»   » అనసూయతో డేట్ కు వచ్చిన రామ్ చరణ్, భలే సరదాగా ఉందే (వీడియో)

అనసూయతో డేట్ కు వచ్చిన రామ్ చరణ్, భలే సరదాగా ఉందే (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హాట్ యాంకర్ అనసూయ కొత్త టీవి షో చేస్తోంది. ఇక ఆ ప్రోగ్రామ్ పేరు 'ఏ డేట్ విత్ అనసూయ'. టీవీ 9 ఛానెల్‌లో ప్రసారమయ్యే ఈ షోలో సెలబ్రిటీలను తీసుకువచ్చి 'కాఫీ విత్‌ కరణ్‌' తరహాలో కొన్ని ఎపిసోడ్‌లు చేసి సక్సెస్ చేసింది.

ఈ షోలో సెలబ్రీలు సరదాగా కబుర్లు చెబుతున్నారు. పైకి చిట్ చాట్ ప్రోగ్రాంలాగే అనిపిస్తున్నప్పటికీ సమ్ థింగ్ స్పెషల్ లా ఉంటుందీ ప్రోగ్రామ్. అయితే హీరో హీరోయిన్స్ తో ముచ్చట్లు చెబుతూ సినిమాలను ప్రమోట్ చేయడం ఈ ప్రోగ్రాం ఒక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇటివలే ఈ ప్రోగ్రాం కు బ్రేక్ పడింది. దీంతో అది ఆగిపొయిందని అనుకున్నారంతా. అయితే ఇప్పుడు సెకెండ్ సీజన్ మొదలైయింది. ఈ సీజన్ మెగా హీరో రామ్ చరణ్ తో మొదలెట్టింది అనసూయ.


రామ్ చరణ్ లేటెస్ట్ చిత్రం ధృవ. డిసెంబర్ 9న విడుదల కానున్న ఈ చిత్రం కోసం.. ప్రమోషనల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసేశారు. అందులో భాగంగా ఇప్పుడు అనసూయ 'డేటింగ్' లో కూడా పాల్గోన్నాడు చరణ్. సినిమాకి సంబధించిన బోలెడు కబుర్లు ఇందులో చెప్పుకున్నారు. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేసారు. ప్రోమో చాలా ఆసక్తికంగా ఉంది చూడండి.ప్రస్తుతం అనసూయ... సాయిధరమ్‌ హీరోగా చేస్తున్న 'విన్నర్‌'లో ఓ ఐటెం సాంగ్‌ చేస్తోంది. ఆ పాట షూటింగ్‌ ఉక్రెయిన్‌లో జరుగింది. అక్కడ నుంచి రాగానే ఈ పోగ్రామ్ సెకండ్ సీజన్ పై ఆమె దృష్టి పెట్టింది.


వ‌రుస సినిమా అవ‌కాశాలు వ‌స్తున్నా టీవీ షోస్‌ను మాత్రం వ‌ద‌ల‌నని చెప్తోందట ఈ అమ్మ‌డు. 'ఏ డేట్ విత్ అనసూయ' షో లో స్టార్స్ చెప్పే క‌బుర్లు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఇటు బుల్లితెర‌పై, అటు వెండితెర‌పై చేస్తున్న అన‌సూయ కెరీర్ బాగానే ఉంది. బెస్టాఫ్ లక్ అనుసూయ.

English summary
Anasuya recently completed season one of her popular chat show - 'A Date With Anasuya' for TV 9. Now she is commencing the second season of 'A Date With Anasuya' with the 'Dhruva' star Ram Charan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu