బిగ్ బాస్ వల్ల కెరీర్ ఏమీ బాగుపడదు.. నవదీప్ వివాదాస్పద వ్యాఖ్యలు
నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ నవదీప్ ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అగ్ని పరీక్షకు జడ్జీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కామన్ మెన్ ఎంపిక ప్రక్రియ బాధ్యతలను మొత్తం ఆయనే చూస్తున్నారు. ఎవరిని ఎంపిక చేయాలి, ఎవరిని ఎంపిక చేయొద్దనే విషయాలపై ఆసక్తికరంగా బిగ్ బాస్ అగ్నిపరీక్షను కొనసాగిస్తున్నారు. నవదీప్ తో పాటు బిగ్ బాస్ అగ్నిపరీక్షకు బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ అభిజీత్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ బిందు మాధవి అగ్నిపరీక్ష కార్యక్రమాన్ని జడ్జీలుగా కొనసాగిస్తున్నారు. బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తోంది.
ప్రస్తుతం బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఆసక్తికరంగా సాగుతోంది. బిగ్ బాస్ సీజన్ 9కు సెలెబ్రెటీ కంటెస్టెంట్స్ తో పాటు కామన్ మెన్ ఎంట్రీ కూడా ఉండటంతో వారి ఎంపికకు ఇలా అగ్ని పరీక్షను నిర్వహిస్తున్నారు. బిగ్ బాస్ లోకి ఇద్దరు కామన్ మెన్ లను పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు పలు దశల్లో నెగ్గి ముందుకు వచ్చిన కంటెస్టెంట్స్ తో జడ్జీలు ఆసక్తికరంగా మాట్లాడుతున్నారు. వారి అభిమానులకు భిన్నంగా, వారి నమ్మకాలకు వ్యతిరేకంగా స్పందిస్తూ షాకింగ్ గా తీర్పులిస్తున్నారు. దీంతో అసలు కామన్ మెన్ సెలెక్షన్ ఏ ప్రాతిపాదిక చేస్తున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఇదెలా ఉంటే.. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కుతోంది. ఈ షోను వీక్షించే వారు లక్షలు, కోట్లల్లో ఉంటే, ఈ హౌజ్ లోకి వెళ్లాలని కనీసింగా వేలల్లో ప్రయత్నిస్తున్నారు. బిగ్ బాస్ హౌజ్ లో టాస్క్ లు ఆడి బుల్లితెర ప్రేక్షకుల ఆదరణ పొందాలని ఎంతో మంది కోరుకుంటున్నారు. అలాగే బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్తే సినిమా అవకాశాలు వస్తాయని, కెరీర్ మారిపోతుందని, లైఫ్ సెట్ అవుతుందనే ఆశలు కొంతమంది కంటెస్టెంట్స్ లో ఉన్నాయి. అయితే తాజాగా ఆ విషయంపై తాజాగా నవదీప్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
బిగ్ బాస్ షోకు రావడం వల్ల కెరీర్ లు ఏమీ బాగుపడవని మొహం మీదే నవదీప్ చెప్పారు. ఇక సినిమా ఆఫర్లు రావు అని, లైఫ్ సెటిల్ అవుతుందనుకోవడం పొరపాటనే తరహాలో మాట్లాడుకొచ్చారు. అయితే అగ్నిపరీక్షలో ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ తో లైఫ్ మారిపోతుందని భావిస్తున్నట్టు చెప్పుకోవడంతో నవదీప్ ఇలా షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. అసలు బిగ్ బాస్ వల్ల కంటెస్టెంట్స్ కు మంచి పేరు, డబ్బులు, సినిమా ఆఫర్లు వస్తాయని ఆశిస్తూ ప్రయత్నాలు చేసే వారికి నవదీప్ కామెంట్స్ సమాధానాలుగా మారాయి.
ఇక రీసెంట్ గానూ బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ విన్నర్ కౌశల్ కూడా బిగ్ బాస్ వల్ల కెరీర్ సెట్ అవ్వుద్దనుకోవడం తప్పు అని పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. తను టైటిల్ గెలుచుకున్న తర్వాత బిగ్ బాస్ విన్నర్ అని చెప్పడం వల్ల చాలా అవకాశాలు దగ్గరికి వచ్చి వెళ్లాయని, కొందరైతే రిజెక్ట్ చేశారని చెప్పారు. ఇప్పుడు నవదీప్ మరోసారి ఇలా స్పందించారు.


Click it and Unblock the Notifications











