Don't Miss!
- Finance
Intel: షాకిచ్చిన ఇంటెల్ త్రైమాసిక ఫలితాలు.. ఒక్క రోజులోనే 8 బిలియన్ల డాలర్ల నష్టం..
- Sports
అర్ష్‌దీప్ సింగ్ వైఫల్యానికి కారణం అదే: మహమ్మద్ కైఫ్
- News
మరోసారి భగ్గుమన్న తాడిపత్రి
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
భర్తతో హరితేజ ఇలా గాఢంగా.. డ్యాన్స్‌తో కేక.. గృహ నిర్బంధం ఫొటోలు, వీడియోలు వైరల్
సినిమా రంగం, టెలివిజన్ ఇంండస్ట్రీ అనే తేడా లేకుండా యాక్టర్, హోస్ట్, యాంకర్‌గా అనేక పాత్రలను హరితేజ పోషిస్తూ మెప్పిస్తున్నారు. అంతేకాకుండా ప్రొఫెషనల్, పర్సనల్, ఫ్యామిలీ లైఫ్‌ను చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్ అమలవుతున్న సమయంలో భర్త దీపక్‌తో సుదీర్ఘమైన కాలాన్ని గడుపుతున్నారు. తాజాగా ఆమె తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఎమోషనల్‌గా కామెంట్ చేశారు. హరితేజ్ భావోద్వేగంగా మారడానికి కారణం ఇదే..

లాక్‌డౌన్‌లో దీపక్‌తో నేను ఇలా
హైదరాబాద్‌లో పక్కాగా లాక్‌డౌన్ అమలవుతుండటంతో హరితేజ, దీపక్ దంపతులు ఇంటికే పరిమతమయ్యారు. పూర్తి సమయాన్ని ఇంటికే పరిమితం చేశారు. ఈ సందర్భంగా హరితేజ తన ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందిస్తూ.. ఇంటిలో క్వాలిటీ ఫ్యామిలీ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. మీ క్వారంటైన్ లైఫ్ ఎలా ఉంది? ఇంటి పట్టునే ఉండాలనే మాటను మరిచిపోకండి అంటూ పోస్టు పెట్టారు.
|
కేకపుట్టించిన హరితేజ డ్యాన్స్
ఇక హరితేజలో మంచి యాంకర్‌ను, హోస్ట్‌ను, హాస్యాన్ని పండించే హరితేజనే చూశాం. కానీ ఆమెలో మంచి నాట్యకారిణి అనే విషయం తెలిసినా.. ఆమె ఇటీవల పోస్టు చేసిన ఓ వీడియో అందర్నీ ఆకట్టుకొనేలా చేసింది. ఆ లోకయే శ్రీ బాలకృష్ణం అనే పాటకు హరితేజ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె వేసిన స్టెప్పులు మంచి ప్రొఫెషనల్ కళాకారిణిని తలపించాయి.

పెళ్లిరోజు పండుగ నాడు భావోద్వేగంతో
ఇక క్వారంటైన్ సమయంలో వచ్చిన మ్యారేజ్ యానివర్సరినీ హరితేజ, దీపక్ చాలా ఎమోషనల్‌గా ఎంజాయ్ చేశారు. తన భర్త గురించి ఇన్స్‌టాగ్రామ్‌లో చెప్పుతూ ఎమోషనల్ అయ్యారు. నా జీవితంలో ఇంతకంటే ప్రేమతో, స్నేహంతో, అనుభూతులతో కూడిన బంధం మరోటి ఉండదనుకొంటాను. మంచి రిలేషన్, తోడు కంటే గొప్ప వివాహ బంధం మరోటి ఉండదని భావిస్తాను. మనం ఒకరికోసం మరొకరం పుట్టామనే ఫీలింగ్‌తో ఉన్నాను. దీపూ నీ కంటే గొప్ప ఎవరూ నా జీవితంలో ఉండరు. గొప్ప వైవాహిక జీవితాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ హరితేజ ఎమోషనల్ అయ్యారు.

సెలబ్రిటీల శుభాకాంక్షలు
హరితేజ జన్మదినం పురస్కరించుకొని బిగ్‌బాస్ తెలుగులోని సహచరులు, సినీ స్నేహితులు హరితేజ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. గీతా మాధురీ, అష్మితా మర్నాని, ఆకర్ష్ బైరాముడి, శ్యామల, సమీరా తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున నెటిజన్లు, ఫాలోవర్స్, అభిమానులు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
Recommended Video

హరితేజ కెరీర్ అలా..
హరితేజ, దీపక్ ప్రేమించుకొని పెళ్లి చేసుకొన్నారు. వారి వివాహం ఏప్రిల్ 23, 2015లో జరిగింది. అప్పటి నుంచి వారిద్దరి జీవితం సంతోషంగా సాగుతున్నది. వ్యాపారం రంగంలో దీపక్ ఉండగా, హరితేజ మాత్రం టెలివిజన్, సీని రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చుకొంటున్నారు. ఫిదా, పండగచేస్కో, సూపర్ సింగర్ లాంటి టెలివిజన్ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.