For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శుభవార్త చెప్పిన అఖిల్ సార్థక్: చేతిలో పట్టుకుని చూపించేశాడు.. ఎదుగుతున్నావంటూ మోనాల్ కామెంట్!

  |

  చాలా మంది సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తుంటారు. కానీ, కొంత మంది మాత్రమే మంచి గుర్తింపును అందుకుని స్టార్లుగా నిలుస్తారు. మిగిలిన వాళ్లు మాత్రం పెద్దగా పేరు తెచ్చుకోలేరు. అలాంటి వాళ్లే బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకుంటున్నారు. అందులో మిస్టర్ హ్యాండ్సమ్ అఖిల్ సార్థక్ ఒకడు. నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన అతడు.. తన వ్యవహార శైలితో ఎనలేని గుర్తింపును, ఫాలోయింగ్‌ను అందుకున్నాడు. ఇలాంటి సమయంలోనే తాజాగా అతడు ఓ శుభవార్తను చెప్పాడు. దీనికి మోనాల్ గజ్జర్ కూడా కామెంట్ చేసింది. వివరాల్లోకి వెళ్తే...

  అలా మొదలైన కెరీర్... కెరీర్‌లో చేసిందివే

  అలా మొదలైన కెరీర్... కెరీర్‌లో చేసిందివే

  సినిమాల్లో నటించాలన్న కోరికతో మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించాడు అఖిల్ సార్థక్. అలా మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌ ఇన్ హైదరాబాద్‌గా ఎంపికయ్యాడు. అదే సమయంలో ‘బావ మరదలు' అనే షార్ట్ ఫిలిం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. ‘కల్యాణీ' అనే సీరియల్‌తో బుల్లితెరపైనా మెరిశాడు. కానీ, సరైన గుర్తింపును మాత్రం అందుకోలేదు.

  బిగ్ బాస్‌లో ప్రవేశం.. అద్భుతమైన ఆటతో

  బిగ్ బాస్‌లో ప్రవేశం.. అద్భుతమైన ఆటతో


  వెండితెరపై, బుల్లితెరపై నటించి మెప్పించిన అఖిల్ సార్థక్.. గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. లోపలికి ప్రవేశించిన రోజు నుంచే తన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు. ముక్కుసూటిగా ఉంటూ.. తనకు తోచింది చెబుతూ ఫేమస్ అయ్యాడు. అంతేకాదు, పెద్ద బాస్ ఇచ్చే ప్రతి టాస్కులోనూ తన శ్రమను చూపిస్తూ సత్తా చాటాడతను.

  షోలో ఆమెతో లవ్ ట్రాక్... రొమాన్స్ కూడా

  షోలో ఆమెతో లవ్ ట్రాక్... రొమాన్స్ కూడా


  షో ఆరంభంలో పెద్దగా ఎవరితోనూ కలవని అఖిల్ సార్థక్.. చిన్నగా హీరోయిన్ మోనాల్ గజ్జర్‌కు క్లోజ్ అయిపోయాడు. అప్పటి నుంచి ఆమెతోనే ఉంటూ ఆమె కోసమే ఆడుతూ హాట్ టాపిక్‌గా మారాడు. ఆ సమయంలోనే ఆమెతో కొంటెగా చూస్తూ మాట్లాడడం.. హగ్గులు చేసుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం వంటివి చేశాడు. దీంతో వీళ్ల మధ్య లవ్వాట జరుగుతుందని అంతా ఫిక్సయ్యారు.

  బయట కూడా రచ్చే.. కలిసి మొదలెట్టారు

  బయట కూడా రచ్చే.. కలిసి మొదలెట్టారు

  బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ చేసిన మోనాల్ - అఖిల్ బయట కూడా అదే ఫాలో అవుతున్నారు. తరచూ కలవడం, పార్టీలు చేసుకోవడం వంటి వాటితో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అంతేకాదు, వీళ్లిద్దరూ కలిసి జంటగా ‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు.

  చేతిలో చూపిస్తూ శుభవార్త చెప్పిన అఖిల్

  చేతిలో చూపిస్తూ శుభవార్త చెప్పిన అఖిల్


  బిగ్ బాస్ షో పూర్తై చాలా రోజులే కావొస్తున్న తన కొత్త సినిమా గురించి ఇప్పటి వరకూ ప్రకటించలేదు అఖిల్ సార్థక్. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సంక్రాంతి లోపు శుభవార్త చెబుతా అని ప్రకటించిన అతడు.. ఆ తర్వాత దాన్ని విస్మరించాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా తాను ఓ అవార్డును గెలుచుకున్నట్లు చెబుతూ సోషల్ మీడియాలో ఫొటోతో సహా షేర్ చేశాడీ యాంగ్రీ యంగ్ మ్యాన్.

  స్టార్ అంటూ కామెంట్ చేసిన మోనాల్ గజ్జర్

  స్టార్ అంటూ కామెంట్ చేసిన మోనాల్ గజ్జర్

  బృహస్పతి ఫౌండేషన్ ప్రతి ఏటా రైజింగ్ స్టార్ అవార్డులను ప్రదానం చేస్తోంది. ఇక, ఈ ఏడాదికి గానూ అఖిల్ సార్థక్ దానికి ఎంపికయ్యాడు. బుధవారం రాత్రి రవీంద్ర భారతిలో జరిగిన ఫంక్షన్‌లో దీన్ని అందుకున్నాడు. ఆ తర్వాత అవార్డును చూపుతూ తన ఫోటోను షేర్ చేశాడు. దీనికి మోనాల్ గజ్జర్ ‘కంగ్రాట్స్ అఖిల్ సార్థక్ రైజింగ్ స్టార్' అంటూ కామెంట్ చేయడం గమనార్హం.

  English summary
  Akhil Sarthak is an Indian actor and model who primarily works in the Telugu film and television industry. He is known for portraying Karthik in the Telugu TV serial “Kalyani” (2019) that aired on Gemini TV. Akhil started his acting career by playing a lead role in the Telugu short film “Bava Maradalu” (2016).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X