‘నీవు పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉంటే.. సూసైడ్ చేసుకొంటాం’

సినిమాల్లోనే కాదు... బుల్లితెర మీద కూడా సహనటుల మధ్య లవ్ ట్రాక్‌లు, ఎఫైర్లు జరుగుతూనే ఉన్నాయి. టాలీవుడ్ టూ బాలీవుడ్ ఇలాంటి వాటికి కొదవలేదు. తెలుగు బుల్లితెరపై టాలెంటెడ్ నటీనటులుగా గుర్తింపు తెచ్చుకున్న పలువురు నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. ప్రేమలో పడిన వారిలో కొందరు విడిపోయారు, కొందరు తమ మధ్య ఉన్న బంధాన్ని బయటపెట్టలేకపోతున్నారు. ఇలాంటి కోవలోకే వస్తారు నిఖిల్ మలియాక్కల్- కావ్యశ్రీ జోడీ. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారో? విడిపోయారో? ఎవరికీ తెలియదు. ఈ క్రమంలో ఓ షోలో తనకు కాబోయే భర్త గురించి కావ్య శ్రీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

త్వరలో బిగ్‌బాస్‌లో ఎంట్రీ?
బెంగళూరులో పుట్టి పెరిగిన కావ్య శ్రీ తొలుత కన్నడ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు. నీలి, నాయకి, మహాకాళి తదితర సీరియల్స్‌తో అక్కడ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఫేమ్‌తో తెలుగులోనూ కావ్యకి అవకాశాలు వచ్చాయి. 2019లో గోరింటాకు సీరియల్‌తో తెలుగు ఇండస్ట్రీలో ఆమె అడుగుపెట్టారు. ఆ తర్వాత అమ్మకి తెలియని కోయిలమ్మ, గువ్వా గోరింకా తదితర సీరియల్స్‌తో ఏపీ, తెలంగాణలలో పాపులర్ అయ్యారు. ప్రస్తుతం టెలికాస్ట్ అవుతోన్న బిగ్‌బాస్ తెలుగు 9లో వైల్డ్ కార్డ్ ద్వారా కావ్య కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Actress Kavya Shree Opens up about Future husband in Adivaram With Star Maa Parivaram

నిఖిల్‌తో ప్రేమాయణం
అయితే గోరింటాకు సీరియల్‌లో తనతో పాటు నటించిన మరో కన్నడ నటుడు నిఖిల్‌తో కావ్యకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఈ సీరియల్‌కు సమాంతరంగా వీరి ప్రేమ కథ కూడా ట్రావెల్ అయ్యింది. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో నిలవడంతో పాటు తమ బంధాన్ని బహిరంగంగానే తెలియజేశారు. ఆ తర్వాత పలు షోలలోనూ కావ్య, నిఖిల్‌లు కలిసి పాల్గొన్నారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ నిఖిల్- కావ్యలు విడిపోయారు. పలు షోలలో కలిసి పాల్గొంటున్నా కనీసం పలకరించకుండానే ముఖాలు తిప్పుకుని వెళ్లిపోవడం బుల్లితెర వర్గాలను ఆశ్చర్యపరిచింది. కావ్యతో రిలేషన్‌పై మొన్నామధ్య నిఖిల్ ఓ ఇన్‌డైరెక్ట్ పోస్ట్ పెట్టాడు. పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, ఎవరి జీవితాలు వారివేనని .. తనను ఎవరితోనూ కలపొద్దని , ఎవరి పోస్టులకు తనను ట్యాగ్ చేయొద్దని ప్రేక్షకులను కోరాడు.

సోలో లైఫే బెటర్
ఇకపోతే... శ్రీముఖి హోస్ట్‌గా ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం లేటెస్ట్ ఎపిసోడ్ కావ్యకి కాబోయే భర్త ఉండాలి? అబ్బాయిలలో ఎలాంటి మంచి లక్షణాలు ఉంటే ఇష్టపడతావని శ్రీముఖి అడిగింది. దీనికి ఆన్సర్ ఇచ్చేందుకు స్టేజ్ మీదకు వెళ్తూ.. అసలు పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఇలాగే ఉండిపోవాలని అనిపిస్తుందని చెబుతుంది కావ్య. ఇంత అందం వేస్ట్ అయిపోవద్దు ఓకేనా అని శ్రీముఖి అంటుంది. ఆ వెంటనే ఓ బుల్లితెర నటుడు మాట్లాడుతూ.. కావ్య గారు మీరు సింగిల్‌గా ఉండిపోతే మా లాంటి వాళ్లు ఆత్మహత్య చేసుకోవాలి తెలుసా? అని అనడంతో అందరూ నవ్వేస్తారు.

నాకు వంట చేసి పెట్టాలి
మీ మొట్టమొదటి క్వాలిటీ ఏంటీ? అని శ్రీముఖి అడగ్గా... ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను.. నాకన్నా హైట్ ఉండి, తన డ్రెస్ సెన్స్ బాగుండాలని అంటుంది. దాంతో ఆ నటుడు మరోసారి జోక్యం చేసుకుని ఛీ ఫస్ట్ క్వాలిటీలోనే ఫెయిల్ అయ్యానని చెబుతాడు. కావ్య వెనుక పిక్చర్‌లో షూ వేసుకున్న ఓ వ్యక్తి కాళ్లు కనిపిస్తాయి. నెక్ట్స్ తనకి వంట చేయడం రావాలి... నాకు ప్రతి రోజూ తనే కుక్ చేసి, ఫుడ్ పంపించాలని చెబుతుంది. దాంతో ఆయన ఇంట్లో వండుతూ ఉంటే చాలా అని జబర్దస్త్ రోహిణి సెటైర్లు వేస్తుంది. వర్క్ చేసి వంట చేసినా సరే.. లేదంటే నాకు వంట చేస్తూ గడిపినా చాలు అని చెబుతుంది కావ్య.

ఆ ఒక్కరూ తప్ప ఎవరైనా ఓకే
ఆ వెంటనే వెనుక పిక్చర్‌‌లో ఆ అబ్బాయి చేతుల వరకు కనిపిస్తుంది. కావ్యకు కాబోయే వరుడు అంటూ కంటెస్టెంట్స్ అంతా అరుపులు, కేకలతో గోల గోల చేస్తారు. అందరికీ నిల్చున్న వాళ్లే వచ్చారు .. కానీ నీకు మాత్రం కూర్చొని వెయిట్ చేస్తున్నాడు ఆయన నీకోసం అని శ్రీముఖి చెబుతుంది. నెక్ట్స్ మెయిన్ క్వాలిటీ వచ్చి లోపల ఒకటి, బయటి మరొకటిలా కాకుండా స్ట్రెయిట్ ఫార్వార్డ్ లాగా మాట్లాడాలని చెబుతుంది కావ్య. దాంతో వెనుక పిక్చర్‌లో గడ్డం వరకు కనిపిస్తుంది. నీకంటే మా అందరికీ టెన్షన్‌గా ఉందని శ్రీముఖి పంచ్ వేస్తుంది. ఈ ఫోటో చూసినట్లుగా ఉందని అనడంతో కావ్య కూడా టెన్షన్ పడుతుంది. ఫైనల్ క్వాలిటీ వచ్చేసి ఆ ఒక్కరూ తప్పించి వేరే ఎవ్వరైనా ఓకే అని చెబుతానని అనడంతో కావ్య గారు కుండబద్ధలు కొట్టారని అందరూ గోల చేస్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... ఆ ఒక్కరూ అంటే నిఖిల్ గురించి పరోక్షంగా కావ్య చెప్పిందా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X