Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిగ్ బాస్ షోలో ఫైటింగ్: సరదాగా కొడితే సీరియస్ అయింది.. కళ్లపై తగలడంతో తట్టుకోలేక!
కొన్ని కోట్ల మంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి, నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. సరికొత్త కంటెంట్‌తో నడిచే ఈ షో అన్ని భాషల కంటే మన దగ్గరే ఎక్కువ రెస్పాన్స్‌ను అందుకుంటోంది. అందుకే మూడు సీజన్లు పూర్తి చేసి, నాలుగోది మొదలెట్టారు. కొద్ది రోజులు క్రితం మొదలైన నాలుగో సీజన్ తుది అంకానికి చేరుకుంది. దీంతో షోలో ఊహించని సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతోన్న 'రేస్ టు ఫినాలే టాస్క్'లో ఇద్దరు కంటెస్టెంట్లు కొట్టుకున్నారు. సరదాగా జరిగినప్పటికీ నిజంగానే దెబ్బ తగలడంతో ఈ ఇష్యూ సీరియస్ అయింది. ఆ వివరాలు మీకోసం!

నేరుగా ఫినాలేకు వెళ్లేందుకు అవకాశం
ప్రీమియర్ ఎపిసోడ్‌కు ఏకంగా 18 ప్లస్ రేటింగ్ సాధించి గ్రాండ్ ఓపెనింగ్‌తో ప్రారంభం అయింది బిగ్ బాస్ నాలుగో సీజన్. అప్పటి నుంచి ఒకే తరహా స్పందనతో దూసుకుపోతోందీ షో. ఇప్పుడు చివరి దశకు చేరుకోవడంతో మరింత ఆసక్తికరంగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నామినేషన్స్‌లో లేకుండా నేరుగా ఫినాలేకు వెళ్లేందుకు కంటెస్టెంట్లకు బిగ్ బాస్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు.

మూడు రౌండ్లుగా రేస్ టు ఫినాల్ టాస్క్
గతంలో మాదిరిగానే ఈ సారి కూడా బిగ్ బాస్ షోలో ‘రేస్ టు ఫినాలే' టాస్క్ మొదలైంది. ఇందులో విజేతగా నిలిచిన ఒక కంటెస్టెంట్ నేరుగా ఫినాలేలో అడుగు పెడతారు. అయితే, ఈ వారం నామినేషన్స్‌లో ఉంటే ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా మొత్తం ఈ టాస్క్ మూడు రౌండ్లలో జరుగుతుందని బిగ్ బాస్ ముందుగానే ప్రకటించాడు.

రెండు రౌండ్లలో ఐదుగురు సభ్యులు ఔట్
మొదటి రౌండ్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఓ ఆవును పెట్టి.. దాని నుంచి వచ్చే పాలను బాటిళ్లలో నింపుకోవాల్సి ఉంటుంది. ఎవరి దగ్గర తక్కువ ఉంటే వాళ్లు తప్పుకోవాలి. ఈ రౌండ్‌లో ఆరియానా, అవినాష్, మోనాల్‌లు నిష్క్రమించారు. తర్వాతి రౌండ్‌లో బయటి నుంచి పడే పూలను పట్టుకోవాలి. ఇందులో అభిజీత్, దేత్తడి హారిక తక్కువ పట్టుకోవడంతో ఔట్ అయ్యారు.

తుది పోరు ఇద్దరు స్నేహితుల మధ్యలో
రెండు రౌండ్లను విజయవంతంగా పూర్తి చేసిన అఖిల్ సార్థక్.. సయ్యద్ సోహెల్ రియాన్ తుది పోరుకు అర్హత సాధించారు. ఇందులో ఇద్దరు పోటీదారులు గార్డెన్ ఏరియాలో ఉన్న ఉయ్యాలపై కూర్చుని ఊగుతూ ఉండాలి. ఆ సమయంలోనే బిగ్ బాస్ ఇచ్చే పనులు చేయాలి. ఎవరైతే చివరి వరకూ ఉంటారో వాళ్లే ‘రేస్ టు ఫినాలే' గెలుస్తారు. దీనికి అభిజీత్ సంచాలకుడిగా ఉన్నాడు.

సరదాగానే కొట్టుకున్న ఇద్దరు కంటెస్టెంట్లు
తుది రౌండ్‌లో భాగంగా ఉయ్యాలపై ఉన్న అఖిల్ సార్థక్.. సోహెల్ రియాన్‌కు బిగ్ బాస్ జ్యూస్‌లు, పాలు తదితర డ్రింక్స్ ఇచ్చాడు. ఆ సమయంలోనే హౌస్‌లో ఉండేందుకు ఇద్దరిలో ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు చెప్పుకోవాల్సి ఉంటుందని ఆదేశించాడు. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు ఇద్దరి మధ్యా డిస్కర్షన్ జరిగింది. అది ఎలాగోలా సర్ధుమణిగినా.. ఆ తర్వాత ఇద్దరూ కొట్టుకున్నారు.

ఇంకొకరు అయితే కథ వేరేలా ఉండేదేమో
ఈ రౌండ్ జరుగుతున్న సమయంలోనే అఖిల్.. సోహెల్ ముఖంపై దిండుతో కొట్టాడు. అది అతడికి బాగా తగిలింది. వెంటనే కళ్లలోంచి నీళ్లు కూడా వచ్చాయి. దీంతో కోపం తెచ్చుకున్న సోహెల్.. అతడిని కూడా నాలుగైదు దెబ్బలు కొట్టాడు. బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో గొడవ జరిగినా సున్నితంగా పరిష్కరించుకున్నారు. ఇంకొకరు ఎవరైనా అయితే కథ వేరేలా ఉండేదన్న కామెంట్లు వస్తున్నాయి.