For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: బిందు చేసిన తప్పే చేసిన ఆది రెడ్డి.. 9వ వారం ఎలిమినేట్.. షాకిచ్చిన బిగ్ బాస్‌

  |

  బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ రియాలిటీ షో దాదాపు ఆరేళ్లుగా ప్రభావాన్ని చూపిస్తూ టాప్ ప్లేస్‌లో నిలుస్తోంది. అసలే మాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన దీనికి తెలుగు ఆడియెన్స్ భారీ రెస్పాన్స్ అందించారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో నిర్వహకులు ఇప్పుడు ఆరో సీజన్‌ను నడుపుతున్నారు. ఇందులో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఆది రెడ్డి ఊహించని తప్పు చేశాడు. దీంతో అతడికి బిగ్ బాస్ శిక్ష విధించాడు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  రేటింగ్ అంతగా రావట్లేదుగా

  రేటింగ్ అంతగా రావట్లేదుగా

  ఎన్నో భాషల్లో ప్రసారం అవుతున్నా.. తెలుగులో మాత్రమే బిగ్ బాస్ షో అత్యధిక రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ రికార్డులు నమోదు చేస్తోంది. దీంతో ఆరో సీజన్‌ను నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సరికొత్తగా నడిపిస్తున్నారు. కానీ, దీనికి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ దక్కడం లేదు. ఫలితంగా దీనికి చాలా తక్కువగానే రేటింగ్ వస్తోంది. కానీ, క్రమంగా ఇది పుంజుకుంటోంది.

  టాప్ విప్పేసి యాంకర్ స్రవంతి రచ్చ: నచ్చింది చూసేయ్.. పైన స్వర్గమే అంటూ!

  21మందిలో అతడు హైలైట్

  21మందిలో అతడు హైలైట్

  ఆరో సీజన్‌ కోసం కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో బిగ్ బాస్ నిర్వహకులు ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. మరీ ముఖ్యంగా పాపులర్ అయిన వాళ్లనే ఎక్కువగా తీసుకున్నారు. ఇలా మొత్తంగా ఈ సీజన్‌లో 21 మంది కంటెస్టెంట్లను ఒకేసారి ఇంట్లోకి పంపారు. అందులో రివ్యూవర్ ఆది రెడ్డి ప్రత్యేకమైన శైలితో బాగా హైలైట్ అయ్యాడు. తద్వారా అందరి దృష్టినీ ఆకర్షించాడు.

  అన్నింట్లోనూ ఉంటూ రచ్చ

  అన్నింట్లోనూ ఉంటూ రచ్చ


  సుదీర్ఘ కాలంగా బిగ్ బాస్ రివ్యూలతో పాటు యూట్యూబ్ వీడియోలతో తెగ సందడి చేస్తున్న.. ఆది రెడ్డి చాలా మందికి పరిచయం కాలేదు. కానీ, ఇటీవలే బిగ్ బాస్ షో ఆఫర్‌ను సొంతం చేసుకున్నాడు. ఇందులో తనదైన ఆటతీరుతో అందరి మనసులు దోచుకుంటున్నాడు. అదే సమయంలో మాటతీరు, అందరినీ చదవడం వంటివి చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.

  అర్ధనగ్నంగా మహేశ్ హీరోయిన్: ప్రెగ్నెన్సీ టైంలోనూ హాట్ షోతో అరాచకం

  మిషన్ ఇంపాజిబుల్ టాస్క్

  మిషన్ ఇంపాజిబుల్ టాస్క్

  బిగ్ బాస్ షోలో ప్రతి వారం కెప్టెన్సీ కంటెండర్లను ఎంపిక చేసేందుకు టాస్కులు ఇస్తుంటారు. ఇందులో భాగంగానే ఈ వారం 'మిషన్ ఇంపాజిబుల్' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో రెండు టీమ్‌లు పోటీ పడ్డాయి. ఇది ఈ సీజన్ మొత్తంలోనే ఎక్కువ గొడవలతో రచ్చ రచ్చగా సాగింది. ఈ టాస్కులో కొందరు కంటెస్టెంట్లు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు.

  ఆదిని మోసం చేసిన గీతూ

  ఆదిని మోసం చేసిన గీతూ

  'మిషన్ ఇంపాజిబుల్' టాస్కులో భాగంగా ఆది రెడ్డి, గీతూ రాయల్‌ను రెండు టీమ్‌లకు కెప్టెన్లుగా బిగ్ బాస్ ప్రకటించాడు. దీంతో వీళ్లిద్దరూ వాళ్ల వాళ్ల జట్ల కోసం చక్కగా ప్రణాళికలు రూపొందిస్తూ విజయం కోసం పాటుపడ్డారు. కానీ, గీతూ రాయల్.. ఆది రెడ్డిని మోసం చేసింది. అతడితో మాట్లాడి బుట్టలో పడేసింది. ఆ వెంటనే అతడిని టాస్క్ నుంచి వెళ్లిపోయేలా చేసింది.

  బాత్రూంలో హాట్‌గా మెగా హీరోయిన్: ఆ డ్రెస్సు.. ఆమె ఫోజు చూశారంటే!

  మైక్‌ను విసిరేసిన ఆది రెడ్డి

  మైక్‌ను విసిరేసిన ఆది రెడ్డి

  'మిషన్ ఇంపాజిబుల్' టాస్కులో ఆది రెడ్డిని చంపేసినట్లు గీతూ వాళ్ల టీమ్ గొడవ చేసింది. అది రూల్ కాదని, చాలా తప్పని అతడు వారించినా ఆమె అస్సలు వినలేదు. దీంతో చేసేదేం లేక ఆది రెడ్డి తన మైక్‌ను, టీషర్ట్‌ను విప్పే నేలకేసి కొట్టాడు. ఈ ఘటనతో బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లో బిందు మాధవిని గుర్తు చేశాడు. అయితే, అప్పట్లో ఆమెపై విమర్శలు చేసి.. ఇప్పుడదే చేశాడు.

  ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్

  ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్

  పెద్ద గొడవ జరిగిన తర్వాత బిగ్ బాస్ ఆది రెడ్డి చనిపోలేదని చెప్పాడు. కానీ, మైక్‌ను విసిరి కొట్టడంతో అతడిని ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్కు నుంచి ఎలిమినేట్ చేస్తున్నట్లు వెల్లడించాడు. ఆ సమయంలో 'ఉద్దేశపూర్వకంగా విసిరాడు' అని బిగ్ బాస్ చెప్పడంపై ఆది అసహనం వ్యక్తం చేశాడు. ఈ మాటను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గొడవ పడ్డాడు.

  English summary
  Bigg Boss Telugu 6th Season was Running Successfully. Adi Reddy Throws the His Mike in Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X