twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss OTT లోకి వనితా విజయ్ కుమార్.. మరో హాట్ స్టార్ కూడా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

    |

    బిగ్‌బాస్ రియాలిటీ షో ఏ భాషలో ప్రసారమైనా దానికి బ్రహ్మండ రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి లభిస్తున్నది. హిందీలో సల్మాన్ ఏకంగా 15 సీజన్లు నడిపిసత్ే. తెలుగు, తమిళంలో 5 సీజన్లు పూర్తి చేసుకొన్నది. ఇటీవల బిగ్‌బాస్ ఓటీటీని ప్రయోగాత్మకంగా హిందీలో ప్రవేశపెట్టి.. సక్సెస్ అయ్యారు. దాంతో ఓటీటీలో 24 గంటలు ప్రసారం చేసేందుకు తెలుగు, తమిళంలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటీవలే 5వ సీజన్‌ను పూర్తి చేసుకొన్న తమిళ బిగ్‌బాస్.. ఓటీటీకి సిద్దమైంది. తమిళ బిగ్‌బాస్ ఓటీటీ ఎప్పుడు ప్రారంభం కాబోతున్నది? కంటెస్టెంట్లు ఎవరు? అనే విషయాల్లోకి వెళితే..

    జనవరి 30వ తేదీన ఓటీటీలో

    జనవరి 30వ తేదీన ఓటీటీలో

    గతేడాది ప్రారంభమైన బిగ్‌బాస్ తమిళ్ ఇటీవలే 5వ సీజన్‌ను దిగ్విజయంగా పూర్తి చేసుకొన్నది. జనవరి 16వ తేదిన గ్రాండ్ ఫినాలేను జరుపుకొన్నది. ఇలా వారం రోజులు ముగిసిందో లేదో.. బిగ్‌బాస్ ఓటీటీని తెరపైకి తీసుకొచ్చారు. ఈ ఓటీటీ ఫార్మాట్ షో జనవరి 30వ తేది నుంచి 24 గంటలపాటు డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నది.

    డిజిటల్ మీడియాలోకి కమల్ హాసన్ ఎంట్రీ

    డిజిటల్ మీడియాలోకి కమల్ హాసన్ ఎంట్రీ

    బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా తొలిసారి హోస్ట్ బాధ్యతలు చేపట్టిన కమల్ హాసన్... ఇప్పుడు మరో ఘనతను సొంతం చేసుకోబోతున్నారు. సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు డిజిటల్ మీడియాలోకి కమల్ అడుగుపెట్టనున్నారు. బిగ్‌బాస్ తమిళ్ ఓటీటీ ద్వారా ఓటీటీలోకి తొలిసారి ప్రవేశించనున్నారు. టెలివిజన్ రంగంలో ఫాలోవర్స్‌ను విశేషంగా సంపాదించుకొన్న కమల్ ఓటీటీలో కూడా భారీగా అభిమానులు సంపాదించకోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

    13 మంది కంటెస్టెంట్లు.. 45 రోజుల పాటు

    13 మంది కంటెస్టెంట్లు.. 45 రోజుల పాటు


    బిగ్‌బాస్ అల్టిమేట్ అని నామకరణం చేసుకొన్న బిగ్‌బాస్ తమిళ్ ఓటీటీ సుమారు 45 రోజులపాటు కొనసాగనున్నది. ఈ షోలో మొత్తం 13 కంటెస్టెంట్ ఉంటారు. గత బిగ్‌బాస్ సీజన్‌లో పాల్గొన్న పాపులర్ కంటెస్టెంట్లు ఇందులో పాలుపంచుకోబోతున్నారు. దీంతో ఈ షోపై భారీ క్రేజ్ నెలకొన్నది. అయితే ఇప్పటికే తమిళ మీడియాలో కొందరు కంటెస్టెంట్ల పేర్లు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.

    వనితా విజయ్ కుమార్, అభిరామితోపాటు

    వనితా విజయ్ కుమార్, అభిరామితోపాటు


    బిగ్‌బాస్ తమిళ్ ఓటీటీలో పాల్గొనడానికి అవకాశం ఉన్నట్టు వెల్లడించిన ప్రకారం.. వనితా విజయ్ కుమార్, భరణి, అభిరామి వెంకటాచలం, జులియానా లాంటి తారలను ఇప్పటికే బిగ్‌బాస్ నిర్వాహకులు ఎంపిక చేశారు అని చెబుతున్నారు. బిగ్‌బాస్ అల్టీమేట్‌లో వనితా విజయ్ కుమార్ కంటెస్టెంట్‌గా ఉంటారనే విషయాన్ని బిగ్‌బాస్ తమిళ 5 గ్రాండ్ ఫినాలే రోజు వెల్లడించిన సంగతి తెలిసిందే.

    Recommended Video

    Bigg Boss OTT Telugu : Contestants List Updates, Starting Date | Filmibeat Telugu
    వనితా విజయ్ కుమార్ గురించి..

    వనితా విజయ్ కుమార్ గురించి..

    సినీ నటి, ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురు వనితా విజయ్ కుమార్ విషయానికి వస్తే.. తమిళ సినీ పరిశ్రమలో అత్యంత వివాదాస్పద వ్యక్తిగా పేరు తెచ్చుకొన్నారు. బిగ్‌బాస్ తమిళ సీజన్ 3లో పాల్గొన్నారు. మధ్యలోనే ఎలిమినేట్ అవ్వడం, ఆ తర్వాత ఫ్యాన్స్ డిమాండ్ చేయడంతో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. బిగ్‌బాస్ తమిళ్ 5 సీజన్‌లో కూడా పాల్గొన్నారు. ఇక భరణి విషయానికి వస్తే.. బిగ్‌బాస్ తమిళ సీజన్ 1, అభిరామి వెంకటాచలం సీజన్ 3లో పాల్గొన్నారు.

    English summary
    OTT version of Bigg Boss Ultimate show will go with 24x7, starting January 30 on Disney+Hotstar. Vanitha Vijaykumar, Bharani, Abhirami Venkatachalam, and Julianna are among the list of probable contestants of Bigg Boss Ultimate.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X