Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
శృతి మించిన అఖిల్ రొమాన్స్: వెనుక నుంచి హగ్ చేసుకుని.. బాత్‌రూంలో ఏం చేశానో చెప్పనా అంటూ!
అఖిల్ సార్థక్.. కొద్ది రోజులుగా బాగా వినిపిస్తోన్న పేరిది. దీనికి కారణం అతడు ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ షోలో పాల్గొనడమే. అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించడంతో పాటు మోస్ట్ డిజైరబుల్ మెన్ ఇన్ హైదరాబాద్‌గా ఎంపికయ్యాడు. అయినప్పటికీ పెద్దగా గుర్తింపు మాత్రం దక్కలేదు. కానీ, బిగ్ బాస్ షోలో అతడు వ్యవహరిస్తున్న తీరుతో తరచూ వార్తల్లో ఉంటున్నాడు. మరీ ముఖ్యంగా లవ్ ట్రాకుతో బాగా ఫేమస్ అయ్యాడు. ఈ నేపథ్యంలో హౌస్‌లో ఓ కంటెస్టెంట్‌తో అఖిల్ ప్రవర్తించిన తీరుతో విమర్శలపాలవుతున్నాడు. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళ్తే..

మోనాల్ గజ్జర్‌తో లవ్ ట్రాకుతో ఫేమస్
బిగ్ బాస్ నాలుగో సీజన్ ఆరంభంలో మోనాల్ గజ్జర్... అభిజీత్‌తో లవ్ ట్రాక్ నడిపినట్లు బాగా ప్రచారం జరిగింది. అయితే, అఖిల్ సార్థక్ ఆమెకు దగ్గరవడంతో అతడికి దూరమైంది. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య బలమైన బంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ నిర్వహకులు కూడా వీళ్లనే బాగా ఫోకస్ చేయడంతో అఖిల్ తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు.

ఆమె కోసం గొడవలు.... నాగ్ చీవాట్లు
బిగ్ బాస్ హౌస్‌లో ఎక్కువగా గొడవలు పడలేదు కానీ, అఖిల్ సార్థక్‌కు యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే పేరొచ్చింది. సీజన్ ఆరంభం నుంచీ అభిజీత్‌తో తరచూ గొడవలు పడడం కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది. అది కూడా మోనాల్ గజ్జర్ కారణంగానే వీళ్లకు గొడవలు జరిగాయి. ఓ టాస్కులోనైతే ఆమె పేరును తీసుకొచ్చి వాదనకు దిగాడు. దీంతో నాగార్జున నుంచి చీవాట్లు తిన్నాడు.

ఆమెతోనే ఉంటూ.. ఆమె కోసమే ఆడి
బిగ్ బాస్ షోలో అఖిల్ సార్థక్ తరచూ మోనాల్ గజ్జర్‌తోనే కలిసి కనిపిస్తుండేవాడు. నిర్వహకులు కూడా ఈ జంటనే బాగా ఫోకస్ చేయడంతో మరింత హైలైట్ అయ్యాడు. అంతేకాదు, టాస్కుల్లో సైతం ఆమెకు అనుకూలంగానే ఆడుతుండేవాడు. నామినేషన్స్ సమయంలోనూ ఆమెను మినహాయించి మిగిలిన వారిని నామినేట్ చేసేవాడు. తద్వారా ఆమెపై ప్రేమను చాటుకునేవాడు.

ఫినాలేకు ఎంట్రీ.. ఎంజాయ్ ఎంజాయ్
ఆ మధ్య జరిగిన ‘రేస్ టు ఫినాలే' టాస్కులో విజయం సాధించడం ద్వారా ఓ వారం ముందుగానే ఫైనల్‌లోకి అడుగు పెట్టాడు అఖిల్ సార్థక్. ఈ సంతోషంలోనే బిగ్ బాస్ హౌస్‌లో యమ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆరియానా గ్లోరీ, దేత్తడి హారికతో తరచూ పులిహోర కలుపుతూ చిల్ అవుతున్నాడు. దీని వల్ల మోనాల్ గజ్జర్‌తో అతడికి గొడవ కూడా జరిగిన విషయం తెలిసిందే.

శృతి మించిన రొమాన్స్.. హగ్ చేసుకుని
మొన్నటి ఎపిసోడ్‌లో ‘హారికతో ఎందుకంత క్లోజ్‌గా ఉంటున్నావ్' అని మోనాల్.. అఖిల్‌ను నిలదీసింది. దీంతో ‘నీ వల్లే నేనలా తయారయ్యాను. నువ్వు మంచిగా ఉంటే ఎందుకలా వేరే వాళ్లతో ఉంటా' అని బదులిచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి హారికతో శృతి మించిన రొమాన్స్ చేశాడు అఖిల్. అంతేకాదు, వెనుక నుంచి హగ్ చేసుకుని మోనాల్‌ను ఉడికించే ప్రయత్నం చేశాడు.

డబుల్ మీనింగ్ డైలాగులతో ఆమె కూడా
హగ్ చేసుకున్న సమయంలో అఖిల్ ‘నీ షాంపూ ఎక్కడిదే.. మంచి స్మెల్ వస్తుంది' అని హారికను ప్రశ్నించగా.. ‘బాత్‌రూంలోనే ఉంది. నువ్వు కళ్లు ఎక్కడ పెట్టుకుని స్నానం చేస్తున్నావ్' అని డబుల్ మీనింగ్ వచ్చేలా కొంటెగా జవాబిచ్చింది. దీనికి అతడు స్పందిస్తూ ‘నేను కళ్లు ఎక్కడ పెట్టుకున్నానో చెబితే బాగోదులే' అంటూ అదే రీతిలో రిప్లై ఇవడంతో దీనిపై ట్రోల్స్ వస్తున్నాయి.