For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నన్ను కిడ్నాప్ చేశాడు.. పెళ్లికి ముందే గోవాలో భర్తతో హరితేజ..

  By Rajababu
  |
  Bigg Boss Telugu : Hariteja Shares Her First Night Incident With Housemates

  బిగ్‌బాస్ రియాలిటీ షో తర్వాత సినీ నటి, యాంకర్ హరితేజ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి సెలబ్రిటీగా మారిపోవడంతోపాటు పలు అవకాశాలు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. బిగ్‌బాస్‌కు ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొందరికే తెలిసిపోయిన హరితేజ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరికి తెలిసిన సెలబ్రిటీగా మారిపోయింది.

  ప్రస్తుతం ఫిదా అనే కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హరితేజ ఇటీవల అలీ నిర్వహించే ఓ టాక్ షోలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆదర్శ్‌తో కలిసి పాల్గొన్నది. ఈ సందర్భంగా హరితేజ తన ప్రొఫెషనల్ విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలను వెల్లడించింది. హరితేజ వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..

  నేను తిరుపతిలో పుట్టాను..

  నేను తిరుపతిలో పుట్టాను..

  నేను పుట్టి పెరిగింది తిరుపతిలో. అమ్మ కన్నడ, నాన్న తమిళ్. అమ్మమ్మ మరాఠి. మా ఆయన కన్నడి. అంతా మిక్స్‌డ్ ఫ్రూట్ జ్యూస్. మా ఇల్లు ఓ మినీ భారతంలా ఉంటుంది.

  ఆదర్శ్‌తో కలిసి..

  ఆదర్శ్‌తో కలిసి..

  విన్నర్ చిత్రంలో ఆదర్శ్‌తో కలిసి నటించాను. కానీ ఆదర్శ్ నటించాడు అనే విషయం తెలియదు. బిగ్‌బాస్‌లో మాట్లాడుకునే సమయంలో విన్నర్‌లో నటించామని తెలుసుకొని ఆశ్చర్యపోయాం.

  లవ్ కమ్ అరెంజ్డ్‌ మ్యారేజ్

  లవ్ కమ్ అరెంజ్డ్‌ మ్యారేజ్

  నాది ప్రేమతో కూడిన అరెంజ్డ్‌ మ్యారేజ్. తొలుత ప్రపోజ్ చేసింది మా ఆయనే. ముందు నాతో పెళ్లి చూపులు జరిగాయి. ఫస్ట్‌లుక్‌లో నాకు నచ్చలేదు. ఆ తర్వాత రెండేళ్లు అతను నా కోసం వేచి చూస్తున్నాడని తెలుసుకొన్నాను. అప్పుడు మళ్లీ కలిశాం. ఆ తర్వాత ఆయన ప్రపోజ్ చేయడం జరిగింది

  పెళ్లికి ముందే గోవా ట్రిప్‌కు

  పెళ్లికి ముందే గోవా ట్రిప్‌కు

  పెళ్లికి ముందు ఇంట్లో వాళ్లకు తెలియకుండా గోవా ట్రిప్‌కు వెళ్లాం. ఎంగేజ్‌మెంట్‌కు రెండు నెలల ముందు పెళ్లి కన్ఫర్మ్ అయిన తర్వాత గోవాకు వెళ్లాం.
  చిన్నప్పుడు పూలు కొనడానికి వెళ్లినపుడు నన్ను ఒకడు కిడ్నాప్ చేశాడు. వాస్తవానికి ఉదయమే పార్క్ వెళ్లి పూలు కొట్టేయానికి వెళ్లాను. తోటమాలి వెంటపడటంతో నాతో ఉన్నవాళ్లు తలోదారిలో పారిపోయారు.

  కిడ్నాప్‌కు గురయ్యాను..

  కిడ్నాప్‌కు గురయ్యాను..

  అప్పుడు భయపడుతున్న నా వద్దకు ఓ యువకుడు వచ్చి ఏమిటని అడిగాడు. నా ఫ్రెండ్స్ కోసం చూస్తున్నాను అని చెప్పగానే.. గేట్ బయట ఉన్నారు అని చెప్పి నన్ను ఎక్కడికో తీసుకెళ్లి మూతికి గుడ్డ పెట్టేందుకు ట్రై చేశాడు.

  అగంతుకుడిని కొట్టాను

  అగంతుకుడిని కొట్టాను

  ఏదో జరుతుందని ఆందోళనకు గురైన నేను వాడిని బలంగా కొట్టాను. దాంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ సంఘటన చాలా గుర్తుండిపోతుంది. ఆ విషయం గుర్తు చేసుకొంటే చాలా భయంగా కూడా అనిపిస్తుంది.

  లవ్ ఇచ్చిన అబ్బాయిని

  లవ్ ఇచ్చిన అబ్బాయిని

  స్కూల్ డేస్‌లో అనిల్ అనే అబ్బాయి నన్ను బాగా ఇష్టపడ్డాడు. ఎప్పుడూ నన్ను చూస్తూ ఆరాధించాడు. నేను కూడా మామూలుగా ఉండటంతో నా పుస్తకంలో లవ్ లెటర్ పెట్టాడు. ఆ విషయం తెలిసి మా నాన్న అనిల్‌ను చితకకొట్టాడు. అతడిని ఈ మధ్యనే కలుసుకొన్నాను.

  సంసారంలో నిప్పులు పోయకు..

  సంసారంలో నిప్పులు పోయకు..

  ఫస్ట్ క్రష్ ఎవరు అని అలీ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. హాయిగా ఏ గొడవ లేకుండా సంసారం చేసుకొంటున్నాం. ఆ సంసారంలో నిప్పులు పోయడానికి ఇలాంటి ప్రశ్నలు అడుగకండి. తొలిసారి నేను చూసి ఎక్కువగా ఇష్టపడింది చిరంజీవిని. ఇప్పుడు అల్లు అర్జున్ అంటే ఇష్టం. అల్లు అర్జున్‌తో డీజే సినిమా చేశాను. దాంతో నా కోరిక తీరిపోయింది.

  సినీ రంగం నాకు చాలా ఇచ్చింది

  సినీ రంగం నాకు చాలా ఇచ్చింది

  సినీరంగంలోకి ప్రవేశించిన తర్వాత డాన్స్ ప్రాక్టీస్‌కు దూరమయ్యాను. అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత హోదా, డబ్బు లాంటివి నాకు ఎక్కువగా లభించాయి. అమ్మ నాన్నలు ఆర్థికంగా సెటిల్ అయ్యేందుకు ఇండస్ట్రీ తోడ్పడింది.

  English summary
  After Biggboss, Hari Teja becomes top celebrity in Tollywood. He gained so much of popularity. Now she busy with films and Television programs. In situation, She participated in Actor Ali's talk show with actor Aadarash. Hari Teja shared her personal and professional experiences.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X