For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నీ బ్రా సైజు ఎంతో చెప్పు.. నెటిజన్ వేధింపులు.. నీ పురుషాంగం అంటూ యువ నటి దిమ్మతిరిగే జవాబు

  |

  సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయిన తర్వాత సినీ తారలకు అడపదడపా ఇబ్బందులు ఎక్కువగానే ఎదురువుతున్నాయి. శరీరాకృతి, రంగు, ఎత్తు, పొడువు, స్థూలకాయం లాంటి అంశాలను టార్గెట్‌గా చేసుకొని నెటిజన్లు వేధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా టెలివిజన్ నటి సయాంతనీ ఘోష్‌కు ఓ చేదు అనుభవం ఎదురైంది. దాంతో ఎమోషనల్‌గా ఆమె ఎలా స్పందించారంటే..

  వరల్డ్ హెల్త్ డే రోజున చేదు అనుభవం

  వరల్డ్ హెల్త్ డే రోజున చేదు అనుభవం

  ప్రపంచ ఆరోగ్యం దినోత్సవం సందర్భంగా టెలివిజన్ నటి సయాంతనీ ఘోష్ తన అభిమానులు, నెటిజన్లతో ముచ్చటించారు. ఆరోగ్యం, పాజిటివ్ యాటిట్యూడ్ గురించి మాట్లాడుతుండగా ఓ తింగరి నెటిజన్ తన పైత్యాన్ని బయటపెట్టాడు. దాంతో సయాంతని ఘోష్ ఘాటుగా స్పందించింది.

  నీ బ్రా సైజు ఎంత అంటూ

  నీ బ్రా సైజు ఎంత అంటూ

  వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఆరోగ్యకరమైన విషయాలపై అభిమానులతో చర్చ కొనసాగిస్తున్న సమయంలో ఓ నెటిజన్ స్పందిస్తూ.. నీ బ్రా సైజు ఎంత అంటూ వల్గర్‌గా బిహేవ్ చేశారు. దాంతో సయాంతనీ తగిన బుద్ది చెప్పే విధంగా సమాధానం ఇచ్చింది. దాంతో ఆ నెటిజన్ మరో మాట మాట్లాడకుండా తప్పించుకొన్నారు.

  దుమ్ము దులిపిన సయాంతనీ ఘోష్

  దుమ్ము దులిపిన సయాంతనీ ఘోష్

  నెటిజన్ దురుద్దేశపూర్వకంగా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నీవు సైజు అనే విషయానికి అంత ప్రాధాన్యం ఇస్తారా అంటూ దుమ్ము దులిపేసింది. ఇలా ఓ మహిళను పట్టుకొని బాడీ షేమింగ్ చేయడం సబబేనా అంటూ నిలదీసింది. శరీరంలోని ఓ అంగానికి అంత నీచంగా చూస్తావా? అంటూ కామెంట్ పెట్టింది.

  సైజుల గురించి అవసరమా?

  సైజుల గురించి అవసరమా?

  మానసికంగా సైజుల గురించి మాట్లాడుకోవడం ముగింపు పలకాలి. వరల్డ్ హెల్త్ డే రోజున మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో నాకు అర్ధమైంది. శరీరపరంగా నీవు చాలా ఫిట్‌గా ఉండాలి. అందులో తప్పులేదు. కానీ మానసికంగా కూడా అంతే ఫిట్‌గా ఉండాలి. శరీరంలోని ప్రతీ అంగాన్ని సాధారణంగా చూడాలి. ఒకవేళ నేను చెప్పింది నీకు సమ్మతమైతే నాకు లవ్ సింబల్‌ను పోస్టు చేయి అంటూ నెటిజన్‌కు సయాంతని ఘోష్ షాకిచ్చింది.

  నీ పురుషాంగం సైజు ఎంత అని అడిగితే

  నీ పురుషాంగం సైజు ఎంత అని అడిగితే

  నీవు నా బ్రా సైజు గురించి అడిగినప్పుడు నేను కూడా నీలాగే ఆలోచిస్తే నీ పరిస్థితి ఏమయ్యేది. నీ ప్రశ్నకు బదులుగా నీ పురుషాంగం సైజు ఎంత అడిగితే నీకు ఎలా ఉంటుందో చెప్పు. సైజుల గురించి అడిగే నీలాంటి వారి ఉత్సాహానికి, నీ అభద్రతాభావానికి మాస్క్‌ వేసుకొనే పరిస్థితి వచ్చిది. ఇలా అంటే మగవాళ్ల ఇగో దెబ్బ తింటుందేమో అంటూ సయాంతనీ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది.

  సయాంతనీకి నెటిజన్ల మద్దతు

  సయాంతనీకి నెటిజన్ల మద్దతు

  సయాంతని ఘోష్ ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన పోస్టులకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. నీవు ఇచ్చిన సమాధానాలు చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. ఇలాంటి వారికి అలానే బుద్ది చెప్పాలి. నెటిజన్ల తిక్క సమాధానాలకు ఇలాంటి సమాధానాలే కరెక్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

  Pushpa Movie ప్యాన్ ఇండియా స్థాయి తగ్గేదేలే | Introducing Pushpa Raj
  సయాంతనీ కెరీర్ ఇలా...

  సయాంతనీ కెరీర్ ఇలా...

  సయాంతనీ ఘోష్ కెరీర్ విషయానికి వస్తే.. హిందీ బుల్లితెరపై అద్భుతమైన పాత్రలతో రాణిస్తున్నారు. కుంకుమ్: ఏక్ ప్యారా సా బంధన్, నాగిన్, మహాభారత్, నామ్ కరణ్, నాగిన్ బారిస్టర్ బాబు సీరియల్స్‌తో అత్యంత ప్రేక్షకాదరణను సంపాదించుకొన్నారు. అంతేకాకుండా కామెడీ నైట్స్ విత్ కపిల్, బిగ్‌బాస్ 6 ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకొన్నారు.

  English summary
  Sayantani Ghosh television actress best known for her roles in Kumkum, Naaginn, Mahabharat, Naamkarann,Naagin Barrister Babu.She was a contestant on the 2012 reality series Bigg Boss 6 and worked in Itna Karo Na Mujhe Pyaar. On World health day, She was faced bitter experience from netizen.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X