Don't Miss!
- News
బాలకృష్ణను వీడని వివాదాలు: కొని తెచ్చుకున్న మరో కాంట్రవర్సీ
- Sports
డోపింగ్ టెస్టులో ఫెయిలైన భారత జిమ్నాస్ట్.. క్షమాపణలు చెప్పిన క్రీడాకారిణి!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బిడ్డ పుట్టగానే తీసుకెళ్లిపోయారు, పక్కన ఎవరు లేరు, ఈ కష్టం ఎవరికి రాకూడదు: బిగ్ బాస్ హరితేజ ఎమోషనల్
నటిగా యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న హరితేజ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా సందడి చేస్తుంటుంది. బిగ్ బాస్ తరువాత ఆమెకున్న క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. అంతకుముందే సీరియల్స్ ద్వారా జనాలకు బాగా కనెక్ట్ అయిన హరితేజ సోషల్ మీడియాతో మరింత దగ్గరయ్యింది. ఎలాంటి విషయం షేర్ చేసుకున్నా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేది. ఇక ఇటీవల ఆమె పాపకు జన్మనిచ్చే సమయంలో ఎవరు ఊహించని చేదు అనుభవాలను ఎదుర్కొన్నట్లు వీడియో ద్వారా వివరణ ఇచ్చింది.
రెజీనా కాసాండ్రా.. చీరలో ఎన్ని అందాలో..

బిగ్ బాస్ షో తరువాత
బిగ్ స్క్రీన్ పై కామెడీ రోల్స్ చేసిన హరితేజ బుల్లితెరపై మాత్రం భయంకరమైన విలనిజాన్ని, శాడిజాన్ని చూపించి తెలుగు వారికి బాగా దగ్గరయ్యింది. ఇక హరితేజ బిగ్ బాస్ షోతో ఇమేజ్ ను పూర్తిగా మార్చేసుకుంది. ఆ తరువాత ఒక్కసారిగా కెరీర్ మొత్తం ఊపందుకుంది. వరుసగా అవకాశాలు కూడా అందుకుంటూ వచ్చింది. బిగ్ బాస్ షోలో టాప్ 3 వరకు వచ్చిన విషయం తెలిసిందే.

ఆ సినిమాలతో మంచి క్రేజ్
బిగ్
బాస్
టైటిల్
గెలవకపోయినప్పటికి
ఆమెకు
మాత్రం
ఆఫర్లు
క్యూ
కట్టేశాయి.
కమెడియన్‌గా
మంచి
పాత్రలనే
అందుకుంది.
అఆ
సినిమాతో
ఆమె
కెరీర్
మరింత
కొత్తగా
మారిపోయింది.
అరవింద
సమేత,
మహర్షి,
హిట్,
F2,
సరిలేరు
నీకెవ్వరు,
ప్రతిరోజు
పండగే,
శ్రీనివాస
కళ్యాణం
వంటి
సినిమాల్లో
కూడా
మంచి
పాత్రలతో
తానేంటో
నిరూపించుకుంది.

బిడ్డ పుట్టగానే చూసుకోలేని పరిస్థితి
ఇక ఇటీవల ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చిన హరితేజ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొందట. బిడ్డ పుట్టగానే కనీసం చూసుకోలేని పరిస్థితి వచ్చిందని భర్త తప్పితే మరొక కుటుంబ సభ్యుడు కూడా డెలివరీ సమయంలో పక్కన లేరని ఎమోషనల్ అయ్యింది. చాలా రోజులకు తన బిడ్డను చూసుకున్నాను అంటూ హరితేజ ఒక వీడియో ద్వారా వివరించింది.

అప్పటికే చేయి దాటిపోయింది
ఆమె మాట్లాడుతూ.. మొదట్లో కరోనా వస్తుంది జాగ్రత్త అనగానే చాలా లైట్ తీసుకున్నాను. అది మన దగ్గరకు రాదులే అనే నిర్లక్ష్యంతో ఉన్నాను. ఇక మరికొన్నాళ్లకు డెలివరీ డేట్ దగ్గరకు వస్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలని అనుకున్నాను. కానీ అప్పటికే చేయి దాటిపోయింది. డెలివరీ సమయంలోనే కరోనా ఉన్నట్లు బయటపడింది.. అని తెలిపారు.

డెలివరీ సమయంలో
ఎలా వచ్చిందో తెలియదు గాని మా ఇంట్లో వాళ్లకు కూడా పాజిటివ్ అని తేలింది. నా భర్తకు మాత్రమే నెగిటివ్ వచ్చింది. నాకు పాజిటివ్ ఉన్నా కూడా వధలకుండా డెలివరీ సమయంలో నా పక్కనే ఉన్నారు. పాప పుట్టగానే కరోనా టెస్టులు వేయించగా నెగిటివ్ అని వచ్చింది. వెంటనే బేబి నుంచి నన్ను దూరంగా పెట్టారు. వీడియో ద్వారా చూసుకోవాల్సి వచ్చింది.
Recommended Video

ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు
నాకు వచ్చిన పరిస్థితి ఎవరికి రాకూడదు అనే ఆలోచనతోనే ఈ వీడియో ద్వారా ఈ విషయాన్ని చెబుతున్నాను. మన కోసం కాకపోయినా కూడా మన ఇంట్లో వాళ్ళ కోసం నిర్లక్ష్యంగా ఉండకుండా వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. కరోనా రాకముందే తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి.. అంటూ హరితేజ ఎమోషనల్ అవుతూ వివరణ ఇచ్చారు.