»   » ప్రియమణి నా లవర్.. రమ్యకృష్ణ డార్లింగ్, శృతి నా సిస్టర్.. జగ్గుబాయ్

ప్రియమణి నా లవర్.. రమ్యకృష్ణ డార్లింగ్, శృతి నా సిస్టర్.. జగ్గుబాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో జగపతిబాబు విలక్షణ నటుడు. మాస్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా ఏ పాత్ర పోషించినా ప్రేక్షకులను మెప్పించారు. మాటలను బట్టి చాలా గంభీరంగా కనిపించినా జగ్గుభాయ్ చాలా సాఫ్ట్‌. తాజాగా ప్రముఖ టెలివిజన్‌కు సంబంధించిన కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా కార్యక్రమంలో యాంకర్ ప్రదీప్‌తో జీవితంలోని పలు విషయాలను పంచుకొన్నారు. సీనియర్ నటులు సౌందర్య, ప్రియమణి, రమ్యకృష్ణ, శృతిహాసన్‌తో ఉన్న అనుబంధాన్ని ఆయన వెల్లడించారు.

ఎవరూ నో చెప్పలేదు..

ఎవరూ నో చెప్పలేదు..

నేను మొదటిసారి లవ్ ప్రపోజల్ చేస్తే ఎవరూ నో చెప్పలేదు. నేను ప్రపోజల్ చేస్తే చాలా మంది అంగీకరించారు. కానీ మా అమ్మే ఒప్పుకోలేదు. నేను ప్రేమించిన ఓ అమ్మాయిని మా అమ్మ ఇష్టపడకపోవడంతో అది లవ్, మ్యారేజ్‌గా మారలేదు.

శృతిహాసన్ నాకు సిస్టర్

శృతిహాసన్ నాకు సిస్టర్

శృతిహాసన్ నాకు చెల్లెలు లాంటింది. ఒకే రాశి వాళ్లం. నేను, ఆమె చాలా మెంటల్ పనులు చాలా చేస్తాం. మెంటల్ పనులు చేయడంలో ఎప్పుడూ ముందుంటాం. శృతిహాసన్ చాలా టాలెంటెడ్. చాలా సాంప్రదాయంగా కనిపిస్తున్నే బ్రహ్మండంగా ఇంగ్లీష్ పాటలు పాడేస్తుంటుంది. శృతి మల్టీ టాస్క్‌డ్ పర్సనాలిటీ, మాల్టీ టాలెంటెండ్ పర్సనాలిటీ.

ప్రియమణి నా లవర్..

ప్రియమణి నా లవర్..

కార్యక్రమంలో పలువురు హీరోయిన్ల పేర్లు చెప్పి వారితో అనుబంధం, వారిపై ఆయనకున్న అభిప్రాయం చెప్పమనగా. ప్రియమణి నాకు లవర్ లాంటిది. రమ్యకృష్ణ డార్లింగ్, త్రిష చాలా హాట్, మమత మోహన్ దాస్ నాకు ఫ్రెండ్ లాంటింది అని జగపతి నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్పారు.

రమ్యకృష్ణ నా డార్లింగ్

రమ్యకృష్ణ నా డార్లింగ్

రమ్యకృష్ణ గత జనరేషన్ వాళ్లతోపాటు ఈ జనరేషన్ వారికి కూడా డార్లింగే. ఇప్పటి కుర్రకారు కూడా రమ్యకృష్ణను అభిమానిస్తారు. ఆమె కూడా తన అందాన్ని, గ్లామర్ కాపాడుకుంటున్నది. రమ్యకృష్ణ అద్భుతమైన నటి అని జగ్గుబాయ్ అన్నారు.

సౌందర్య అంటే చాలా ఇష్టం..

సౌందర్య అంటే చాలా ఇష్టం..

ప్రముఖ నటి సౌందర్య, ఆమె బ్రదర్ అమన్ అంటే నాకు మంచి స్నేహితులు. ఆమెతో అనుబంధం చాలా ప్రత్యేకమైనది. సౌందర్య చనిపోయిన వార్త తెలిసినప్పుడు నేను నా భార్యతో కలిసి మలేషియాలో ఉన్నాను. ఆ సమయంలో మసాలా దోశ తింటుండగా దుర్వార్త తెలిసింది అని సౌందర్యతో ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చారు.

ఆత్మహత్య చేసుకొంటానని..

ఆత్మహత్య చేసుకొంటానని..

ఇమేజ్‌కు భిన్నంగా వ్యవహరించడం, బ్రేక్ రూల్స్ అంటే తనకు ఇష్టం. ఫ్యామిలీ హీరోగా ముద్ర పడిన సమయంలో అంతఃపురం సినిమాలో ఓ పాత్ర చేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా మంది వద్దని అన్నారు. నా ఫ్యాన్స్ సూసైడ్ చేసుకొంటామని బెదిరించారు. అయితే వారిని ఎలాగోలా ఒప్పించి ఆ పాత్రను చేశాను అని జగ్గుభాయ్ అన్నారు. ఆ పాత్రకు అవార్డు వచ్చింది. అప్రిషియేషన్ వచ్చింది అని అన్నారు.

షారుక్ ప్రశంస..

షారుక్ ప్రశంస..

అంతఃపురం చిత్రంలోనే పాత్రకు సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కూడా అభినందించారు. చనిపోయే సీన్‌ను జగపతిబాబు చేసినట్టుగా నేను చేయలేకపోయాను అని చెప్పడం నా జీవితంలో నాకు వచ్చిన గొప్ప ప్రశంస అని జగపతి అన్నారు.

English summary
Actor Jagapathibabu reveals his key point of the life in Koncham Touch Lo Unte Chepta of Pradeep Machiraju show. He said Shruti Haasan is like my sister and Actor Priyamani is like my lover. He told Very family bonding with actor Soundharya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu