Just In
- 8 min ago
Vakeel Saab Teaser: ఆరో స్థానంతో సరిపెట్టుకున్న పవన్.. అందులో మాత్రం రెండో ప్లేస్
- 19 min ago
మొన్న అక్కడ.. నేడు ఇక్కడ.. ‘ఊకో కాక’ బ్రాండ్‌తో రాహుల్ రచ్చ
- 1 hr ago
ఆమెను హత్తుకుని ముద్దులు పెట్టిన జబర్ధస్త్ కమెడియన్.. క్యారెక్టర్లో అలా చేశానంటూ నిజంగానే!
- 1 hr ago
Master Collections: తెలుగులో మాస్టర్ రికార్డు.. కేవలం మూడు రోజుల్లోనే.. షాకిస్తోన్న లెక్కలు!
Don't Miss!
- News
ఈ రోజు తాను కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోవటంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి ఈటెల రాజేందర్
- Finance
మొబైల్ నెంబర్‌కు కాల్ చేయాలంటే సున్నాను చేర్చండి, గుర్తు చేస్తున్న టెల్కోలు
- Sports
సైనీ స్థానంలో బౌలింగ్.. రోహిత్‌ను ట్రోల్ చేసిన దినేశ్ కార్తిక్! ఏమైందో తెలియదు కానీ!
- Automobiles
బైక్ రైడర్‌కి రూ. 1 లక్షకు పైగా జరిమానా.. కారణం మాత్రం ఇదే
- Lifestyle
మీ భాగస్వామి మీ చేతులను అలా పట్టుకుంటున్నారా? అయితే వీటి గురించి మీరు తప్పక తెలుసుకోవాలి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సోహెల్ సోదరి పెళ్లిలో ఊహించని సంఘటన: అందరూ స్టేజ్ మీదున్న సమయంలో ఒక్కసారిగా!
తెలుగు బుల్లితెర హిస్టరీలోనే అత్యధిక స్థాయిలో ప్రజాదరణను అందుకున్న షో బిగ్ బాస్. ఉత్తరాది నుంచి వచ్చినా.. రియాలిటీగా సాగే దీనికి ఎంతో మంది ఫిదా అయిపోయారు. ఈ కారణంగానే మన దగ్గర నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుందీ షో. దీని ద్వారా ఎంతో మంది ఫేమస్ అవుతున్నారు.. ఈ సీజన్‌లో చాలా మందే పాపులారిటీని సంపాదించుకున్నారు. వారందరిలో సయ్యద్ సోహెల్ రియాన్ ప్రత్యేకంగా నిలిచాడు. బిగ్ బాస్ తర్వాత ఫుల్ బిజీ అయిన అతడు.. తన సోదరి పెళ్లితో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆ వేడుకలో ఊహించని సంఘటన జరిగింది. ఆ వివరాలు మీకోసం!

మొదటి నుంచే ప్రత్యేకం... అందుకే ఫేమస్
కొన్ని సినిమాలు, సీరియళ్లలో నటించడం ద్వారా బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు ఎంపికయ్యాడు సయ్యద్ సోహెల్ రియాన్. ప్రీమియర్ ఎపిసోడ్‌లో అతడు అందరిలా కాకుండా.. ఆరియానా గ్లోరీతో కలిసి రెండు రోజులు సీక్రెట్ రూమ్‌లో ఉండి.. ఆ తర్వాత హౌస్‌లోకి ప్రవేశించాడు. అప్పటి నుంచి మాస్ కంటెస్టెంట్‌గా ప్రత్యేకతను చాటుకున్నాడు. తద్వారా ఫేమస్ అయిపోయాడు.

ఆడాడు.. ఆకట్టుకున్నాడు.. చేరిపోయాడు
ఆరంభంలోనే అద్భుతమైన ఆటతీరుతో ఈ సీజన్‌లోనే బలమైన కంటెస్టెంట్‌గా తయారయ్యాడు సోహెల్. అన్నింట్లో ముందుంటూ తన మార్క్ చూపించాడు. ఫిజికల్ టాస్కులు మాత్రమే కాదు.. ఎలాంటి గేమ్ అయినా తానే కింగ్ అనిపించుకున్నాడు. అయితే, ‘కథ వేరే ఉంటది' అంటూ తరచూ గొడవలకు దిగినా.. తర్వాత దాన్ని అధిగమించాడు. ఫలితంగా ఫినాలేకు చేరుకున్నాడు.

బిగ్ బాస్ హిస్టరీలో మొదటి కంటెస్టెంట్‌గా
గ్రాండ్ ఫినాలేలో ముందుగా టాప్ -5 నుంచి ఇద్దరు అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యారు. దీంతో బిగ్ బాస్ హౌస్‌లో అభిజీత్, అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్ మిగిలారు. వీళ్లకు బిగ్ బాస్ రూ. 20 లక్షలు ఆఫర్ ఇచ్చాడు. దీనికి ఎవరూ ఒప్పుకోకపోవడంతో మరో ఐదు పెంచి రూ. 25 లక్షలు చేశారు. నాగార్జున ప్రకటించిన ఈ ఆఫర్‌కు సోహెల్ టెంప్ట్ అయి బయటకు వచ్చేశాడు.

ఫుల్ బిజీ.. సినిమాను కూడా మొదలెట్టి
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సయ్యద్ సోహెల్ రియాన్ ఫుల్ బిజీ అయిపోయాడు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. ఫ్యాన్స్‌తో సోషల్ మీడియా ద్వారా కలుస్తున్నాడు. అదే సమయంలో ‘జార్జ్‌రెడ్డి' సినిమా టీమ్‌తో ప్రాజెక్టు చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇటీవలే దీనికి సంబంధించిన మీడియా సమావేశం కూడా జరిగింది. దీంతో అతడి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఘన స్వాగతం... చెల్లి పెళ్లిలో హల్‌చల్‌గా
ఆదివారం సోహెల్ తన సొంత ఊరు గోదావరిఖని వెళ్లాడు. ఆ సమయంలో మార్గమధ్యలోని కొన్ని ప్రాంతాల్లో అతడికి ఘన స్వాగతం లభించింది. కొన్ని చోట్ల ఫ్యాన్స్ ఎక్కువగా రావడంతో ట్రాఫిక్ జామ్ కూడా అయింది. రాత్రికి తన ఇంటికి చేరుకున్న సోహెల్.. తన సోదరి పెళ్లిలో హల్‌చల్ చేశాడు. అతడి వెంట బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్‌సే కూడా ఉన్నాడు.

ఊహించని సంఘటన: స్టేజ్ మీదున్న టైంలో
సోహెల్ తన బావతో స్టేజ్ మీద ఫొటోలు దిగుతోన్న సమయంలో ఊహించని సంఘటన జరిగింది. అదే.. తన క్లోజ్ ఫ్రెండ్ అఖిల్ సార్థక్ సర్‌ప్రైజింగ్ ఎంట్రీ. పెళ్లికి రావడం కుదరదని చెప్పిన అతడు.. ఒక్కసారిగా స్టేజ్ దగ్గరకు వచ్చేశాడు. దీంతో సోహెల్, మెహబూబ్ షాకైపోయారు. ‘దొంగ.. రానని చెప్పి ఇలా షాకిస్తావా' అంటూ అతడు అఖిల్‌తో అన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.