Don't Miss!
- News
పాకిస్తాన్లో నరమేథం: మసీదులో ప్రార్థనల వేళ: అంతకంతకూ మృతుల సంఖ్య..!!
- Finance
Adani News: ఆ లాజిక్ తో ముందుకెళ్తున్న అదానీ గ్రూప్.. జుగేషీందర్ సింగ్ మాస్టర్ ప్లాన్..!
- Sports
Gongadi Trisha: ప్రపంచకప్ విజయం వెనుక తండ్రి త్యాగం!
- Lifestyle
జుట్టు ఎక్కువగా రాలుతుందా? అయితే కరివేపాకును ఇలా వాడితే మీ జుట్టు ఒత్తుగా, కాంతివంతంగా పెరుగుతుంది
- Technology
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
- Automobiles
ప్యూర్ EV లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ 'ecoDryft': ధర రూ. 99,999 మాత్రమే
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Bigg Boss: ఫినాలే ముందు ఆది రెడ్డికి షాక్.. నోరు జారి బుక్కైన రివ్యూవర్.. షో కోసం అలా సెట్ చేశాడా!
ఎప్పటికప్పుడు విచిత్రమైన టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, కొట్లాటలు, రొమాన్స్, లవ్ ఇలా ఎన్నో ఎమోషన్స్.. మొత్తానికి గతంలో ఎన్నడూ చూడని సరికొత్త కాన్సెప్టు.. అయితేనేం తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆదరించిన ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. దీంతో తెలుగులో నిర్వహకులు వరుసగా సీజన్లను నడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్‌ను కూడా మరింత ఆసక్తికరంగా ప్రసారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, ఇందులో స్ట్రాంగ్ ప్లేయర్‌గా ఉన్న ఆది రెడ్డి తాజా ఎపిసోడ్‌లో నోరు జారి బుక్కైపోయాడు. అసలేమైందో మీరే చూడండి!

21 మందిలో ఆది ప్రత్యేకం
బిగ్ బాస్ ఆరో సీజన్ కోసం బిగ్ బాస్ నిర్వహకులు పాపులర్ అయిన వాళ్లనే ఎక్కువగా తీసుకున్నారు. ఇలా మొత్తంగా ఈ సీజన్‌లో 21 మంది కంటెస్టెంట్లను ఒకేసారి ఇంట్లోకి పంపారు. అందులో కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన రివ్యూవర్ ఆది రెడ్డి ప్రత్యేకమైన శైలితో బాగా హైలైట్ అయ్యాడు. తద్వారా ఆరంభంలోనే అందరి దృష్టిలో పడ్డాడు. దీంతో అతడికి క్రేజ్ క్రమంగా పెరిగింది.
Bigg Boss: అతడికి ముద్దు పెట్టిన వాసంతి.. సంచలనంగా మారిన వీడియో.. ప్రేమలో బిగ్ బాస్ కొత్త జంట!

ఆట, మాట తీరుతో హైలైట్
యూట్యూబ్‌లో బిగ్ బాస్ షోకు సంబంధించిన రివ్యూలు, కొన్ని రకాల వీడియోలతో పేరు తెచ్చుకున్న ఆది రెడ్డి.. చాలా మందికి పరిచయం కాలేదు. కానీ, ఇటీవలే బిగ్ బాస్ షో ఆఫర్‌ను సొంతం చేసుకున్నాడు. ఇందులో తనదైన ఆటతీరుతో అందరి మనసులు దోచుకుంటున్నాడు. అదే సమయంలో మాటతీరు, అందరితో వ్యవహరించే తీరుతో మంచి పేరును కూడా అందుకున్నాడు.

టాప్ 5 కంటెస్టెంట్ అంటూ
బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి వచ్చిన కంటెస్టెంట్లు అందరిలోనూ వివాదాలు లేకుండా ఉన్నది చాలా తక్కువ మంది మాత్రమే. అందులో ఆది రెడ్డి పేరు కూడా ఉంటుందని చెప్పొచ్చు. అంతలా అతడు ఆటకు ఆట, స్ట్రాంటజీలు, మంచితనంతో మన్ననలు పొందాడు. దీంతో ఈ సీజన్‌లో ఆది రెడ్డి కచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్‌గా నిలిచి ఫినాలేలో అడుగు పెడతాడని టాక్ వచ్చేసింది.
ఆరియానా ఎద అందాల ప్రదర్శన: ఆమెనింత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!

నిజంగానే ఫినాలే చేరాడు
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో 14వ వారానికి సంబంధించి ఇనాయా సుల్తానా ఎలిమినేట్ అయినట్లు ముందే న్యూస్ లీకైంది. అంటే ఈసారి ఆరుగురు కంటెస్టెంట్లను ఫినాలేకు పంపబోతున్నారు. అందులో ఆది రెడ్డి కూడా ఉన్నాడని తెలిసింది. ఇక, నేటి (ఆదివారం) రాత్రి నుంచి ఫినాలే ఓటింగ్ జరగబోతుంది. ఇందులో ఎక్కువ ఓట్లు వేసి అతడిని గెలిపించాలని ఫ్యాన్స్ అంటున్నారు.

ఆది రెడ్డి ఫ్లిప్పర్ అంటూ
శనివారం జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు అందరితో నాగార్జున క్యాంపైనింగ్ టాస్కును ఆడించాడు. ముందుగా శ్రీహాన్ - రేవంత్ మధ్య ఇది పెట్టాడు. ఆ సమయంలో రేవంత్ మాటలు ఫ్లిప్ చేస్తాడని ఆది రెడ్డితో శ్రీహాన్ చెప్పినట్లు నాగ్ అన్నాడు. దీనిపై ఆది రెడ్డిని వివరణ అడగ్గా.. నేను వినలేదని బదులిచ్చాడు. దీంతో హోస్ట్ 'నువ్వే అసలైన ఫ్లిప్పర్‌వి' అని నిందించాడు.
డ్రెస్ సైజ్ తగ్గించిన బాలయ్య హీరోయిన్: పైన మాత్రం ఏమీ లేకుండానే!

నోరు జారి బుక్కైన ఆది
ఈ టాస్కులో భాగంగా తన వంతు వచ్చిన సమయంలో ఆది రెడ్డి 'నేను రివ్యూలు చెప్పి హౌస్‌లోకి రావడం వల్ల నెగిటివిటీతో వచ్చాను. అది నాకు మైనస్ అవుతుందని భావించాను. ఇందుకోసం స్పెషల్‌గా స్ట్రాటజీలు ప్లే చేసి మొదటి వారాల్లో నెగ్గుకొచ్చాను. ఇప్పుడు ప్రేక్షకుల అండదండలతో ఇక్కడి వరకూ రాగలిగాను' అని చెప్పాడు. దీంతో నాగార్జున అతడికి కౌంటర్లు వేశాడు.

ఆ మాట అనడంతో షాక్
ఆ తర్వాత నాగార్జునతో వాదిస్తోన్న సమయంలో ఆది రెడ్డి 'నేను హౌస్‌లో ఉండడం కోసం ఏ స్ట్రాటజీలు ప్లే చేశానో బయటకు వచ్చిన తర్వాత చెప్తాను' అని అన్నాడు. దీంతో నాగార్జున 'అంటే జనాలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నావా' అంటూ కౌంటర్ వేశాడు. మొత్తానికి ఆది రెడ్డి ఫినాలే ముందు నోరు జారి చేసిన ఈ పొరపాటు అతడికి మైనస్‌గా మారే ఛాన్స్ ఉంది.