Just In
Don't Miss!
- News
100 అడుగులకు కాళేశ్వరం మట్టం -రేపు ప్రాజెక్టు సందర్శనకు సీఎం కేసీఆర్ -ఇప్పటికే ఎత్తిపోతలు
- Sports
నటరాజన్‌పై షేన్ వార్న్ ఫిక్సింగ్ ఆరోపణలు.. మండిపడుతున్న ఫ్యాన్స్
- Automobiles
షాకింగ్.. భారతదేశంలో ఉత్పత్తిని నిలిపివేసిన ఫోర్డ్, కారణం అదేనా?
- Finance
మాల్యా అప్పగింత అప్పుడే కుదరదు, కేంద్రం ఏం చెప్పిందంటే
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హైపర్ ఆదితో అనసూయ గొడవ.. నా నడుము చూశావంటూ రచ్చ రచ్చ
గత కొంతకాలంగా జబర్డస్త్ కామెడీ షోకి సంబంధించిన అంశాలు వైరల్ అవుతున్నాయి. ఎప్పుడైతే నాగబాబు ఈ షో నుంచి తప్పుకున్నారో అప్పటి నుంచి జబర్డస్త్ తాలూకు అంశాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. జబర్దస్త్ స్కిట్స్, టీఆర్ఫీ రేటింగ్స్, న్యాయనిర్ణేతలు, యాంకర్స్ ఇలా అన్ని అంశాలు ఆసక్తిరేపుతున్నాయి. కాగా తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో హైపర్ ఆదితో అనసూయ గొడవ పడటం హైలైట్ అయింది. ఈ వివరాలు చూద్దామా..

జబర్దస్త్ జోడీ.. పొట్టచెక్కలయ్యే వినోదం
జబర్దస్త్ షో పరంగా కొన్ని జోడీలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందులో ఒక జోడీ రష్మీ గౌతమ్- సుధీర్ కాగా మరో జోడీ అనసూయ- హైపర్ ఆది. జబర్దస్త్ వేదికపై ఈ జంటల హంగామా మామూలుగా ఉండదు. ఒకరిపై ఒకరు పంచుకోలేసుకుంటూ ప్రేక్షకులకు పొట్టచెక్కలయ్యే వినోదం పంచుతారు.

అనసూయ- హైపర్ ఆది కెమిస్ట్రీ
జబర్దస్త్ జోడీల్లో భారీ ఫాలోయింగ్, పాపులారిటీ సంపాదించింది అనసూయ- హైపర్ ఆది. యాంకర్ స్థానంలో అనసూయ కూర్చుందంటే చాలు.. ఇక హైపర్ ఆది ఆమె పంచులు మీద పంచులేస్తుంటాడు. అలాగే అనసూయ అందాన్ని తెగ పొగిడేస్తూ రక్తి కట్టిస్తుంటాడు. అందుకే అనసూయ- హైపర్ ఆది జంటను కూడా మరోలా ఊహించుకుంటూ ఉంటారు ఆడియన్స్.

బుల్లితెరపై రొమాన్స్..
ఈ మధ్యకాలంలో హైపర్ ఆది స్కిట్లలో కచ్చితంగా అనసూయకు ఓ పాత్ర ఇస్తుండటం చూస్తున్నాం. బుల్లితెరపై రొమాన్స్ పండించాలని ట్రై చేస్తూ ఈ జంట సక్సెస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఎపిసోడ్‌లో ఖుషీ సినిమాలో పవన్ కల్యాణ్, భూమిక మధ్య పండిన రొమాన్స్ ఎపిసోడ్ చేసి వావ్ అనిపించారు ఈ ఇద్దరూ.

అనసూయ నడుముపై కన్నేసిన హైపర్ ఆది
ఖుషి సినిమాలో బాగా హైలైట్ అయిన నడుము సన్నివేశాన్ని హైపర్ ఆది చేశాడు. అందులో భాగంగా అనసూయ నడుముపై కన్నేసిన హైపర్ ఆది నానా రచ్చ చేశాడు. ఈ సన్నివేశంతో పాటు ఆది స్కిట్ అంతా పంచ్‌లు, ప్రాసలతో కడుపుబ్బా నవ్వించింది.
నా నడుము చూశావంటూ అనసూయ రచ్చ
ఇక ఆ స్కిట్ లో అనసూయ రచ్చ మామూలుగా లేదు. నా నడుము చూశావంటూ హైపర్ ఆదితో గొడవకు దిగింది అనసూయ. ఇదంతా చూస్తూ షోకు జడ్జిలుగా వ్యవహరించిన హీరో రాజ్‌తరుణ్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, రోజా నవ్వు ఆపుకోలేక పోయారు. మొత్తానికి అనసూయ- హైపర్ ఆది చేసిన ఈ రొమాంటిక్ స్కిట్ అదిరింది.