»   » అనసూయ పై అవన్నీ రూమర్సే నమ్మద్దు,అసలు నిజం ఇదీ

అనసూయ పై అవన్నీ రూమర్సే నమ్మద్దు,అసలు నిజం ఇదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదారాబాద్: బుల్లితెర‌పై ఎన‌లేని క్రేజ్ సంపాదించుకున్న యాంక‌ర్ అన‌సూయ‌, అదే రీతిలో వెండితెర‌పై ఎంట్రీ ఇచ్చి అదే స్థాయిలో మెప్పించింది. జబర్దస్త్ తో పరిచయమైన అనసూయ ఇప్పుడు అటు టీవి పోగ్రామ్ లు ఇటు సినిమా పోగ్రామ్ లతో బాగా బిజీ అయిపోయింది.

అనసూయ HQ వాల్ పేపర్స్

సక్సెస్ ఫుల్ చిత్రం క్షణం సినిమా తర్వాత ఆమె కెరీర్ లో పెద్ద కుదుపులాంటిది వచ్చింది. అయితే తనను ఈ స్దాయికి తెచ్చిన బుల్లితెర కార్యక్రమాలు చేస్తూనే వెండితెర ప్రయత్నాలు సాగిస్తోంది.

ఈ నేపథ్యంలో టీవీ 9 ఛానెల్‌లో ఆమె 'ఏ డేట్‌ విత్‌ అనసూయ' అనే ప్రోగ్రామ్‌ ప్రారంభించింది. సెలబ్రిటీలను తీసుకువచ్చి 'కాఫీ విత్‌ కరణ్‌' తరహాలో కొన్ని ఎపిసోడ్‌లు చేసి సక్సెస్ చేసింది. అయితే మూడు వారాలుగా ఆ ప్రోగ్రామ్‌ రావడం లేదు.

Anasuya comes up with second season!

ఇందుకు కారణం అనసూయ బిజీ కావడమేనని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆ ప్రోగ్రామ్‌కు అనుకున్నంత స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌లు రావడం లేదని, అందుకే దానిని ఆపేశారని రూమర్స్ వినబడుతున్నాయి. కానీ అది నిజం కాదు.

Also See : యాంకర్ అనసూయ అందాలు విరబూసాయి! (న్యూ ఫోటో షూట్)

వాస్తవానికి ఈ పోగ్రామ్ సెకండ్ సీజన్ కు ఛానెల్ వాళ్లు మొత్తం రంగం సిద్దం చేస్తున్నారట. త్వరలోనే సెకండ్ సీజన్ తో అనసూయ మళ్లీ మనని పలకరించబోతోందని తెలుస్తోంది.

Anasuya comes up with second season!

ప్రస్తుతం ఆమె సాయిధరమ్‌ హీరోగా చేస్తున్న 'విన్నర్‌'లో ఓ ఐటెం సాంగ్‌ చేస్తోంది. ఆ పాట షూటింగ్‌ ఉక్రెయిన్‌లో జరుగుతోంది. అక్కడ నుంచి రాగానే ఈ పోగ్రామ్ సెకండ్ సీజన్ పై ఆమె దృష్టి పెట్టనుందని సమాచారం. కాబట్టి అనసూయ అభిమానులు నిరాశపడాల్సిన అవసరం లేదు.

వ‌రుస సినిమా అవ‌కాశాలు వ‌స్తున్నా టీవీ షోస్‌ను మాత్రం వ‌ద‌ల‌నని చెప్తోందట ఈ అమ్మ‌డు. 'ఏ డేట్ విత్ అనసూయ' షో లో స్టార్స్ చెప్పే క‌బుర్లు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఇటు బుల్లితెర‌పై, అటు వెండితెర‌పై చేస్తున్న అన‌సూయ కెరీర్ బాగానే ఉంది. బెస్టాఫ్ లక్ అనుసూయ.

English summary
For a while there were rumours that 'A Date With Anasuya' show has been stopped completely as Anasuya got busy with films. But this is untrue, actually all this while they were planing the second season of this television show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu