అరేయ్ ఎమ్ దోస్తువ్ రా నువ్.. ఫ్రెండ్ ఏడిస్తే చూస్కోవా.. సోహైల్ కు అరియానా కౌంటర్

బిగ్ బాస్ సీజన్ 4 దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరనేది ఇప్పటికే దాదాపు ఖరారైనప్పటికి బిగ్ బాస్ ఎలాంటి ట్విస్టులు ఇస్తాడో చెప్పలేము. హౌజ్ లో ప్రస్తుతం ఉన్న కొందరు కంటెస్టెంట్స్ ఎప్పుడో ఎలిమినెట్ కావాల్సిందనే కామెంట్స్ ఎక్కువగానే వస్తున్నాయి. ఇక 82వ ఎపిసోడ్ లో షోలో హారర్ అంటే ఏమిటో చూపించారు. సరికొత్తగా నెవర్ బిఫోర్ అనేలా కొనసాగింది. అయితే మొదట్లో అఖిల్ ఏడవడం హౌజ్ లో కొందరిని బాధకు గురి చేసింది. దీంతో అరియానా సోహైల్ కు కౌంటర్ ఇచ్చింది.

అతను ఉంటాడో లేదో..

అతను ఉంటాడో లేదో..

బిగ్ బాస్ షోలో ఎప్పటికప్పుడు ఎలిమినేషన్ లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అఖిల్ గత కొన్ని వారాలుగా డేంజర్ జోన్ లోకి వచ్చి చివరి నిమిషంలో సేవ్ అవుతున్నాడు. అయితే ఈ సారి అతను ఉంటాడా లేదా అనేది కూడా సస్పెన్స్ గా మారింది. అఖిల్ తో పాటు నామినేషన్ లో అవినాష్, అరియానా, మోనాల్ ఉన్న విషయం తెలిసిందే.

వాళ్ళు దాదాపు సేఫ్ జోన్ లోనే..

వాళ్ళు దాదాపు సేఫ్ జోన్ లోనే..

అయితే నామినేట్ అయిన నలుగురిలో అవినాష్ దాదాపు సేవ్ అయ్యాడు. అతనికి పాస్ ఇచ్చిన బగ్ బాస్ ఎలాంటి సమయంలోనైనా ఉపయోగించుకోవచ్చని చెప్పడంతో ఆ ధీమాతోనే సంతోషంగా కనిపిస్తున్నాడు. ఇక మోనాల్ ని కూడా మళ్ళీ కంటిన్యూ చేయవచ్చు. ఇక అరియానా విషయంలో చివర వరకు ఏం జరుగుతుందో తెలియదు. ఇక అఖిల్ పరిస్థితి డౌట్ గానే ఉంది.

ఒంటరిగా బాధపడిన అఖిల్

ఒంటరిగా బాధపడిన అఖిల్

తాను డేంజర్ జోన్ లో ఉన్నట్లు అఖిల్ కు అర్థమైనట్లు ఉంది. అందుకే షోలో ఎంత సరదాగా ఉన్నప్పటికి కొన్ని సమయాల్లో ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాడు. గురువారం ఎపిసోడ్ లో అఖిల్ ఒక దగ్గర ఒంటరిగా కూర్చొని ఏడుస్తుండగా అరియానా, అవినాష్ గమనించారు. వెంటనే అతని దగ్గరికి వెళ్లి ఓదార్చే ప్రయత్నం చేశారు. ఏమైంది ఏమైంది అంటూ అరియానా అడుగుతుంటే సైలెంట్ గానే ఉండిపోయాడు అఖిల్.

అరేయ్ ఎమ్ దోస్తువ్ రా నువ్

అరేయ్ ఎమ్ దోస్తువ్ రా నువ్

ఇక ఇంతలో సోహెల్ అది గమనించి ఏం జరిగిందని అతని దగ్గరికి రాగా ముందే గ్రహించిన అవినాష్ హౌజ్ లో నుంచి వెళ్లిపోతానేమోనని బాధపడుతున్నాడని చెప్పాడు. ఇక అరియానా అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన సోహెల్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అరేయ్ ఎమ్ దోస్తువ్ రా నువ్.. ఫ్రెండ్ ఏడిస్తే చూస్కోవా.. అంటూ గట్టిగానే ఇచ్చి పడేసింది. ఇక సోహెల్ ఆ మాటలను పెద్దగా పట్టించుకోకుండా అఖిల్ ని ఓదార్చే ప్రయత్నం చేశాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Abijeet Getting Support From Pawan Kalyan Fans
ఎలిమినేషన్ ఉండకపోవచ్చట..

ఎలిమినేషన్ ఉండకపోవచ్చట..

అఖిల్ హౌజ్ లో అప్పుడప్పుడు చాలా సరదాగా అందరితో కలిసిపోయి కనిపిస్తున్నాడు. టాస్కులో అభిజిత్ ఉన్నా కూడా అతనితో కలిసి చాలా సరదాగా ఆడుతూ వస్తున్నాడు. కానీ ఎలిమినేషన్ అనేది గుర్తొచ్చే సరికి బాధపడుతున్నాడు. ఈ వారం ఎలా సేవ్ అవ్వాలో అనే ఆలోచన అతని మైండ్ లో నిత్యం కదులుతూనే ఉంది. ఇక హౌజ్ నుంచి ఎవరు బయటకు వెళ్లిపోతారో శనివారం లోపు ఒక క్లారిటీ వస్తుంది. ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అనే రూమర్స్ కూడా వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X