‘హీరోగా ఛాన్స్ అడిగితే.. గడ్డం తీయించారు.. ర్యాంగింగ్ కూడా’

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజా సజ్జా ప్రస్తుతం సూపర్ యోధా ఫిల్మ్ మిరాయ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంప వ్యాప్తంగా అలరిస్తోంది. సెప్టెంబర్ 12న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమాకు ప్రేక్షకుల నుంచే కాకుండా బాక్సాఫీస్ నుంచి కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఈ క్రమంలో మిరాయ్ పోస్ట్ ప్రమోషన్స్ లో భాగంగా తేజా సజ్జా పలు షోలకు హాజరవుతున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో గా వెలుగొంది, ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దుమ్ములేపుతున్నారు జగపతి బాబు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మరోవైపు ఇటీవల జయమ్ము నిశ్చయమ్ము రా (Jayammu Nischayammu Raa) అనే సెలెబ్రెటీ టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జీ తెలుగులో ఈషో ప్రసారం అవుతోంది. ఇప్పటికే ఈ షోకు అక్కినేని నాగార్జున, నాని, సందీప్ రెడ్డి వంగ, రామ్ గోపాల్ వర్మ, మీనా, శ్రీలీలా వంటి స్టార్లు హాజరై సందడి చేశారు.

Actor Teja Sajja Interesting Comments about Director Nandini Reddy

ఇక తాజాగా యంగ్ అండ్ టాలీవుడ్ సెన్సేషనల్ హీరో తేజా సజ్జా కూడా హాజరయ్యారు. ఆయనతో పాటు లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి కూడా హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా నందిని రెడ్డి గురించి తేజా సజ్జా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తనకు హీరోగా సినిమా చేయాలని ఆలోచన వచ్చి ఆడిషన్స్ కు వెళ్తున్న సమయంలో నందిని రెడ్డి దగ్గరకు వెళ్లినట్టు చెప్పారు. తనపై ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ అనే ముద్ర పోయి హీరోగా గుర్తింపు రావడం కోసం మంచి అవకావం కోసం తిరుగుతున్నట్టు చెప్పారు.

తన మొదటి సినిమాకు హీరోగా అవకాశాల కోసం చాలా ఆడిషన్స్ ఇచ్చాను. ఇక నందిని రెడ్డి హో బేబీ చిత్రానికి ఆడిషన్ కు వెళ్తే.. గడ్డం మీసం తీసుకొని రమ్మని చెప్పింది. నేనేమో చైల్డ్ ఆర్టిస్ట్ గా ముద్ర పోవాలని గడ్డం పెంచుకొని వస్తే ఆమె తీసేయమని చెప్పింది. ఆ ఆడిషన్ లో నన్ను ర్యాగింగ్ కూడా చేసింది. ఏదేమైనా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభుతో కలిసి తనకు మంచి పాత్రను డిజైన్ చేసింది నందిని రెడ్డి. ఆ సినిమా వల్ల నాకు ఎక్కువ మేలు జరగాలనే చూసింది. అందుకు చాలా థ్యాంక్స్... అని చెప్పుకుంటూ వచ్చారు.

మరోవైపు నందిని రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి రోజూ షూటింగ్ లో తేజా సజ్జాతోనే ఫస్ట్ షార్ట్ జరిగేది. డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు చాలా సానుకూలంగా ఉంటారు తేజా సజ్జా. డైరెక్టర్ 6 గంటలకు, 7 గంటలకు సెట్ లో ఉండాలని చెబితే సరిగ్గా సమయానికి ఉంటాడు. హో బైబీ చిత్రం నుంచి ఇప్పుడు మిరాయ్ వరకు కూడా అలానే ఉండటం.. ఆ లక్షణం నాకు తేజా సజ్జాలో బాగా నచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X