నవదీప్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం.. ఇప్పటికీ బ్యాచిలర్‌గానే.. ఎందుకో తెలుసా
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నవదీప్ తన చిత్రాలతో ప్రేక్షకులకు ఎంతగానో అలరించారు. తనదైన శైలి పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇటు టెలివిజన్ ప్రజెంటర్ గానూ బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందారు. 2004 నుంచి నవదీప్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇండస్ట్రీలో 21 ఏళ్లను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం అటు హీరోగా, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. మరోవైపు టీవీ ప్రేక్షకులను పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ద్వారా కూడా అలరించిన సంగతి తెలిసిందే.
ఇక నవదీప్ 1986 జనవరి 26న జన్మించారు. రావు మాధవి, రమా రావు ఆయన తల్లిదండ్రులు. ఆయనకు చెల్లి దీప్తి కూడా ఉన్నారు. ఇక నవదీప్ చిన్న వయస్సులోనే తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. 18 ఏళ్లకే హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. 2004లో జై అనే చిత్రంతో ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యి, తన నటనతో అందరి ప్రశంసలు అందుకున్నారు. అలాగే గౌతమ్ ఎస్ఎస్సీ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమాలో నవదీప్ అమాయకత్వం ఆడియెన్స్ ను భావోద్వేగానికి గురి చేసేలా ఉంటుంది. ఇప్పటికీ గౌతమ్ ఎస్ఎస్సీ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు.

మరోవైపు నవదీప్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో కంటెస్టెంట్ గా ఎంపికై బుల్లితెర ఆడియెన్స్ కు ఎంటర్ టైన్ మెంట్ ను అందించారు. ఇక తాజాగా బిగ్ బాస్ తెలుగు అగ్నిపరీక్షకు జడ్జీగానూ వ్యవహరించారు. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ ఎంపికలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో నవదీప్ ను ఒక లేడీ కంటెస్టెంట్ నేను ఆడ నవదీప్ ను అంటూ కామెంట్ చేయడం, నవదీప్ అందుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం, నేను సింగిల్ అని చెప్పలేదే అంటూ బదులివ్వడం ఇటీవల వైరల్ గా మారింది. ఈ క్రమంలో అసలు నవదీప్ ఎందుకు పెళ్లి చేసుకోలేదనే విషయాలపై ఆడియెన్స్ సందేహిస్తున్నారు.
తన పెళ్లిపై ఒక ఇంటర్వ్యూలో నవదీప్ క్లారిటీ ఇచ్చారు. తనకు జీవితంలో పలువురు అమ్మాయిలతో బ్రేక్ లు అయ్యాయని చెప్పారు. అయితే బ్రేకప్ తర్వాత జరిగే పరిణామాలతో మన వ్యక్తిత్వం ఆధార పడి ఉంటుందన్నారు. ఒకరు ఇద్దరు అమ్మాయిలు తనపై బ్రేకప్ తర్వాత బ్యాడ్ కామెంట్స్ చేసి ఉన్నారని తెలిపారు. అయితే తన పెళ్లి గతంలో దగ్గుబాటి రానా తర్వాత చేసుకుంటానని చెప్పారు. పెళ్లిపై ఇప్పట్లో ఆలోచన లేదని, ఇంట్లో ఒత్తిడి ఉన్నా అలా కొనసాగిపోతుందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇంటర్వ్యూలో నాతో నేను రిలేషన్ షిప్ లో ఉన్నానని చెప్పారు. నా లోపల ఉన్న నవదీప్ ఎప్పుడు చెబితే అప్పుడు పెళ్లి చేసుకొంటానన్నారు. ఇక ఇప్పట్లో పెళ్లి లేదని పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.
రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు అగ్ని పరీక్షలో నవదీప్ తను సింగిల్ కాదని వ్యాఖ్యానించారు. దీంతో త్వరలో నవదీప్ పెళ్లి ఉంటుందని అంతటా గుసగుసలు మొదలు అయ్యాయి. ప్రస్తుతం నవదీప్ 39 ఏళ్లకు చేరుకున్నారు. వచ్చే జనవరితో 40వ ఏట అడుగుపెట్టబోతున్నారని ఆ లోపే పెళ్లి చేసుకునే అవకాశం ఉందని పుకార్లు నడుస్తున్నాయి. ఏదేమైనా తమ అభిమాన హీరో ఎప్పుడు ఓ ఇంటి వాడు అవుతాడోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











