మంచు మనోజ్ ఊరికనే నన్ను అలా అనేవాడు.. వేదికపై ఏడ్చేసిన హీరోయిన్
నటి సదా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును దక్కించుకుంది. నార్త్ మహారాష్ట్రకు చెందిన సదా సౌత్ లోనూ పెరిగింది. బెంగళూరుకు చెందిన ఫ్యామిలీలో పుట్టింది. అలా సదాకు సౌత్ ఇండియా గుర్తింపు దక్కింది. ఇక సదా 2002 నుంచి చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా కనిపిస్తోంది. తొలుత జయం సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది. 20 ఏళ్లకు పైగా హీరోయిన్ గా దక్షిణాది చిత్రాల్లో నటించి మెప్పించింది. పలు సూపర్ హిట్ సినిమాల్లోనూ నటించి గుర్తుండిపోయేలా చేసింది. తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.
సదా తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఎక్కువ సినిమాలు చేసింది. జయం, ప్రాణం, నాగా, దొంగా దొంగది, అపరిచితుడు, ఔనన్నా కదాన్న, చుక్కల్లో చంద్రుడు, టక్కరి, మైత్రీ, యమలీలా వంటి చిత్రాల్లో నటించింది. అలాగే పలు హిందీ ఫిల్మ్స్ లోనూ నటించింది. ఇక సదా, మంచు మనోజ్ సరసన నటించిన చిత్రం దొంగా దొంగది. ఈ చిత్రం 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికీ ఈ చిత్రం విడుదలై 20 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్బంగా మనోజ్, సదా ఒకే వేదికపై కలిశారు. వినాయక చవితి ఉత్సవాలను జీ తెలుగు స్పెషల్ ఈవెంట్ ద్వారా నిర్వహించింది.

కాగా సదా మనోజ్ గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. మనోజ్ దొంగ దొంగది చిత్రం షూటింగ్ సమయంలో చాలా అల్లరిగా ఉండేవారని తెలిపింది. ఇక తను సెట్స్ లో ఉన్నప్పుడు ఊరికనే కావాలని బైక్ వేసుకొని వచ్చి అల్లరి చేస్తూ ఉండే వాడని చెప్పుకొచ్చింది. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడని చెబుతుంది. అయితే తను గత వారం రోజులుగా ఎంతగానో నవ్వుతూ ఉన్నానని అందరూ కారణం వినాయక చవితి ఉత్సవాలే అని చెప్పుకొచ్చింది.
జీ తెలుగులో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా సదా, మంచు మనోజ్, యాంకర్ రవి, సిరి హన్మంతు, బుల్లితెర స్టార్స్ హాజరయ్యారు. ఈ సందర్బంగా పలు టాస్క్ ల్లో సెలెబ్రెటీలు పాల్గొన్నారు. ఆటలతో పాటు పాట పోటీలు, లైవ్ యాక్టింగ్ టాస్క్ లు, డ్యాన్స్ పెర్ఫామెన్స్ లతో ఆకట్టుకున్నారు. ఇక చాలా ఏళ్లకు ఇలా సంతోషంగా ఉన్నానని సదా ఎమోషనల్ అయ్యింది.
గం గం గణేశా ఫుల్ ఎపిసోడ్ ప్రోమో ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ ఆదివారం ఫుల్ ఎపిసోడ్ జీ తెలుగులో ప్రసారం కానుంది. ఇదెలా ఉంటే.. మంచు మనోజ్ నెక్ట్స్ మిరాయ్ అనే యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రంలో విలన్ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే వాట్ ది ఫిష్ అనే చిత్రంలోనూ నటిస్తూ మంచు మనోజ్ బిజీగా ఉన్నారు. ఇక సదా చివరిగా అహింస, ఆదికేశవ, మద గజ రాజా వంటి చిత్రాలతో ప్రేక్షకులను వెండితెరపై అలరించింది.


Click it and Unblock the Notifications











