For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యూట్యూబ్‌లో కనిపించని ‘అదిరింది’ స్కిట్లు: మొత్తం అందులోనే.. అసలేం జరిగిందంటే.!

  By Manoj
  |

  బుల్లితెరపై ప్రసారం అవుతోన్న షోలు అన్నింటిలో కామెడీ ప్రధానంగా నడిచే వాటికే ఎక్కువ పాపులారిటీ ఉంది. దీనికి 'జబర్ధస్త్'నే ఉదాహరణ. దాదాపు ఏడేళ్లుగా ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీన్ని ఫాలో అవుతూ చాలా షోలు పుట్టుకొచ్చినా... అవేమీ పోటీలో నిలవలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మెగా బ్రదర్ నాగబాబు సారథ్యంలో ప్రముఖ ఛానెల్‌లో 'అదిరింది' అనే కామెడీ షో మొదలైంది. ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోన్న ఈ షో స్కిట్లు యూట్యూబ్‌లో కనిపించడం లేదు. అసలు ఇలా ఎందుకు జరిగింది.? ఇంతకీ ఆ స్కిట్లు ఎందులో ఉంటాయి.? అనే వివరాలు మీకోసం.!

  Adirindi Comedy Show Anchor Sameera Out Of The Show
   అక్కడి వాళ్లే ఇక్కడకు.. ఇలా మొదలైంది

  అక్కడి వాళ్లే ఇక్కడకు.. ఇలా మొదలైంది

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఏ షోకూ దక్కని ఎన్నో అరుదైన ఘనతలను సొంతం చేసుకుంది జబర్ధస్త్. అంతేకాదు, చాలా కాలంగా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇలాంటి తరుణంలో ఆ షోకు దర్శకత్వం వహించిన నితిన్, భరత్‌ జబర్ధస్త్ నుంచి తప్పుకున్నారు. అదే సమయంలో దానికి పోటీగా మరో ఛానెల్‌లో ‘అదిరింది' అనే టైటిల్‌తో కామెడీ షోను మొదలు పెట్టారు.

   నాగబాబుతో పాటు వాళ్లందరూ వచ్చారు

  నాగబాబుతో పాటు వాళ్లందరూ వచ్చారు

  నితిన్, భరత్ జబర్ధస్త్ నుంచి తప్పుకున్న సమయంలోనే.. ఆ షోకు చాలా ఏళ్లుగా జడ్జ్‌గా పని చేస్తున్న మెగా బ్రదర్ నాగబాబు కూడా గుడ్‌బై చెప్పేశాడు. అంతేకాదు, అదిరింది షోలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆయన మాత్రమే కాదు... జబర్ధస్త్ టీమ్ లీడర్లు చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీలతో పాటు మరికొందరు సీనియర్ కమెడియన్లు సైతం వారి బాటలో పయణించారు.

  జబర్ధస్త్‌ను టచ్ చేయలేక.. సరికొత్త ప్లాన్లు

  జబర్ధస్త్‌ను టచ్ చేయలేక.. సరికొత్త ప్లాన్లు

  ప్రముఖ ఛానెల్‌లో ప్రతి ఆదివారం రాత్రి ప్రసారం అవుతోంది అదిరింది షో. దీనికి మెగా బ్రదర్ నాగబాబుతో పాటు హీరో నవదీప్ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే, రవి, భానూశ్రీ యాంకరింగ్ చేస్తున్నారు. సీనియర్లు జూనియర్లు కలిపి కొన్ని జట్లుగా ఏర్పడ్డారు. ఎన్నో హంగులతో వచ్చినప్పటికీ... ఈ షో మాత్రం టీఆర్పీ విషయంలో జబర్ధస్త్‌ను టచ్ చేయలేకపోతోంది.

   అక్కడ మాత్రం మంచి రెస్పాన్స్.. ట్రెండింగ్

  అక్కడ మాత్రం మంచి రెస్పాన్స్.. ట్రెండింగ్

  టీఆర్పీ విషయంలో వెనకబడినప్పటికీ... అదిరింది స్కిట్లకు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. మరీ ముఖ్యంగా యూట్యూబ్‌లో ఈ షో స్కిట్లకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. అంతేకాదు, సద్దాం సారథ్యంలోని గల్లీ బాయ్స్ టీమ్ స్కిట్ అయితే కొన్ని వారాలు ట్రెండింగ్‌లో కూడా నిలిచింది. దీంతో జబర్దస్త్ స్కిట్లు రెండో స్థానానికి పడిపోయాయి.

  యూట్యూబ్‌లో కనిపించని అదిరింది స్కిట్లు

  యూట్యూబ్‌లో కనిపించని అదిరింది స్కిట్లు

  ఇప్పుడిప్పుడే నెటిజన్ల స్పందన దక్కించుకుంటూ పాపులర్ అవుతోంది అదిరింది షో. ఇలాంటి సమయంలో దానికి సంబంధించిన స్కిట్లను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం లేదు షో నిర్వహకులు. దీంతో ఏమైందో తెలియక ఆ షో అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. అదే సమయంలో సదరు ఛానెల్‌ మేనేజ్‌మెంట్‌పై విమర్శలు చేస్తున్నారు.

   మొత్తం అందులోనే.. అసలేం జరిగిందంటే.!

  మొత్తం అందులోనే.. అసలేం జరిగిందంటే.!

  వాస్తవానికి ‘అదిరింది' షోను ప్రసారం చేస్తున్న ఛానెల్‌కు ZEE5 ప్రత్యేకమైన ఓటీటీ ఫ్లాట్‌ఫాం ఉంది. ఆ ఛానెల్‌లో వచ్చే షోలు, సీరియళ్లు, సినిమాలు సహా మిగిలిన కార్యక్రమాలన్నీ ఆ యాప్‌లోనే వస్తాయి. ఇందులో భాగంగానే ‘అదిరింది' షోను కూడా అందులోనే అప్‌లోడ్ చేస్తున్నారు. అయితే.... ఆ యాప్‌లో షోను చూడాలంటే మాత్రం మెంబర్‌షిప్ తీసుకోవాల్సి ఉంటుంది.

   యాంకర్ రవి కూడా క్లారిటీగా చెప్పేశాడు

  యాంకర్ రవి కూడా క్లారిటీగా చెప్పేశాడు

  కొద్ది రోజుల క్రితం అదిరింది షో యాంకర్ రవి సోషల్ మీడియాలో ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. దానికి సంబంధం లేకపోయినా ‘అన్నా... అదిరింది స్కిట్లు యూట్యూబ్‌లో కనిపించడం లేదు ఎందుకు' అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి ‘ఇకపై అవి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయరు. ఛానెల్ నిబంధనల ప్రకారం యాప్‌లో మాత్రమే ఉంటాయి' అని క్లారిటీ ఇచ్చాడు.

  English summary
  Adhirindi episodes before their TV telecast only on ZEE5. ‘Adhirindhi’ is a stand-up comedy show starring Comedy King Nagababu ‘Shahenshah’ and actor Navadeep as the judges, anchors Ravi and Bhanu Sree as the hosts and comedy stars Chandra and other Comedians Skits
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X