For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: బిందును గుర్తు చేసిన కంటెస్టెంట్.. ఏం పీకావ్ అంటూ నాగార్జున క్లాస్

  |

  తెలుగు బుల్లితెరపైకి ఎన్నో రకాల షోలు వస్తుంటాయి. కానీ, అందులో రియాలిటీ ఆధారంగా నడిచేవి మాత్రం చాలా తక్కువగానే ఉంటాయి. అలాంటి వాటిలో కొన్నేళ్ల క్రితం పరిచయం అయిన బిగ్ బాస్ ఒకటి. తెలుగు వాళ్లకు అస్సలు పరిచయం లేని కాన్సెప్టుతో వచ్చినా దీనికి మంచి ఆదరణ దక్కింది. అందుకే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లు కూడా విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ ఆరో కూడా అదే రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున కొందరిపై ఫైర్ అయ్యాడు. ఆ వివరాలు మీకోసం!

   కొత్త కంటెంట్.. రేటింగ్ తక్కువే

  కొత్త కంటెంట్.. రేటింగ్ తక్కువే

  తెలుగులో బిగ్ బాస్ ఎప్పుడు ప్రసారం అయినా భారీ రెస్పాన్స్‌ను అందుకుంటూ ఉంటున్నాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఆరో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కానీ, దీనికి రేటింగ్ మాత్రం చాలా తక్కువగానే వస్తుంది.

  శృతి మించిన ప్రియ ప్రకాశ్ హాట్ షో: తడిచిన దేహంతో మెంటలెక్కించేలా!

  ఈ వారంలో అలా.. లేడీ కెప్టెన్

  ఈ వారంలో అలా.. లేడీ కెప్టెన్


  ఈ వారం కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసేందుకు నిర్వహకులు 'బీబీ హోటల్' అనే టాస్కును ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఏకంగా 11 మందిని కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక చేశారు. అందులో ముగ్గురు మాత్రమే చివరి దశకు చేరుకున్నారు. వీరి నుంచి కీర్తి భట్ ఈ వారం ఇంటి కెప్టెన్‌గా ఎంపికైంది. అలాగే, అర్జున్ చెత్త కంటెస్టెంట్‌గా నిలిచి జైలుకు వెళ్లాడు.

  శనివారం ఎపిసోడ్‌పై ఆసక్తితో

  శనివారం ఎపిసోడ్‌పై ఆసక్తితో


  గతంలో కంటే ఆరో సీజన్‌లో అక్కినేని నాగార్జున కంటెస్టెంట్లపై విరుచుకుపడుతున్నాడు. తప్పు చేసిన వాళ్లను ఏమాత్రం మొహమాటం లేకుండా తిడుతున్నాడు. అంతేకాదు, గత వారం ఏకంగా ఇద్దరిని నేరుగా నామినేట్ కూడా చేశాడు. ఈ నేపథ్యంలో నాలుగో వారంలో చాలా తప్పులు జరగడంతో శనివారం ఎపిసోడ్‌పై ఆసక్తి నెలకొంది. దీనికోసం చాలా మంది వేచి చూస్తున్నారు.

  Bigg Boss Elimination: చివరి రోజు మారిన ఓటింగ్.. డేంజర్ జోన్‌లోకి మోడల్.. ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్

  పంచ్ ఇస్తూనే నాగార్జున క్లాస్

  పంచ్ ఇస్తూనే నాగార్జున క్లాస్

  బిగ్ బాస్ షోలో వారానికి రెండు రోజుల పాటు హోస్ట్ అక్కినేని నాగార్జున సందడి చేస్తుంటాడు. ఇందులో భాగంగానే శనివారం రాత్రి జరిగిన ఎపిసోడ్‌లో ఆయన తనదైన డ్యాన్స్‌తో అలరించారు. అంతేకాదు, హౌస్‌లో ఉన్న అందరు కంటెస్టెంట్లకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ క్రమంలోనే కొందరు కంటెస్టెంట్లపై ఫైర్ అయ్యారు. తాజాగా విడుదలైన ఈ ప్రోమో వైరల్ అవుతోంది.

  బాలాదిత్య, గీతూ గొడవతోనే

  నాలుగో వారం శనివారం ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా వచ్చిన ప్రోమోలో హోస్ట్ అక్కినేని నాగార్జున బాక్సింగ్ గ్లౌజ్ వేసుకుని ఫొటోలను ద్వంసం చేశాడు. ఇందులో ముందుగా బాలాదిత్యకు పంచ్ ఇచ్చిన ఆయన.. గీతూ జరిగిన గొడవ గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత అర్జున్ కల్యాణ్ ఆటతీరును కూడా నాగార్జున తప్పుబట్టారు. ఇలా కొందరికి ఆయన మాటలతోనే హెచ్చరించారు.

  హీరోయిన్ శ్రీయ ఎద అందాల జాతర: వామ్మో అలా పడుకుని మరీ!

   సూర్య తప్పు.. నాగార్జున ఫైర్

  సూర్య తప్పు.. నాగార్జున ఫైర్


  నాలుగో వారానికి సంబంధించి జరిగిన ఓ ఎపిసోడ్‌లో ఆర్జే సూర్య, ఆరోహి రావు మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో అతడు వెంటనే తన చేతిలో ఉన్న భోజనాన్ని చెత్త బుట్టలో పడేశాడు. దీంతో ఈ వీడియో ప్రసారం చేసిన నాగార్జున అతడిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లో బిందు మాధవి కూడా ఇలానే చేయడంతో ఆమె పైనా కోప్పడిన విషయం తెలిసిందే.

  ఏం పీకావ్ అంటూ తీవ్రంగా

  ఏం పీకావ్ అంటూ తీవ్రంగా


  ఆర్జే సూర్య అన్నం పడేయడం గురించి కెప్టెన్ ఆది రెడ్డితో నాగార్జున మాట్లాడుతూ.. 'పోయిన వారం పనీష్‌మెంట్ ఇవ్వమంటే అన్నం గురించి ఏదేదో చెప్పావ్. ఇప్పుడు ఆర్జే సూర్య అన్నాన్ని చెత్త బుట్టలో పడేస్తుంటే ఏం పీకావ్' అంటూ తీవ్రమైన పదజాలాన్ని వాడారు. దీంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. మొత్తానికి ఈ ప్రోమోతో శనివారం ఎపిసోడ్‌పై అంచనాలు పెరిగాయి.

  English summary
  Bigg Boss Telugu 6th Season was Running Successfully. Akkhineni Nagarjuna Fire on RJ Surya and Adi Reddy in An Upcoming Episode
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X