For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: మొట్టమొదటి కంటెస్టెంట్‌గా సిరి.. ప్రియుడిని వదిలేసి ఒంటరిగా!

  |

  మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ షోకు మరింత ఎక్కువగా ఆదరణ లభిస్తోందన్న విషయం తెలిసిందే. అందుకే ఇండియాలో మరే షోకూ రానంత ఎక్కువ రేటింగ్ మన దగ్గర వస్తోంది. అందుకే తెలుగులో ఈ రియాలిటీ షో ఏకంగా నాలుగు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఇక, ఇప్పుడు ఐదో సీజన్ కూడా ఈరోజే (సెప్టెంబర్ 5) ప్రారంభం అయింది. ఎంతో సందడిగా సాగుతోన్న ఈ సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్‌లో ప్రముఖ నటి సిరి హన్మంత్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె వివరాలేంటో తెలుసుకుందాం పదండి!

  గతంలో వాటికి మించేలా ఐదో సీజన్

  గతంలో వాటికి మించేలా ఐదో సీజన్

  తెలుగులో ఇప్పటి వరకూ నాలుగు సీజన్లు సూపర్ సక్సెస్‌గా రన్ అయ్యాయి. వాటిలో దేనికదే అన్నట్లుగా ప్రేక్షకాదరణను అందుకుని రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో సీజన్ కూడా తాజాగా మొదలైంది. గతంలో వాటికి మించేలా ఇందులో ఐదింతల ఎంటర్‌టైన్‌మెంట్, ఐదింతల డ్రామా, ఐదింతల ఎనర్జీ ఉండబోతుందని నిర్వహకులు తెలిపారు.

  ఫుల్ జోష్‌తో మొదలైన బిగ్ బాస్ షో

  ఫుల్ జోష్‌తో మొదలైన బిగ్ బాస్ షో

  బిగ్ బాస్ ప్రియులు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చేసింది. ఎన్నో అనుమానాల నడుమ ఐదో సీజన్‌ను ఆదివారం ప్రారంభించారు. దీనికి సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. కంటెస్టెంట్ల ఆటపాటలతో ఈరోజు ఎపిసోడ్ అంగరంగ వైభవంగా సాగుతోంది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు.

  కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో కొత్తగా

  కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో కొత్తగా

  బిగ్ బాస్ షో అంటే ఎంత సక్సెస్‌ఫుల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు అనుగుణంగానే ఈ సారి ప్రసారం అవుతున్న సీజన్ కోసం నిర్వహకులు ఫేమస్ అయిన కంటెస్టెంట్లనే ఎంపిక చేసుకున్నారు. బుల్లితెరపై సందడి చేసే నటీనటులు, యాంకర్లతో పాటు సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారికి పెద్దపీట వేశారు. వీళ్లంతా చాలా రోజులుగా క్వారంటైన్‌లో ఉండి వచ్చారు.

  హౌస్‌లో అడుగు పెట్టిన ప్రముఖ నటి

  హౌస్‌లో అడుగు పెట్టిన ప్రముఖ నటి

  చాలా కాలంగా బుల్లితెరపై సందడి చేస్తూ ఎంతగానో గుర్తింపును అందుకున్న ప్రముఖ నటి సిరి హన్మంత్ బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ఫస్ట్ కంటెస్టెంట్‌గా వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ప్రీమియర్ ఎపిసోడ్‌లో ‘క్రాక్' మూవీలోని భూమ్ బద్దల్ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ స్టేజ్ మీద రచ్చ చేసేసింది. అనంతరం ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిందీ సీరియల్ నటి.

  సిరి హన్మంత్ అలా ఫేమస్ అయింది

  సిరి హన్మంత్ అలా ఫేమస్ అయింది

  యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన సిరి హన్మంత్.. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ‘ఉయ్యాలా జంపాల', ‘అగ్నిసాక్షి' సహా పలు ధారావాహికల్లో నటించింది. అలాగే, ‘సాఫ్ట్ వేర్ బిచ్చగాళ్లు' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. వీటితో పాటు ‘రామ్ లీలా', ‘మేడం సార్ మేడం అంతే' వంటి వెబ్ సిరీస్‌లు చేసింది. ఇలా ఫేమస్ అవడం వల్లే బిగ్ బాస్ ఛాన్స్ పట్టేసిందట.

   జంటగా అనుకుంటే.. ఒంటరిగా ఎంట్రీ

  జంటగా అనుకుంటే.. ఒంటరిగా ఎంట్రీ

  సిరి హన్మంత్.. శ్రీహాన్ అనే నటుడిని ప్రేమిస్తోన్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది. ఈ నేపథ్యంలో వీళ్లు జంటగా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పుడు అనూహ్యంగా సిరి హన్మంత్ ఒక్కరే హౌస్‌లోకి ప్రవేశించారు. ఆమె ప్రియుడు మాత్రం బయటే ఉండిపోవాల్సి వచ్చిందన్న మాట.

  Harbhajan Singh లో ఇంత గొప్ప సింగర్ ఉన్నాడా.. రోజా మూవీ లో పాట పాడిన బజ్జీ
  మంచి మొగుడు కావాలంటూ డైలాగ్

  మంచి మొగుడు కావాలంటూ డైలాగ్

  స్టేజ్ మీద రచ్చ చేసిన తర్వాత సిరి హన్మంత్‌కు నాగార్జున ఓ టాస్క్ ఇచ్చాడు. ఒక డైలాగ్‌ను నవరసాల్లో చెప్పమని అడిగాడు. అప్పుడామె ‘నాకు నచ్చినవి రెండే రెండు.. ఒకటి నిద్ర, రెండు మంచి మొగుడు' అని పలు రకాల రసాల్లో చెప్పింది. ఆ తర్వాత భర్తకు ఉండాల్సిన లక్షణాలు చెప్పింది. అనంతరం హౌస్‌లోకి వెళ్లి మొత్తం కలియ తిరిగేసింది. మొత్తానికి ఫుల్ ఖుషీగా కనిపించింది.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series. This Show 5th Seasn Premiere Episode Started Today. Now Actress Siri Hanmanth Entered into Bigg Boss House.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X