Don't Miss!
- News
Chain Snatching: ఫుడ్ డెలివరీ బాయ్‌గా వచ్చి చైన్ స్నాచింగ్..
- Sports
IND vs NZ మూడో టీ20లో పృథ్వీ షాను ఖచ్చితంగా ఆడించాలి! ఎందుకంటే..?
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Lifestyle
Garuda Purana: ఈ పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలి.. లేదంటే సమస్యలు తప్పవు
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Technology
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
సోహైల్ ను చులకన చేసిన సన్నీ.. కౌంటర్ ఇచ్చి డిలీట్ చేసిన అఖిల్?
బిగ్‌బాస్ సీజన్-5 విజేతగా నిలిచిన సన్నీ హీరోగా లాంచ్ అవుతున్నారు. బిగ్ బాస్ కు ముందే ఆయన హీరోగా నటించిన ఒక సినిమా ఇప్పుడు విడుదల కాబోతోంది. సకల గుణాభిరామా పేరుతో విడుదలవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో సోహైల్ ను సన్నీ అవమానించాడు అని అఖిల్ మండిపడ్డారు అయితే కాసేపటికే ఆ కామెంట్ డిలీట్ చేశారు. ఆ వివరాలు..

ట్రైలర్ లాంచ్
వీజే సన్నీ హీరోగా నటించిన చిత్రం 'సకల గుణాభిరామ'. రచయిత వెలిగొండ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా డైరెక్టర్ అనిల్ రావిపూడి, విశ్వక్ సేన్, సోహైల్ సహా కొందరు బిగ్‌బాస్ కంటెస్టెంట్ లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విశ్వక్ సేన్ అతిథిగా రావడంతో వీజే సన్నీ ఎమోషనల్ అయ్యాడు.

పైసల్ కాదు... దోస్తులు
అయితే
బిగ్‌బాస్
ట్రోఫీ
గెలిచేందుకు
విశ్వక్
సేన్
చేసిన
ప్రయత్నాన్ని
గుర్తుకు
తెచ్చుకున్న
సన్నీ.
'నేను
బిగ్‌బాస్
టైటిల్
కొట్టడానికి
కారణం
నా
స్నేహితులే.
వాళ్లే
నా
వెనుక
ఉండి
నన్ను
ముందుకు
నడిపిస్తారు.
జీవితంలో
కావాల్సింది
పైసల్
కాదు,
దోస్తులు,
నా
దోస్తులందరికీ
నేను
హీరో
కావాలనే
కల
ఉండేది.
ఆ
కలను
ఈ
సినిమాతో
నిజం
చేశా
అని
అన్నారు,

ఫిదా అయిపోయా
ఇక ఈ లాంచ్ కు పిలవగానే విశ్వక్ సేన్ అన్న, అనిల్ అన్నా వచ్చారు. నేను బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు విశ్వక్ సేన్‌కు నేను ఎవరో తెలియదు. కానీ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారని బయటకు రాగానే నా స్నేహితులు చెప్పారు. విశ్వక్ సేన్ అన్న ఎంత సపోర్ట్ చేశారో.. అనిల్ రావిపూడి అన్న అంతే సపోర్ట్ చేశారు. నేను బయటకు రాగానే అన్నని కలిశా వాళ్ల డాటర్ కేక్ కట్ చేసిన వీడియో నాకు చూపించేసరికి నేను ఫిదా అయిపోయా అని చెప్పుకొచ్చాడు వీజే సన్నీ.

డబ్బులు తీసుకుని
ఇక సోహైల్ గురించి మాట్లాడుతూ నాల్గో సీజన్‌లో గెలుస్తాడనుకుంటే డబ్బులు తీసుకుని బయటకు వచ్చేశాడని సోహైల్ గురించి సన్నీ మాట్లాడాడు. 'నాల్గో సీజన్‌లో సోహైల్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కానీ వీడు డబ్బులు తీసుకుని వచ్చేశిండు. నన్ను కూడా అందరూ అంతే అన్నారు. నీకన్నా 10 లక్షలు ఎక్కువే పెట్టిర్రు. అయినా సరే టెంప్ట్ కాలేదు. కళావతికి కప్పు ముఖ్యం బిగిలూ.. అందుకే గెలిచి వచ్చా' అని చెప్పుకొచ్చాడు సన్నీ. ఇక్కడ సన్నీకి ఎలాంటి ఉదేశ్యం ఉందొ తెలియదు కానీ ఆయన చులకనగా అన్నట్టు అందరూ అర్థం చేసుకుంటున్నారు.

పరోక్షంగా అఖిల్ సార్థక్
ఈ కామెంట్లపై నాలుగో సీజన్ రన్నరప్ అఖిల్ సార్థక్ పరోక్షంగా స్పందించాడు. సన్నీ పేరు తీయకుండానే అతడిపై మండిపడ్డాడు. 'ఎవరినైనా ఒక కార్యక్రమానికి పిలిచినప్పుడు వారిని గౌరవించాలి తప్ప అవమానించకూడదు. మనం హీరో అవడానికి పక్కవాళ్లను జీరో చేయొద్దు బ్రదర్. నా స్నేహితుడిని అలాంటి పరిస్థితుల్లో స్టేజీ మీద చూడటం చాలా బాధనిపించింది. అప్పుడు నేనక్కడ ఉంటే బాగుండేది!' అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొన్నాడు. అయితే మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో తర్వాత కాసేపటికే ఆ పోస్ట్ డిలీట్ చేశాడు. ప్రస్తుతానికి ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.