Just In
- 53 min ago
అది కంట్రోల్ చేయడమే నా పేరుకు అర్థం.. ఎద అందాలతో చిచ్చుపెట్టిన ఊర్వశీ
- 1 hr ago
ఇదెక్కడి వింతరా బాబు.. సుత్తితో కొట్టేసుకుంటోన్న హీరో.. వీడియో వైరల్
- 2 hrs ago
నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ: ముహూర్తం ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్
- 2 hrs ago
సమంత ఖాతాలో ఊహించని రికార్డు: ఇండియాలో ఏ హీరోయిన్‌కూ దక్కని ఘనత సొంతం
Don't Miss!
- News
Union Budget 2021: సామాన్యుడి బడ్జెట్‌గా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
- Automobiles
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- Sports
శాంసన్ కెప్టెన్సీలో ఆడడానికి ఎదురుచూస్తున్నా: దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్
- Lifestyle
సెక్స్ సమయంలో మీరు ఈ పని చేస్తే ఏమి జరుగుతుంది?
- Finance
Union Budget 2021: ఈ సారి బడ్జెట్ ఎలా ఉండాలి.. ఎలాంటి సవాళ్లున్నాయి..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అభిజీత్‌పై అలా పగ తీర్చుకుంటోన్న అఖిల్: పేరు చెప్పకుండానే తెలివిగా దెబ్బకొడుతున్నాడు
తెలుగులో బిగ్ బాస్ షో ఎంతగా ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి కారణం ఎన్నో అంశాలు ఉన్నాయి. అందులో గొడవలు కూడా ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. మొదటి సీజన్ నుంచి తీసుకుంటే ప్రతి దానిలో హౌస్‌మేట్ల మధ్య ఫైట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇంట్లోని సభ్యులు గ్రూపులుగా ఏర్పడడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పరిపాటి అయింది. ఇక, ఈ సీజన్‌లో అఖిల్ సార్థక్, అభిజీత్ మధ్య మొదటి నుంచీ పడడం లేదు. కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కలిసినట్లు కనిపించినా.. మళ్లీ వీళ్లిద్దరి మధ్య మోనాల్ విషయంలో గొడవ మొదలైంది. ఆ వివరాలు మీకోసం!

అభిజీత్ - అఖిల్ ఫైట్‌కు కారణం ఆమెనే
బిగ్ బాస్ హౌస్‌లోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చారు అభిజీత్, అఖిల్. షో ఆరంభంలో వీళ్లిద్దరూ బాగానే ఉన్నారు. కానీ, ఎప్పుడైతే వీళ్ల లైఫ్‌లోకి మోనాల్ గజ్జర్ ఎంట్రీ ఇచ్చిందో.. అప్పటి నుంచి మొత్తం మారిపోయింది. మొదట్లో అభితో చనువుగా ఉన్నట్లు కనిపించిన ఆమె.. తర్వాత అఖిల్‌తో కలిసి నడుస్తోంది. ఇదే వాళ్లిద్దరి మధ్య దూరం పెరగడానికి ప్రధాన కారణం అయింది.

నామినేషన్ టాస్కుతో లెవెల్ దాటేసింది
షోలో భాగంగా జరిగిన నామినేషన్ టాస్కులో మోనాల్ పేరును వాడాడు అఖిల్. ఆ సమయంలో ఎంతో కోపంగా కనిపించిన అతడు.. అభిజీత్‌పై గొడవకు దిగాడు. ‘నువ్వు మోనాల్‌తో చెడుగా ప్రవర్తిస్తున్నావ్. అమ్మాయిని అంతలా హేట్ చేస్తావా' అంటూ ఏవేవో చెప్పుకొచ్చాడు. ఈ వ్యవహారంతో ఆమె పరువు పోయింది. అప్పుడు నాగార్జున కూడా అఖిల్, అభిపై ఫైర్ అయ్యారు.

అలా కలిశారు.. సీక్రెట్ రూమ్‌తో మళ్లీ..
బిగ్ బాస్ హౌస్‌లో గొడవలు సాధారణమే అనుకున్నారో ఏమో.. అఖిల్‌తో కలిసేందుకు అభిజీత్ ముందుకొచ్చాడు. దీంతో అతడు కూడా గొడవలు మర్చిపోయి మంచిగా ఉందామని డిసైడ్ అయ్యాడు. సరిగ్గా అదే సమయంలో అఖిల్ సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లాడు. అప్పుడు అతడిని ఉద్దేశించి అభిజీత్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య మళ్లీ గొడవ మొదలైంది.

కుటుంబ సభ్యుల రాకతో కలిపోయారు
గత వారం బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో అఖిల్ తల్లి, అభిజీత్ మదర్ వీళ్లిద్దరి గొడవలపై ఎంతో పాజిటివ్‌గా స్పందించారు. గేమ్ కోసం కొట్లాడుతున్నారని, అందులో తమకు ఎటువంటి బాధ లేదని చెప్పుకొచ్చారు. దీంతో ఒకరికొకరు సారీ చెప్పుకున్న అభి, అఖిల్.. ఆ తర్వాత కలిసిపోయినట్లు కనిపించారు.

అభిజీత్‌పై పగ తీర్చుకుంటోన్న అఖిల్
హమ్మయ్యా.. అఖిల్ అభిజీత్ కలిసిపోయారు అని ఇద్దరి ఫ్యాన్స్ సంతోష పడుతోన్న సమయంలో, వీళ్లిద్దరి మధ్య కోల్డ్ వార్ మాత్రం తగ్గలేని మళ్లీ నిరూపణ అయింది. ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియ సమయంలో అభి సైలెంట్‌గానే ఉన్నా.. అఖిల్ మాత్రం తరచూ అతడిని ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు. మిగిలిన వాళ్లను అతడిపైకి రెచ్చగొడుతూ పగ తీర్చుకుంటున్నట్లు చేస్తున్నాడు.

తెలివిగా దెబ్బకొడుతోన్న అఖిల్ సార్థక్
నామినేషన్ టాస్క్ తర్వాత అభిజీత్‌ను బ్యాడ్ చేసేందుకు అఖిల్ బాగా ట్రై చేస్తున్నట్లు కనిపించాడు. కోపంతో ఉన్న అవినాష్ దగ్గరకు వెళ్లి ‘ఈ మనిషి స్వాప్ వద్దంటూనే ఛాన్స్ వస్తే తీసుకున్నాడు' అని అతడిని రెచ్చగొట్టాడు. ఆ తర్వాత సోహెల్ దగ్గర కూడా ఇలానే చేశాడు. ఇందులో గమనించదగ్గ విషయం ఏమిటంటే అభీని విమర్శించేప్పుడు అతడి పేరు వాడడం లేదు అఖిల్.