»   » భర్త బాటలో అక్కినేని అమల కూడా బుల్లితెరకు...

భర్త బాటలో అక్కినేని అమల కూడా బుల్లితెరకు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అక్కినేని అమల ఆ మధ్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రం ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో ఆమె బుల్లితెర సీరియల్ లో కూడా నటించబోతున్నారు. చెన్నైలో అమల ఈ విషయం గురించి వెల్లడించారు. తాను ఓ తమిళ సీరియల్‌లో డాక్టర్ పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు.

'ఊయెర్రి' అనే పేరుతో ఉండే ఈ సీరియల్ మొత్తం డాక్టర్ల జీవితం గురించి ఉంటుందట. ఆ సీరియల్ గురించి ఆమె వివరిస్తూ...'సీరయిల్ స్క్రిప్టు చాలా బాగుంది. అందుకే ఒప్పుకున్నాను. కథలో మొత్తం 12 మంది వైద్యులు ఉంటారు. వారి జీవితాలు, కుటుంబాల చుట్టూ కథ తిరుగుతుంది. ఆగస్టులో ఈ సీరియల్ ప్రసారం అవుతుందని తెలిపారు.

Akkineni Amala in Tamil TV series

ఇప్పటి వరకు చాలా పాత్రలు చేసాను. కెరీర్లో కాస్త గ్యాప్ తీసుకున్నప్పటికీ మళ్లీ సినిమాల్లోకి రావడం, సీరియళ్లలో కూడా నటిస్తుండటం సంతోషంగా ఉందని అమల తెలిపారు.

మరో వైపు అక్కినేని నాగార్జున ఇటీవలే బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మా టీవీలో ప్రసారం అవుతున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే రియాల్టీ షోను నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ఇపుడు అమల కూడా బుల్లితెర ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశం అయింది. తమిళం నుండి ఆమె తెలుగు సీరియళ్లలలోనూ నటించే అవకాశం ఉంది.

English summary
Just weeks after Nagarjuna made his foray into small screen, it looks like Amala Akkineni is going to follow suit. The actress is all set to make her debut in a TV series later this year in Tamil.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu