Don't Miss!
- Lifestyle
మీ పార్ట్నర్ ఎప్పుడూ మూడీగా ఉంటారా? వారితో వేగలేకపోతున్నారా? ఈ చిట్కాలు మీకోసమే
- News
YS Avinash Reddy : అవినాష్ కు సీబీఐ ప్రశ్నలివే-2గంటలకు పైగా విచారణ-లాయర్ కూ నో ఎంట్రీ..!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Sports
INDvsNZ : ఉమ్రాన్ మాలిక్‌ను తీసేయండి.. రెండో టీ20కి మాజీ లెజెండ్ సలహా!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
Bigg Boss: రేవంత్‌పై హీరోయిన్ సంచలన కామెంట్స్.. ‘తేడా’ కొడుతుంది.. అమ్మాయిలాగే గలీజ్ అంటూ!
తెలుగు టెలివిజన్‌పై ఎన్నో రకాల షోలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోన్నాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ ఒకటి. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టే అయినా తెలుగు ఆడియెన్స్ దీన్ని బాగా ఆదరించారు. ఫలితంగా ఈ షో సూపర్ సక్సెస్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు నడుస్తోన్న ఆరో సీజన్ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇందులో టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న రేవంత్‌పై ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఆ సంగతులు మీకోసం!

ఏకైక టైటిల్ ఫేవరెట్‌గా రేవంత్
ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఆరో సీజన్‌లోకి మొత్తం 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. అందులో చాలా మంది తమ తమ విభాగాల్లో సత్తా చాటిన వారే ఉన్నారు. కానీ, వీళ్లందరిలో ఒకరు మాత్రమే ఆరంభం నుంచే టైటిల్ ఫేవరెట్ అనిపించుకుంటున్నారు. అతడే ప్రముఖ సింగర్ రేవంత్. మొదటి నుంచే తనదైన ఆటతో పోటీ లేకుండా చేస్తూ వస్తున్నాడు.
షర్ట్ విప్పేసిన తెలుగు పిల్ల శ్వేతా నాయుడు.. హాట్ షోతో తెగించిన మెహబూబ్ గర్ల్‌ఫ్రెండ్

నిత్యం గొడవలు... చెడ్డ పేరుతో
బయట భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న సింగర్ రేవంత్.. బిగ్ బాస్ షోలో చక్కగా ఆడుతోన్నా.. తన వ్యవహార శైలితో మాత్రం విమర్శలను ఎదుర్కొంటోన్నాడు. తరచూ గొడవలు పెట్టుకోవడం, ఎదుటి వాళ్లపై లేనిపోని చెప్పడం, అధికారం చెలాయించడం వంటివి చేస్తూ విమర్శలపాలు అవుతున్నాడు. ఇదంతా అతడి ఆటను డామినేట్ చేసి చెడ్డ పేరు తీసుకొస్తోంది.

తల్లి చెప్పిందని గడ్డం తీసేసి
బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నన్ని రోజులూ రేవంత్ గుబురు గెడ్డంతో కనిపించాడు. అయితే, ఫ్యామిలీ వీక్‌లో భాగంగా హౌస్‌లోకి వచ్చిన అతడి తల్లి 'రేవంత్ గడ్డం లైటుగా తీసుకోవచ్చుగా' అని అన్నారు. దీనికతడు 'తను ప్రెగ్నెంట్‌గా ఉందిగా' అని అన్నాడు. దీంతో తల్లి 'ఏం పర్లేదట. తీయొచ్చట' అని చెప్పారు. ఆ వెంటనే వాష్ రూమ్‌లోకి వెళ్లిన రేవంత్ క్లీన్ షేవ్‌తో వచ్చాడు.
జబర్ధస్త్ రీతూ ఎద అందాల ప్రదర్శన: ఈ ఫోజుల్లో ఆమెను చూశారంటే!

తండ్రైన రేవంత్.. టీవీ ద్వారా
ప్రస్తుతం సింగర్ రేవంత్ బిగ్ బాస్ షోలో టైటిల్ కోసం పోటీ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో రేవంత్ భార్య అన్విత ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ అతడికి వెల్లడించాడు. అంతేకాదు, హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చిన తర్వాత టీవీ ద్వారా రేవంత్ తన భార్య అన్వితతో వీడియో కాల్ మాట్లాడుతూ కూతురిని తొలిసారి చూశాడు.

మీసాల్లేవు... హీరోయిన్ పోస్టు
తల్లి చెప్పగానే గడ్డం తీసేసి కోరమీసంతో కనిపించిన రేవంత్.. రెండు రోజుల క్రితమే క్లీన్ షేవ్‌తో దర్శనమిచ్చాడు. ఇందులో మీసాలు మొత్తం తీసేసి పొడవైన జుట్టుకు క్లిప్ పెట్టుకుని కనిపించాడు. దీంతో అతడి లుక్‌పై చాలా మంది ట్రోల్స్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు హీరోయిన్ మాధవి లత.. రేవంత్ గెటప్‌పై సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ చేసింది.
టాప్ విప్పేసిన తెలుగు హీరోయిన్: ఏం చూపించకూడదో అక్కడే హైలైట్ చేసి!

రేవంత్‌పై మాధవి కామెంట్స్
సింగర్ రేవంత్ మీసాలు లేకుండా కనిపించడంపై తెలుగు హీరోయిన్ మాధవి లత స్పందిస్తూ.. 'మీసాలు తీసేసి రేవంత్ గబ్బు గలీజ్ ఉన్నాడు. ఎందుకో మన సౌత్ ఇండియన్స్ మీసాలు తీసేస్తే ఏదో తేడాగా ఉంటారు. నాకు అస్సలు నచ్చలేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీకు నచ్చితే మీ ఇష్టం' అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కామెంట్స్ చేసింది.

గబ్బు గలీజ్.. అమ్మాయిలానే
మరో పోస్టులో మాధవి లత 'ఈ రేవంత్ లుక్ ఏంటో అనిపిస్తుంది కదా మీకు. పొడవాటి జుట్టులో అచ్చం అమ్మాయిలానే ఉన్నాడు. అలాగే, మీసాలు లేకపోవడం వల్ల తేడా కొడుతుంది శాస్త్రి గారూ' అంటూ పోస్ట్ చేసింది. మాధవి లత చేసిన ఈ కామెంట్లపై రేవంత్ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడీ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.