మోనాల్ - అఖిల్ వీడియో కాల్ లీక్: ఆ ప్లేస్‌ను కూడా వదల్లేదు.. ఏకంగా అలాంటి పనులు చేసి బుక్కైన జంట
తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుని.. దాదాపు నాలుగేళ్లుగా నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ షో.. స్వల్ప కాలంలోనే ఎన్నో రికార్డులను తిరగరాయడంతో పాటు కొన్ని మైలురాళ్లను కూడా చేరుకుంది. అదే సమయంలో ఎంతో మందిని సెలెబ్రిటీలుగా మార్చేసింది. అందులో మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్ మాత్రం జంటగా ఫేమస్ అయ్యారు. షోలోనే కాదు బయట కూడా వీళ్లిద్దరూ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా ఆ ప్లేస్‌ను కూడా వదల్లేదు. అసలేం జరిగింది? వివరాలు మీకోసం!

అప్పుడే కుదిరిన అఖినాల్ బంధం
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్. ఆరంభంలో వీళ్లిద్దరూ దూరం దూరంగానే ఉంటూ వచ్చారు. కానీ, కొద్ది రోజులకు చూపులు, మాటలు కలుపుకున్నారు. అప్పటి నుంచి ఎప్పుడూ కలిసే కనిపించేవారు. అలా వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పట్లో ట్రైయాంగిల్ లవ్ అని ఒక ట్రాక్ కనిపించినా.. అది ఆగిపోయింది.

హగ్గులు.. ముద్దులతో రచ్చ చేస్తూ
ఆరంభం నుంచే మిగిలిన వాళ్లందరికీ భిన్నంగా కనిపించిన మోనాల్.. ఆ తర్వాత అఖిల్ సార్థక్ నేరుగానే ప్రేమను పండించింది. ఎక్కువగా అతడితోనే ఉంటూ.. అతడి కోసమే ఆడుతూ హాట్ టాపిక్ అయింది. అంతేకాదు, తరచూ ప్రేమను వ్యక్తపరచుకోవడం వంటివి చేశారిద్దరూ. అదే సమయంలో ముద్దులు, హగ్గులు ఇస్తూ వార్తల్లో నిలిచారు. తద్వారా ఈ జంట బాగా హైలైట్ అయింది.

బిగ్ బాస్ వల్ల మొత్తం మారిందిగా
బిగ్ బాస్ షో పుణ్యమా అని అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ జోడీ ఎనలేని క్రేజ్‌ను అందుకున్నారు. అదే సమయంలో వీళ్లిద్దరూ ఆట పరంగానూ సత్తా చాటారు. దీంతో రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకున్నారు. అంతేకాదు, సినిమా, షోలు, వెబ్ సిరీస్‌లలో అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. మోనాల్ వరుస షూట్లతో బిజీగా ఉంటే అఖిల్ మూవీని ప్రకటించాడు.

బయట కూడా అవే పనులు చేసి
బిగ్ బాస్ హౌస్‌లో దాదాపు వంద రోజుల పాటు జంటగా హల్‌చల్ చేసిన మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్.. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే తీరుదతో వార్తల్లో నిలుస్తున్నారు. తరచూ కలవడం.. జంటగా పార్టీలు చేసుకోవడం.. ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరచుకోవడం వంటి వాటితో నిత్యం హాట్ టాపిక్ అవుతున్నారు. దీంతో ఈ జంట బయట కూడా ట్రెండింగ్ అవుతోంది.

జంట కాబోతున్నారు.. ఆలస్యంగా
ప్రేమికుల రోజును పురస్కరించుకుని అఖిల్ సార్థక్‌తో చేస్తున్న వెబ్ సిరీస్‌ను ప్రకటించింది మోనాల్ గజ్జర్. 'తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు, ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే, ఇద్దరి డేట్స్ కుదరకపోవడంతో ఇది ఇంకా పట్టాలెక్కలేదని తెలిసింది.

మోనాల్ - అఖిల్ వీడియో కాల్ లీక్
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తరచూ ఏదో ఒక రకంగా కలుస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్. ఇప్పటికే ఎన్నో సార్లు వార్తల్లో నిలిచిన ఈ జోడీ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అయినప్పటికీ మరింతగా రెచ్చిపోయి రచ్చ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే వీళ్లిద్దరూ మాట్లాడుకున్న వీడియో కాల్ తాజాగా బయటకు వచ్చింది.
Recommended Video

అలాంటి పనులు చేసి బుక్కైన జంట
రెండు రోజులుగా అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ వీడియో కాల్స్ మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని వాళ్లే తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపారు. దానికి సంబంధించిన వీడియోలను సైతం పోస్ట్ చేశారు. విశేషమేమిటంటే.. మోనాల్ డ్యాన్స్ ప్లస్ షూటింగ్ స్పాట్ నుంచి వీడియో కాల్ మాట్లాడగా.. అఖిల్ వాళ్ల అమ్మ పక్కనే ఉండి మరీ మాట్లాడాడు. ఇక, వాటిలో రొమాంటిక్ చూపులతో సైగలు చేసుకుంటూ మరోసారి బుక్కైపోయారు.


Click it and Unblock the Notifications











