»   » ‘బిగ్ బాస్’ ఇంట్లో కొత్త పాప ఈవిడే, తప్పు చేశానంటూ సంపూ ఉద్వేగం!

‘బిగ్ బాస్’ ఇంట్లో కొత్త పాప ఈవిడే, తప్పు చేశానంటూ సంపూ ఉద్వేగం!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ఊహించని మలుపులు, ట్విస్టులతో కొనసాగుతున్న 'బిగ్ బాస్' తెలుగు రియాల్లీ షో సరికొత్త గట్టానికి చేరుకుంది. విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ రియాల్టీ షో నుండి 14 మంది పోటీ దారుల్లో ఇప్పటి వరకు మొత్తం ముగ్గురు బయటకు వెళ్లగా.... వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హాట్ హాట్ బ్యూటీ ఇంట్లోకి ఎంటరయ్యారు.

  తొలి వారంలో జ్యోతి, రెండో వారంలో సింగర్ మధు ప్రియ ఎలిమినేట్ అవ్వగా.... బిగ్ బాస్ ఇంట్లో నాలుగు గోడల మధ్య పరిస్థితులు తట్టుకోలేక మెంటల్‌గా డిస్ట్రబ్ అయిన సంపూర్ణేష్ బాబు తనంతట తానుగా బయటకు వచ్చేశాడు. బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వచ్చిన సంపూ, మధుప్రియ అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు షో హోస్ట్ ఎన్టీఆర్.

  మధుప్రియ ఆత్మవిశ్వాసం

  మధుప్రియ ఆత్మవిశ్వాసం

  బిగ్ బాస్ ఇంట్లో ఉన్నన్ని రోజులు తన ప్రపంచాన్ని మిస్సవుతున్నానంటూ ఎప్పుడూ ఏడుస్తూ కనిపించిన మధు ప్రియ.... ఇంటి నుండి బయటకు వచ్చాక ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో కనిపించారు. ఏది ఉన్నా, లేకున్నా బ్రతకగలను అనే ధైర్యం వచ్చిందన్నారు.

  Bigg Boss : Jr Ntr Show Facing Problems Due To Mumaith Khan, Watch Here
  విన్నర్ ఎవరు?

  విన్నర్ ఎవరు?

  మీ దృష్టిలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు? అనే ప్రశ్నకు మధు ప్రియ స్పందిస్తూ.... ధనరాజ్ బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కల్పనలో కొన్ని సందర్భాల్లో మానవత్వం లేదనే అభిప్రాయం కలిగిందన్నారు. సమీర్ బ్యాడ్ హౌస్ మేట్‌గా పేర్కొన్న మధు ప్రియ అతడు మన ముందు ఒకలా, బయట ఒకలా ఉంటారని అభిప్రాయ పడ్డారు. కార్తీకను గుడ్ పర్సన్‌గా పేర్కొన్న మధు, ఆమె తనకు అన్ని విషయాల్లో ధైర్యం చెప్పిందన్నారు.

  ఇంటి సభ్యులపై మధు ప్రియ అభిప్రాయాలు, మార్కులు

  ఇంటి సభ్యులపై మధు ప్రియ అభిప్రాయాలు, మార్కులు

  ముమైత్ ఖాన్: స్ట్రేట్ పార్వడ్ (7 మార్కులు)

  సమీర్: డబుల్ గేమ్ ( 7 మార్కులు)
  ధనరాజ్ : గుడ్ హార్టెడ్ (8 మార్కులు)
  ప్రిన్స్ : గోడమీద పిల్లి (7 మార్కులు)
  కల్పన : అర్థం కాలేదు కానీ మంచిదే ( 7 మార్కులు)
  మహేష్ కత్తి : న్యూట్రల్ (6 మార్కులు)
  ఆదర్శ్ : పర్ఫెక్ట్ ప్లేయర్ (8 మార్కులు)
  శివ బాలాజీ: గుడ్ పర్సన్, కోపం ఎక్కువ (8 మార్కులు)
  కార్తీక: నైస్, ముక్కుసూటి మనిషి (8 అండ్ హాఫ్)
  అర్చన: నటించే వ్యక్తిత్వం (5 అండ్ హాఫ్)
  హరితేజ: అందరితో బానే ఉంటారు కానీ మనసులో ఏముందో అర్థం కాదు (6 మార్కులు)

  బిగ్ బాంబ్

  బిగ్ బాంబ్

  మధు ప్రియకు ఇచ్చిన బిగ్ బాంబ్ అవకాశంతో..... కల్పనకు, అర్చన సేవకురాలు ఉండాలని డిసైడ్ చేసింది. అర్చన రోజూ కల్పన బెడ్ సర్దాలని, ఆవిడకు అన్నం వడ్డించాలని, కెప్టెన్ కల్పనకు అప్పజెప్పే పనులు కూడా అర్చన చేయాలని మధు ప్రియ డిసైడ్ చేసింది.

  తప్పు చేశా, ఏడ్చేశాను: సంపూ

  తప్పు చేశా, ఏడ్చేశాను: సంపూ

  సంపూ మాట్లాడుతూ....ఇంటి నుండి అర్ధాంతరంగా బయటకు వచ్చినందుకు ప్రేక్షకులు నన్ను క్షమించాలి. మాది చిన్న పల్లెటూరు. ఒక చిన్న నటుడవ్వాలనుకున్నా. కానీ స్టీవెన్ శంకర్ హృదయ కాలేయం ద్వారా హీరో చేశాడు. బిగ్ బాస్ తొలి సీజన్లో అవకాశం రావడం నా అదృష్టం. కానీ నేను ఆ ఇంట్లో ఉండలేక పోయాను. నాకు తెలియకుండా నాలుగు గోడల మధ్య బంధించినట్లు అనిపించింది. బయట అడుగు పెట్టాక తప్పు చేశానని ఫీలయ్యాను. అరగంట ఏడ్చాను అని సంపూ తెలిపారు.

  ఫేస్ బుక్‌లో దారుణంగా

  ఫేస్ బుక్‌లో దారుణంగా

  నేను బయటకు వెళ్లిన తర్వాత నువ్వు వేస్ట్‌రా అంటూ ఫేస్ బుక్ లో చాలా కామెంట్స్ వచ్చాయి. మనుషులంతా ఒకటే, కానీ మానసిక స్థితిగతులు వేరు, అందులో నా మానసిక స్థితి వేరు, బయటకు వచ్చాక ఎంత పెద్ద తప్పు చేశానని అరగంట ఏడ్చేశాను అని సంపూ తెలిపారు.

  వైల్డ్ కార్డ్ ఎంట్రీ..... దీక్షా పంత్

  వైల్డ్ కార్డ్ ఎంట్రీ..... దీక్షా పంత్

  బిగ్ బాస్ ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరు వస్తున్నారో అనే ఉత్కంఠకు తెరపడింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అనసూయ, రష్మి, హంసా నందిని వస్తుందని అంతా ఊహించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా హాట్ గర్ల్ దీక్షా పంత్ ఎంట్రీ ఇచ్చారు. ఆమెను ఎన్టీఆర్ ప్రేక్షకులకు పరిచయం చేశారు.

  English summary
  Actress Diksha Panth Is The Hot New Wild Card Entrant On Jr NTR's Bigg Boss Telugu Show. Diksha Panth is prominently known for her works in the Telugu industry. She got her first break in the film ‘Gopala Gopala’ that released in the year 2015.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more