For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అన్నీ పక్కన పెట్టేసి ఒక్కటవుతున్న రష్మీ - అనసూయ.. క్రేజీ ప్రాజెక్ట్ తో మనముందుకు?

  |

  తెలుగులో లీడింగ్ యాంకర్స్ ఎవరు అంటే టక్కున గుర్తు వచ్చే పేర్లు కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా అనసూయ భరద్వాజ్ రష్మీ గౌతమ్ పేర్లు కచ్చితంగా వినిపిస్తాయి. ఒక రకంగా బుల్లితెరను ఏలుతున్న ఈ ఇద్దరూ ఒకరంటే ఒకరు పడనట్లుగా టీవీ షోలలో కనిపిస్తూ ఉంటారు.. బహుశా అది సరదాకి చూపిస్తూ ఉండి ఉండవచ్చు. కానీ ఇద్దరి మధ్య ఇగో వార్ ఉంటుందని ఒకరంటే ఒకరికి పడదు అని చాలామందిలో అపోహ ఉంటుంది. ఇక ఆ విషయాలన్నీ పక్కన పెడితే ఈ ఇద్దరూ కలిసి క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  ఎన్టీఆర్ సినిమాతో

  ఎన్టీఆర్ సినిమాతో

  ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది అనసూయ భరద్వాజ్. అయితే ఆ తర్వాత చదువుల కోసం కెరీర్ మొత్తం అన్ని వదిలేసి వెళ్ళిపోయింది. తర్వాత సాక్షి టీవీలో యాంకరింగ్ మొదలుపెట్టి అనుకోకుండా ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా మారి ఈ స్థాయికి చేరుకుంది. ఒకరకంగా ఇప్పుడు హాట్ యాంకర్స్ ఎవరు అనగానే ముఖ్యంగా ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది. అదీగాక రంగమ్మత్త పాత్రతో తెచ్చుకున్న క్రేజ్తో ఈమెకు ఇప్పటికీ సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.

  రష్మీ అలా

  రష్మీ అలా


  ఇక నటన మీద ఆసక్తితో సినిమా రంగ ప్రవేశం చేసిన రష్మి మొదట్లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలలో నటించింది.. అలా చాలా సినిమాల్లో చేసినా ఆమెకు అనుకున్నంత క్రేజ్ అయితే దక్కలేదు. ఎప్పుడైతే ఎంటర్టైన్మెంట్ యాంకర్గా మారిందో అప్పటి నుంచి ఈమె దశ తిరిగిపోయింది. టెలివిజన్లో రష్మీ ఒక హాట్ యాంకర్ అనే పేరు తెచ్చుకుని షోలో అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ముందుకు వెళుతోంది..

  ఇగో వార్

  ఇగో వార్


  అయితే సరదాకి ఈ ఇద్దరి మధ్య ఇగో వార్ ఉందని షో తాను చేస్తానంటే తాను చేస్తానని ఉన్నట్లు పట్టుబడుతూ ఉంటారని జబర్దస్త్ స్కిట్ లలో చూపిస్తూ ఉంటారు. అయితే అదంతా కేవలం సరదాకి మాత్రమే. ఇద్దరూ కలిసి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ ఇద్దరూ కలిసి ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నారని అంటున్నారు.. ఉమెన్ సెంట్రిక్ వెబ్ సిరీస్ గా దీనిని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

  వీళ్ళిద్దరి ద్వారా డిజిటల్ ఎంట్రీ

  వీళ్ళిద్దరి ద్వారా డిజిటల్ ఎంట్రీ

  ఇప్పటికే పలు షోలతో మంచి పేరు తెచ్చుకున్న మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఇద్దరితో కలిసి ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే యూట్యూబ్ ప్లాట్ ఫాంలో తెలుగు నుంచి టాప్ లో దూసుకుపోతున్న మల్లెమాల సంస్థ డిజిటల్ ఎంట్రీ వీరిద్దరి ద్వారా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వీలైనంత త్వరలో చేసే అవకాశం ఉందని అంటున్నారు.

  Anchor Anasuya జబర్దస్త్ క్రేజ్.. చేతినిండా ప్రెస్టీజియస్ సినిమాలు | #HBDAnasuya | Filmibeat Telugu
  ఇద్దరూ కలిస్తే రచ్చే

  ఇద్దరూ కలిస్తే రచ్చే

  ఇక అనసూయ ఎప్పటికీ రంగస్థలం సినిమా ద్వారా తనలోని నటిని ప్రూవ్ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో కూడా కీలక పాత్ర దక్కింది. అలాగే మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న కిలాడి సినిమాలో కూడా ఈ భామ ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది.. ఇక రష్మీ విషయానికి వస్తే ప్రస్తుతానికి చేస్తున్న సినిమాలు ఏవి లేకపోయినా రెండు చేతుల టెలివిజన్ షోలతో బిజీగా ఉంది. కచ్చితంగా వీరిద్దరూ కలిసి ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తే వీరిద్దరికీ ఉన్న క్రేజ్ తో మంచి రెస్పాన్స్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

  English summary
  Mallemala Entertainments who have good reputation for hosting top television shows like Dhee, Jabardasth are said to be panning a web series. as per reports Anasuya Bharadwaj, Rashmi Gautham and another well known anchor are going to team up for this web series.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X