Just In
- 7 min ago
పుకార్లకు చెక్ పెట్టబోతున్న త్రివిక్రమ్: ఎన్టీఆర్ సినిమా కోసం ఆమెనే తీసుకొస్తున్నాడు
- 39 min ago
దర్శకుడితో కాజల్ రొమాన్స్.. పెళ్లి తరువాత కూడా అలాంటివి తగ్గించట్లేదుగా..
- 51 min ago
‘కార్తీక దీపం’ హీరోయిన్ అరుదైన రికార్డు: తెలుగులో ఈ ఘనత సాధించిన ఏకైక నటిగా వంటలక్క
- 1 hr ago
Box office: మొత్తానికి హాఫ్ సెంచరీ కొట్టేసిన మాస్ రాజా.. క్రాక్ తెచ్చిన లాభాలు ఎంతంటే?
Don't Miss!
- Finance
ప్రాఫిట్ బుకింగ్: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, 500 పాయింట్లు డౌన్
- Sports
కృనాల్ పాండ్యాతో గొడవ.. దీపక్ హుడాకు భారీ షాక్!!
- News
వాజ్‌పేయితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు: 20 ఏళ్ల నాటి ఫొటోతో: కారణం?
- Automobiles
కొత్త 2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ వస్తోందోచ్..
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Bigg Boss 4 Race to Finale: ముందే లీక్ అయిన విజేత వివరాలు.. బిగ్ బాస్‌లో తొలిసారి ఆ కంటెస్టెంట్!
బిగ్ బాస్ నాలుగో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. షో చివరి దశకు చేరుకోవడంతో మరింత రంజుగా మారింది. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? టాప్ -5లో ఎవరు చోటు దక్కించుకుంటారు? చివరిగా ఎవరు విజేతగా నిలుస్తారు? అని తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 'రేస్ టు ఫినాలే' టాస్క్‌ను తీసుకొచ్చాడు బిగ్ బాస్. ఇందులో ఎవరు గెలిస్తే వాళ్లు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటారు. తాజాగా ఇందులో గెలిచిన కంటెస్టెంట్ వివరాలు లీక్ అయ్యాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

నాగార్జున వార్నింగ్.. దండం పెట్టి మరీ
నాలుగో సీజన్ చివరి దశకు చేరుకుంది. దీంతో హౌస్‌లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్లు గట్టిగా ఆడాలని బిగ్ బాస్ సూచించాడు. అయినప్పటికీ.. దెయ్యం టాస్కును కొందరు కంటెస్టెంట్లు సరిగా ఆడలేదు. దీంతో ఆ టాస్క్ విఫలం అయినట్లు పేర్కొన్నాడు. ఆ వెంటనే వచ్చిన వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున అందరిపై ఫైర్ అయ్యాడు. అంతేకాదు, మంచిగా ఆడమని వేడుకున్నాడు.

‘రేస్ టు ఫినాలే'... నేరుగా ఫైనల్‌లోకే
వీకెండ్ ఎపిసోడ్ అయిన వెంటనే నామినేషన్స్ ప్రక్రియ సాగింది. కొన్ని గొడవల మధ్య జరిగిన ఈ టాస్కులో ఐదుగురు నామినేట్ అయ్యారు. ఇక, మంగళవారం బిగ్ బాస్‌లో ‘రేస్ టు ఫినాలే' టాస్క్ మొదలైంది. ఇందులో విజేతగా నిలిచిన ఒక కంటెస్టెంట్ నేరుగా ఫినాలేలో అడుగు పెడతారు. అయితే, ఈ వారం నామినేషన్స్‌లో ఉంటే ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవాల్సి ఉంటుంది.

మొదటి రౌండ్.. మిగిలింది నలుగురు
‘రేస్ టు ఫినాలే' టాస్క్ మూడు రౌండ్లలో జరుగుతుందని బిగ్ బాస్ ప్రకటించాడు. దీని ప్రకారం.. మొదటి లెవెల్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న ఆవు నుంచి వచ్చే పాలను తమ దగ్గర ఉన్న బాటిల్స్‌లో నింపుకోవాలి కంటెస్టెంట్లు. బజర్ మోగినప్పుడల్లా ఎవరి దగ్గర తక్కువ బాటిళ్లు ఉంటే వాళ్లు నిష్క్రమించాల్సి ఉంటుంది. ఈ రౌండ్‌లో ఆరియానా, అవినాష్, మోనాల్ ఔట్ అయ్యారు.

రెండో రౌండ్.... చివరి పోరుకు ఇద్దరు
రెండో రౌండ్ అయితే ఇంకా ప్రసారం కాలేదు. కానీ, దానికి సంబంధించిన వివరాలు మాత్రం ముందే బయటకు వచ్చాయి. ఈ రౌండ్‌లో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుంచి లోపలికి పడే పూలను పోటీలో ఉన్న నలుగురు కంటెస్టెంట్లు పట్టుకోవాల్సి ఉంటుంది. బజర్ మోగే సమయానికి ఎవరి దగ్గర తక్కువుంటే వాళ్లు వెళ్లిపోవాలి. ఈ రౌండ్‌లో అభిజీత్, హారిక నిష్క్రమించారని తెలిసింది.

ముందే లీక్ అయిన విజేత వివరాలు
క్లోజ్ ఫ్రెండ్స్ అయిన అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్ మధ్య ‘రేస్ టు ఫినాలే' టాస్క్ తుది పోరు జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ రౌండ్‌లో పోటి పడుతోన్న ఇద్దరు కంటెస్టెంట్లలో ఒకరు బిగ్ బాస్ లోగో పర్మినెంట్ టాటూను చేతిపై వేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సమ్మతించిన అఖిల్ సార్థక్ టాటూను వేసుకుని విజేతగా నిలిచినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్‌లో తొలిసారి ఆ కంటెస్టెంట్
మొదటి సీజన్‌లో టాటూ అనేది పరిచయం కాలేదు. కానీ, రెండో సీజన్ సమయంలో గీతా మాధురి ఇలానే పర్మినెంట్ టాటూను చేతిపై వేసుకుంది. ఆ తర్వాత అంటే మూడో సీజన్‌లో శ్రీముఖి ఆ పని చేసింది. వరుసగా ఇద్దరు ఆడవాళ్లు టాటూ వేయించుకున్నారు. ఇక, ఈ సీజన్‌లో అఖిల్ సార్థక్ పచ్చబొట్టు పొడిపించుకోవడం ద్వారా తొలిసారి జెండర్ చేంజ్ అయింది.