twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా నోట్లోంచి వచ్చి *** వెళ్తుందట.. ప్రభాకర్ నిజ స్వరూపమిదే.. దీనస్థితిలో నటి శివ పార్వతి

    |

    ప్రస్తుతం కరోనా ఎంతలా విజృంభిస్తోందన్నది అందరికీ తెలిసిందే. అయితే బుల్లితెర తారలు వరుసగా కరోనా బారిన పడుతుండటం అందరిలోనూ ఆందోళనను కలిగిస్తోంది. ఈ క్రమంలో తాజాగా నటి శివ పార్వతికి కరోనా సోకింది. హాస్పిట్‌లో చికిత్స తీసుకుని ఈ మధ్యే ఇంట్లో హోం క్వారంటైన్‌లో ఉంటున్నట్టు పేర్కొంది. కరోనా వచ్చినప్పుడు ఎదుర్కొన్న అనుభవాలు, తనను ఒంటరిగానే వదిలేసి సాయం కూడా చేయలేదని తన బాధను వెల్లగక్కుకుంది.

    Recommended Video

    Actress Pragathi Rhythmically Moving her Hips, Dance Video Viral
     ప్రభాకర్‌కి తెలుసు..

    ప్రభాకర్‌కి తెలుసు..

    హలో నేను శివ పార్వతీ గారినండి టీవీ యాక్టర్ ప్రభాకర్ గారు.. నటిస్తూ నిర్మిస్తున్న వదినమ్మ సీరియల్ యూనిట్‌కి అందరికీ నమస్కారం.. నాకు కరోనా పాజిటివ్ వచ్చి చాలా సీరియస్ అయ్యింది. మళ్లీ ఇంటికి వస్తానా లేదా అన్న పరిస్థితుల్లోకి వెళ్లిపోయి పది రోజుల తరువాత నిన్న రాత్రి ఇంటికి చేరుకున్నాను. రెండు హాస్పటల్స్ మారాను. ఈ విషయం ప్రభాకర్‌కి , సీరియల్ యూనిట్‌కి కూడా తెలుసు అని శివ పార్వతీ అన్నారు.

     అందరి ప్రాణం ఒక్కటే..

    అందరి ప్రాణం ఒక్కటే..

    అయితే ఈ విషయంలో నేను ఎవర్నీ ఏం అనదల్చుకోలేదు.. కేవలం థాంక్స్ మాత్రమే చెప్పదలుచుకున్నా.. ఎందుకంటే నాకు ఈ పరిస్థితి రాకపోతే ఎవరేంటో తెలిసేది కాదు. ఇప్పుడు తెలిసింది. ఎంతపెద్ద ఆర్టిస్ట్‌ అయినా.. చిన్న ఆర్టిస్ట్‌ అయినా ప్రాణం అనేది ఒక్కటే.. ఆపద అనేది ఒకటే. కరోనా పాజిటివ్ అనేది చిన్న విషయం కాదని ప్రపంచానికి కూడా తెలుసు అని శివపార్వతీ పేర్కొన్నారు.

     చాలా దురదృష్టం..

    చాలా దురదృష్టం..

    నేను వదినమ్మ యూనిట్‌లో ఓ ఆర్టిస్ట్.. అందరితో పాటు కలిసి పనిచేశా.. ఒకవేళ ఆ సీరియల్‌లో పనిచేసినా చేయకపోయినా.. ఆర్టిస్ట్‌ల మధ్య అనుబంధం ఉంటుంది. వర్క్ చేస్తే ఆ అనుబంధం ఇంకా ఎక్కువ అవుతుంది. కాని నా గురించి ఎవ్వరూ.. ఏ హాస్పిటల్, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానని ఏ ఒక్కరూ కనుక్కోలేదు. ఇది చాలా దురదృష్టం. అని శివ పార్వతీ చెప్పుకొచ్చారు.

    ఎక్కవగా ఆశించను..

    ఎక్కవగా ఆశించను..

    అంతే ఎవరి ప్రాబ్లం వారిది. ఎవరికి ఎవ్వరూ తోడుండరు. నేను కూడా ప్రభాకర్ నుంచి ఎక్కువగా ఆశించను. ఎందుకంటే.. అదంతే. మేం కూడా అలాగే ఉండాలి.. నటించామా? అక్కడి నుంచి వచ్చేశామా? మరిచిపోవాలి అంతే. అంత కృతకంగా అయింది మనుషుల మధ్య సంబంధాలు అని శివ పార్వతీ చెప్పుకొచ్చారు.

    జీవిత సాయం..

    జీవిత సాయం..

    నేను సినిమాలు చేయక ఐదేళ్లు అవుతున్నా జీవితా రాజశేఖర్ గారు హాస్పిటల్‌కు వచ్చారు. నా పరిస్థితి తెలుసుకుని, అక్కడే ఉంచేట్టు డాక్టర్స్‌తో మాట్లాడి చాలా విషయాల్లో సాయం చేసి నన్ను ఇంటికి తీసుకొచ్చారు అని శివ పార్వతీ పేర్కొన్నారు.

    నోట్లో నుంచి వస్తుంది..

    నోట్లో నుంచి వస్తుంది..

    ప్రభాకర్ గారూ ఈ వైరస్ నోట్లో నుంచి వెళ్లి కింద నుంచి వచ్చేస్తుందని చెప్పారు.. రెండు లక్షలు ఏం సరిపోద్దండి.. పది లక్షలు ఇన్సూరెన్స్ తీసుకోండి అన్నారు. అది నేను చేసుకోలేకపోయాను. కాని ప్రొడక్షన్స్ నుంచి ఇన్సూరెన్స్ చేశాం అని చెప్పారు. ఏమైనా అవసరం వస్తుందా? క్లైమ్ చేసుకోమని చెప్పడం.. అటువంటివి కూడా చేయలేరా? మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే థాంక్స్ అని శివ పార్వతీ బాధపడ్డారు.

    చనిపోతే కూడా..

    చనిపోతే కూడా..

    నేను పోయానని తెలిసినా ఇంతే రెస్పాన్స్ అవుతారు. ఎవరికీ తెలియనివ్వకుండా కామ్‌గా షూటింగ్ కానిచ్చేస్తారు. థ్యాంక్స్. ఈ సీరియల్ ప్రొడ్యుసర్ శివకుమార్.. నాకు వందరూపాయిల శాలువా కప్పి అప్పట్లో సన్మానం చేశారు.. చాలా అభిమానం చూపించారు.. నేను కూడా చాలా ఎమోషనల్ అయి స్టేజ్ ఎక్కి నా కళలు, బాధ్యతల గురించి మాట్లాడాను. అని శివ పార్వతీ పేర్కొన్నారు.

    ఆవగింజంత అభిమానం..

    ఆవగింజంత అభిమానం..

    అప్పుడు అందరూ అభిమానం చూపించారు. దాంట్లో ఆవగింజంతైనా మనిసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ కూడా ముందుకు రాకపోవడం న్యాయం కాదు.. అది తప్పు. ఆర్టిస్ట్‌ల పట్ల ప్రేమ పంచడం అనేది ఉంటే చచ్చిపోయే వాడికి కూడా బలం వస్తుంది. అది నా బాధ .దీన్ని మర్చిపోవద్దు. అది పాటించిన రోజే ఆర్టిస్ట్ అనేవాడిని అర్హత ఉంటుంది. అంతేకాని మేకప్ వేసుకుని, నేనూ నటిస్తాను అంటే ఆర్టిస్ట్ అవ్వరూ అంటూ శివ పార్వతీ భావోద్వేగానికి గురయ్యారు.

    English summary
    Actress Shiva Parvati Tests Corona Positive. she relaese a video that she is in criticla position no one rescue her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X