For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చమ్మక్ చంద్ర నిజస్వరూపం బయటపెట్టిన ఆనంద్.. ఆ సమయంలో మొహం చూపించలేదు అంటూ

  By Manoj Kumar P
  |

  చమ్మక్ చంద్ర.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు అనడంలో సందేహం లేదు. అంతలా ఎన్నో ఏళ్లుగా తన ప్రభావాన్ని చూపిస్తున్నాడీ కమెడియన్. జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన అతడు... తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, ఓ వర్గానికి చెందిన ఆడియెన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. తనను ప్రపంచానికి పరిచయం చేసిన షోను వదిలి మరో దానిలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో చమ్మక్ చంద్ర నిజస్వరూపాన్ని బయటపెట్టాడు అతడి సహచరుడు ఆనంద్. ఆ వివరాలు మీకోసం.!

  అందులో స్పెషలిస్ట్‌గా మారిన చంద్ర

  అందులో స్పెషలిస్ట్‌గా మారిన చంద్ర

  ప్రస్తుతం బుల్లితెరపై అద్భుతమైన టాలెంట్ ఉన్న కమెడియన్లలో ఒకడిగా వెలుగొందుతోన్నాడు చమ్మక్ చంద్ర. జబర్ధస్త్‌ షోలో లేడీ గెటప్‌ల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న అతడు.. ప్రత్యేకమైన మేనరిజమ్‌తో భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. అదే సమయంలో ఫ్యామిలీ స్కిట్లను చేస్తూ ఆ వర్గానికి చేరువయ్యాడు. ఫలితంగా టాప్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

  సినిమాల్లోనూ చమ్మక్‌మన్న చంద్ర

  సినిమాల్లోనూ చమ్మక్‌మన్న చంద్ర

  టెలివిజన్ రంగంలో సత్తా చాటడంతో పాటు బిజీ ఆర్టిస్టుగా పేరొందాడు చంద్ర. అదే సమయంలో సినిమాల్లోనూ మెప్పించాడు. ‘మేము వయసుకు వచ్చాం' అనే మూవీతో తెరంగేట్రం చేసిన అతడు... పదుల సంఖ్యలో సినిమాలు చేశాడు. వీటిలో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ', ‘బాబు బంగారం', ‘బంతిపూల జానకీ', ‘అఆ', ‘సెల్ఫీ రాజా వంటి సినిమాలు మంచి పేరును తెచ్చి పెట్టాయి.

  వాళ్లందరూ చమ్మక్ చంద్ర తర్వాతే

  వాళ్లందరూ చమ్మక్ చంద్ర తర్వాతే

  జబర్ధస్త్‌లో పెద్ద ఆర్టిస్టులుగా పేరొందిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాకెట్ రాఘవ, హైపర్ ఆది, అదిరే అభి, చలాకీ చంటితో పాటు మరికొందరు చమ్మక్ చంద్ర కంటే తక్కువ రెమ్యూనరేషన్ అందుకునే వారు. బయట చంద్రకు ఉన్న క్రేజ్ కారణంగానే ఎక్కువ చార్జ్ చేసేవాడని అంటుంటారు. అంతేకాదు, షో నిర్వహకులు సైతం అతడికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వారని టాక్.

  జబర్ధస్త్‌కు షాక్.. అదిరిందిలో ఎంట్రీ

  జబర్ధస్త్‌కు షాక్.. అదిరిందిలో ఎంట్రీ

  జబర్ధస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు అందులో టాప్ టీమ్ లీడర్‌గా పేరొందాడు చమ్మక్ చంద్ర. అందులో దాదాపు ఐదేళ్ల పాటు పని చేసిన అతడు... కొన్ని నెలల క్రితం ఆ షో నుంచి తప్పుకున్నాడు. అదే సమయంలో మరో ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘అదిరింది' అనే షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులోనూ అతడు భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు.

  నిజస్వరూపం బయటపెట్టిన ఆనంద్

  నిజస్వరూపం బయటపెట్టిన ఆనంద్

  చమ్మక్ చంద్ర తన టాలెంట్‌తో ఎంతటి పేరు సంపాదించుకున్నాడో... మంచి పనులు చేస్తూ అంతే గుర్తింపును అందుకున్నాడు. ఇందులో భాగంగానే నైపుణ్యం ఉండి అవకాశాలు దొరకని ఎంతో మందికి తన టీమ్‌లో చోటు కల్పించాడు. ఇలా వచ్చి ఫేమస్ అయిన వారిలో అదుర్స్ ఆనంద్ ఒకడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అతడు చంద్ర నిజస్వరూపం బయటపెట్టాడు.

  చంద్రతో వెళ్తే.. ఇక్కడ ఛాన్స్ ఇచ్చారు

  చంద్రతో వెళ్తే.. ఇక్కడ ఛాన్స్ ఇచ్చారు

  చంద్ర వ్యక్తిత్వం గురించి ఆనంద్ మాట్లాడుతూ... ‘జబర్ధస్త్‌ను వీడినప్పుడు చంద్రన్నతో పాటు నేను కూడా ఉన్నాను. అయితే, అప్పుడే నాకు షోలో టీమ్ లీడర్ ఛాన్స్ వచ్చింది. ఇదే విషయం చంద్రన్నకు చెబితే ఆయన బాగా యంకరేజ్ చేశారు. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలిరా అని కోరుకున్నాడు. నేను దూరమవుతున్నా సొంత అన్నలాగ ప్రోత్సహించాడు' అని చెప్పాడు.

  Bigg Boss Telugu 4: అభిజీత్, మోనాల్ మధ్య ట్రాక్ క్రియేట్ చేసిన బిగ్ బాస్... ఓ ప్రేమదేశం, ఓ ఆర్య 2
  చంద్ర మొహం చూపించలేకపోయాడు

  చంద్ర మొహం చూపించలేకపోయాడు

  ‘నాకు జబర్ధస్త్‌లో టీమ్ లీడర్‌గా అవకాశం వచ్చిందన్న విషయాన్ని చెప్పినప్పుడు చంద్రన్న కూడా సంతోషించాడు. మంచి స్కిట్లు రాసి బెస్ట్ లీడర్ అనిపించుకోరా అని ప్రోత్సహించాడు. అయితే, ఇది చెప్పి వస్తున్న సమయంలో ఆయన కళ్లలో నీళ్లు వచ్చాయి. అప్పుడు నాకు మొహం చూపించలేకపోయాడు. దీంతో నేనూ బాగా ఏడ్చాను' అని ఆనంద్ వివరించాడు.

  English summary
  Chammak Chandra is an Indian comedian and actor, known for the Jabardast comedy show. Chandra was born in Venkatapur in Nizamabad, Telangana. He made his film debut in the Teja movie Jai. Later he performed skits with actor Dhanraj and Venu and earned the attention of producer Mallemala.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X