నేనైతే సోహెల్ గాడిలా చేయను.. నాకు క్యారెక్టరే ముఖ్యం: ప్రైజ్‌మనీ ఇష్యూపై అఖిల్ షాకింగ్ కామెంట్స్

తెలుగులో బిగ్ బాస్ షో ఎంత సక్సెస్ అయిందో.. అది క్రియేట్ చేసిన రికార్డులను బట్టి తెలుసుకోవచ్చు. దాని ప్రభావం ఇండస్ట్రీపై ఎంత పడిందో.. అందులో పాల్గొన్న కంటెస్టెంట్ల కెరీర్‌లను బట్టి చూడొచ్చు. అంతలా ఈ షో నాలుగేళ్లుగా హవాను చూపిస్తోంది. మరీ ముఖ్యంగా చాలా మంది చిన్న చిన్న ఆర్టిస్టులను బిగ్ సెలెబ్రిటీలుగా మార్చేసిందీ షో. అలాంటి వారిలో అఖిల్ సార్థక్ కూడా ఒకడు. గతంలో ఎవరికీ పరిచయం లేని అతడు.. ఇప్పుడు ఎంతో ఫేమస్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన స్నేహితుడు సోహెల్ క్యారెక్టర్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

అలా వచ్చాడు.. ఇలా ఫేమస్ అయ్యాడు

అలా వచ్చాడు.. ఇలా ఫేమస్ అయ్యాడు

'బావ మరదలు' అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా వెలుగులోకి వచ్చాడు అఖిల్ సార్థక్. ఆ తర్వాత మోడల్‌గా మారి ఎన్నో పోటీల్లో పాల్గొన్నాడు. ఈ సమయంలోనే మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత 'కల్యాణీ' అనే సీరియల్‌లో నటించాడు. దీనితో పాటు ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. ఇలా బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశం అందుకున్నాడు.

హీరోయిన్ లవ్ ట్రాకుతో మరింత హైలైట్

హీరోయిన్ లవ్ ట్రాకుతో మరింత హైలైట్

బిగ్ బాస్ షోలోకి సాదాసీదా కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. అయితే, అసాధారణమైన ఆటతో ఎంతగానో ఫేమస్ అయ్యాడు. అంతేకాదు, ప్రముఖ హీరోయిన్ మోనాల్ గజ్జర్‌తో లవ్ ట్రాకు వల్ల బాగా పాపులర్ అయ్యాడు. చనువుగా ఉండడంతో పాటు ఆమెకు ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకునే వాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం మొదలైంది.

స్నేహం అంటే ఇదేరా అన్నట్లుగా వాళ్లు

స్నేహం అంటే ఇదేరా అన్నట్లుగా వాళ్లు

బిగ్ బాస్ హౌస్‌లో అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్‌తో కాకుండా సయ్యద్ సోహెల్ రియాన్‌తో ఎక్కువ క్లోజ్‌గా ఉండేవాడు. స్నేహం అంటే ఇధేరా అన్నట్లుగా వీళ్లిద్దరూ వ్యవహరించేవారు. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు ఒకరికొకరు త్యాగాలు చేసుకున్నారు. ఇలానే నామినేషన్లు కూడా చాలా పర్యాయలు తప్పించుకున్నారు. ఫలితంగా అఖిల్ సోహెల్ ఇద్దరూ టాప్-5లో స్థానం దక్కించుకున్నారు.

షో వల్ల అతడికి లాభం.. అఖిల్‌కు మాత్రం

షో వల్ల అతడికి లాభం.. అఖిల్‌కు మాత్రం

గ్రాండ్ ఫినాలేలో సయ్యద్ సోహెల్ రియాన్‌కు బిగ్ బాస్ రూ. 25 లక్షల ఆఫర్‌ ఇవ్వగానే అతడు ఓకే చెప్పి పోటీ నుంచి తప్పుకున్నాడు. దీనికితోడు రెమ్యూనరేషన్ కూడా దక్కించుకున్నాడు. దీంతో అతడు భారీ మొత్తాన్నే అందుకున్నాడు. అంతేకాదు, అతడి ప్రవర్తనతో హీరోగా నిలిచాడు. అయితే, అఖిల్ మాత్రం తుది మెట్టుపై బోల్తా పడి రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నాడు.

షోలో అఖిల్‌కు ముట్టినది ఎంతో తెలుసా?

షోలో అఖిల్‌కు ముట్టినది ఎంతో తెలుసా?

అఖిల్ సార్థక్ బిగ్ బాస్ హౌస్‌లో 105 రోజుల పాటు కొనసాగాడు. అతడు రోజుకు రూ. 25 వేలు చార్జ్ చేసినట్లు తెలిసింది. దీంతో మొత్తంగా షోలో ఉన్నందుకు రూ. 26 లక్షల 25 వేలు రెమ్యూనరేషన్‌గా అందుకున్నాడని సమాచారం. మిగిలిన కంటెస్టెంట్లు సినిమా ఆఫర్లనో.. షోలనో మొదలు పెడుతుంటే.. అఖిల్ మాత్రం ఇంకా ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

ప్రైజ్‌మనీ ఇష్యూపై అఖిల్ షాకింగ్ కామెంట్స్

ప్రైజ్‌మనీ ఇష్యూపై అఖిల్ షాకింగ్ కామెంట్స్


తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.. 'ఫినాలేలో సోహెల్ డబ్బులు తీసుకోవడం వాడి వ్యక్తిగతం. వాడికి మనీ అవసరం కాబట్టే తీసుకున్నాడు. నేనైతే అస్సలు డబ్బులు తీసుకోను. నాకు క్యారెక్టరే ముఖ్యం. మనీ కావాలంటే బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు. ప్రేక్షకులు ఇచ్చిన మద్దతును డబ్బుతో కొనగలమా' అంటూ షాకింగ్‌గా మాట్లాడాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X