Just In
Don't Miss!
- News
తెలంగాణపై సవతి ప్రేమ.. నిధుల విడుదలపై నిర్లక్ష్యం.. కేంద్రంపై తలసాని ఫైర్
- Sports
ఆస్ట్రేలియా ప్రదర్శన నాన్నకే అంకితం.. ఆయన లేని లోటు తీర్చలేనిది: మహ్మద్ సిరాజ్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Finance
Sensex @50,000: కాంగ్రెస్ గెలుపుతో ఢమాల్! ఇదీ సెన్సెక్స్ చరిత్ర!!
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షాకింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్.. బిగ్‌బాస్ మంచోడి లుక్కు మామూలుగా లేదే!!
సీరియల్ యాక్టర్, బిగ్ బాస్ ఫేమ్ రవికృష్ణ అందరికీ సుపరిచితుడే. బుల్లితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి హీరోగా ఎదిగాడు. ఈ క్రమంలో ఎన్నో యేళ్లు శ్రమించాడు. బిగ్ బాస్ షోలో రాకముందు ఉన్న క్రేజ్‌కు బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చాక వచ్చిన క్రేజ్‌కు ఎంతో తేడా ఉంది. బిగ్ బాస్ షోలో రవికృష్ణకు పాజిటివ్ ఇమేజే వచ్చింది. అయితే అతి మంచోడు అన్న ట్యాగ్ వచ్చిన సంగతి తెలిసిందే. షోలో కొన్ని సార్లు రవికృష్ణపై నెగెటివిటీ వచ్చినా మొత్తంగా చూసుకుంటే మంచి పేరు వచ్చింది. కొత్త బంధాలు, స్నేహితులను సంపాదించుకున్నాడు.

షోతో ఫేమస్..
బిగ్ బాస్ షోతో రవికృష్ణ బాగానే ఫేమస్ అయ్యాడు. మరీ ముఖ్యంగా తమన్నా సింహాద్రి విషయంలో పాటించిన సహనం, ఓర్పు అన్నీ కూడా ప్రేక్షకుల మనసును దోచింది. అందుకే రవికృష్ణకు మంచోడు అనే ట్యాగ్ కూడా వచ్చింది. అయితే ఇంట్లో గొడవలు జరిగిన ప్రతీ సారి తప్పించుకోవడంతో అతి మంచోడు, కన్నింగ్ అంటూ కొందరు ట్రోల్స్ చేశారు....

వారితో స్నేహం..
సీరియల్ నటులైన రోహిణి, అలీ రెజా, హిమజలు ముందు నుంచి పరిచయం ఉండటంతో వీరితో మామూలుగానే కలిసిపోయాడు. ఇక శివజ్యోతితో మరింత క్లోజ్ అయ్యాడు. సొంతింటి మనుషుల్లా, అక్కతమ్ముడిలా మారిపోయారు. బయటకు వచ్చాక కూడా అదే బంధాన్ని కొనసాగిస్తూ ఇరు కుటుంబాలు దగ్గరయ్యాయి.

లాక్ డౌన్‌లో అలా..
లాక్ డౌన్‌లోనూ వీరంతా ఒకే చోట కలిసి సందడి చేసేవారు. హిమజ, శివజ్యోతి, రవికృష్ణ ఎప్పుడూ ఒకే చోట ఉండేవారు. అందరూ కలిసి శివ జ్యోతి ఇంట్లో లాక్డౌన్‌ను ఎంజాయ్ చేశారు. షూటింగ్‌లు మొదలు పెట్టడంతో రవికృష్ణ సెట్‌లో అడుగుపెట్టాడు. ఆమె కథ సీరియల్ షూటింగ్‌లో ఉండగా రవికృష్ణకు కరోనా సోకింది. మొత్తానికి ఇంట్లోనే చికిత్స తీసుకుని కరోనా నుంచి కోలుకున్నాడు.

అది నాకు తెలుసు..
నీ కష్టం ఉత్తగనే పోదు నాని.. నాకు తెలుసు ఈ ఫిట్‌నెస్ కోసం ఎన్ని త్యాగాలు చేస్తున్నవో నాకు తెలుసు. ఎంతో డెడికేట్‌తో చేస్తున్నావ్.. ఇలా ముందుకు వెళ్లు నాన్న అంటూ రవికృష్ణపై ప్రేమను కురిపించింది. ఇక రవికృష్ణ బాడీని చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. లవర్ బాయ్‌లా ఉన్న రవి.. యాక్షన్ హీరోలా మారేందుకు గట్టిగానే ట్రై చేస్తున్నట్టు కనిపిస్తోంది.