు చెబుతున్నాడు. అంతేకాదు, బిగ్ బాస్ విన్నర్‌కు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారు.

  బయటికి వచ్చాక భారీ షాకిచ్చాడుగా

  బయటికి వచ్చాక భారీ షాకిచ్చాడుగా

  బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో అభిజీత్.. దేత్తడి హారికతో చాలా చనువుగా ఉండేవాడు. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే బయట ‘అభిక' అనే నేమ్ కూడా ట్రెండ్ అయింది. దీంతో పాటు హారిక మదర్ వాళ్ల పెళ్లి గురించి కామెంట్స్ కూడా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అభిజీత్.. ఆమెను తన చెల్లి అని చెప్పి భారీ షాకిచ్చాడు.

  కొడుకు పెళ్లిపై అభిజీత్ మదర్ క్లారిటీ

  కొడుకు పెళ్లిపై అభిజీత్ మదర్ క్లారిటీ

  అభిజీత్ బిగ్ బాస్ హౌస్‌లో ఉండి ఫేమస్ అయితే.. అతడి మదర్ లక్ష్మీ ప్రసన్న బయట నుంచే పాపులర్ అయ్యారు. కుటుంబ సభ్యులు షోలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయ్యారు. అతడు గెలిచిన తర్వాత ఆమె మరింతగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ చిట్ చాట్ కార్యక్రమంలోనే అభిజీత్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారామె.

  అమ్మాయి ఎవరు? వివాహం ఎప్పుడు?

  అమ్మాయి ఎవరు? వివాహం ఎప్పుడు?

  అభిజీత్ పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘వాడికి వచ్చే సంవత్సరం చివర్లో పెళ్లి చేయాలని నిర్ణయించాం. మేము చూసిన అమ్మాయితోనే జరుగుతుంది. ఇప్పటికే కొన్ని మ్యాచెస్ చూశాం.. చూస్తున్నాం. ఇప్పుడు వాడి దృష్టి కెరీర్‌పై ఉంది. అయినప్పటికీ పేరెంట్స్‌గా కొడుక్కి పెళ్లి చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే వచ్చే ఏడాది కచ్చితంగా చేసేస్తాం' అని ఆమె వివరించారు.

  English summary
  Abhijeet Duddala has indeed won the hearts of the mini-screen audiences with his stints inside Bigg Boss Telugu 4. His cool, composed and respectful behaviour towards the other contestants were a few of the many reasons why the young actor bagged the trophy of the season.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X