For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వయసు, పెళ్లిపై రష్మీ సంచలన వ్యాఖ్యలు: బట్టలు విప్పేస్తా.. ఉన్నది తీసేస్తా అంటూ ఓ రేంజ్‌లో రచ్చ

  |

  రష్మీ గౌతమ్.. తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. దాదాపు పదేళ్లుగా అటు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై సందడి చేస్తూ మజాను పంచుతోన్న ఈ బ్యూటీ.. ఎంతో మంది అభిమానాన్ని అందుకుంది. అదే సమయంలో వరుస ఆఫర్లను కూడా దక్కించుకుంటూ దూసుకెళ్తోంది. తద్వారా తన హవాను చూపిస్తూ వస్తోంది. తాజాగా ఈ టాప్ యాంకర్ ఓ స్పెషల్ ఈవెంట్‌లో పాల్గొంది. ఇందులో ఆమె ఓ రేంజ్‌లో రచ్చ చేసింది. అంతేకాదు, తన వయసు, పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది రష్మీ గౌతమ్. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  Anchor Rashmi Gautam Tested Coronavirus Positivie

  Bigg Boss బ్యూటీ హిమజ హాట్ ఫోటోలు.. మీరెప్పుడూ చూడని గ్లామరస్ పిక్స్!

  అలా ప్రవేశం.. ఇలా పాపులారిటీ

  అలా ప్రవేశం.. ఇలా పాపులారిటీ

  చాలా కాలం క్రితమే రష్మీ గౌతమ్ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే చాలా చిత్రాల్లో మంచి పాత్రలను పోషించింది. అలా ఎంతో కాలంగా సినీ రంగంలో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘జబర్ధస్త్' అనే కామెడీ షోతో ఆమె యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీని సొంతం చేసుకుంది.

  ప్రముఖ షోలో నిరుపమ్‌కు ప్రమాదం: గట్టిగా నెట్టడంతో కింద పడి.. ఒక్కసారిగా నేలకు గుద్దుకోవడంతో!

  ఆ లవ్ ట్రాక్‌తో మరింతగా ఫేమస్

  ఆ లవ్ ట్రాక్‌తో మరింతగా ఫేమస్

  యాంకర్ రష్మీ గౌతమ్ తెలుగు రాష్ట్రాల్లో హవాను చూపిస్తూ దూసుకుపోడానికి ఆమె టాలెంట్ కారణం అయితే.. భారీ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకోడానికి మాత్రం జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న పుకార్లే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ అతడితో రొమాన్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోందామె. ఫలితంగా ఎంతగానో ఫేమస్ అయిపోతోంది.

  స్పెషల్ ఈవెంట్‌లో భాగమైన రష్మీ

  స్పెషల్ ఈవెంట్‌లో భాగమైన రష్మీ

  చాలా కాలంగా రష్మీ గౌతమ్ ఒకే ఒక్క ఛానెల్‌కు పరిమితం అవుతోంది. ఎన్నో అవకాశాలు వచ్చినా రిజెక్ట్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ బ్యూటీ జీ తెలుగు ఛానెల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న ‘ఆషాడం అత్తాకోడళ్లు' అనే స్పెషల్ ఈవెంట్‌లో భాగమైంది. దీనికి హీరోయిన్ సంగీత గెస్టుగా రాగా.. రవి, శ్యామల యాంకర్లుగా చేశారు.

  స్పెషల్ టాలెంట్ చూపించిన రష్మీ

  స్పెషల్ టాలెంట్ చూపించిన రష్మీ

  ‘ఆషాడం అత్తాకోడళ్లు' ఈవెంట్‌ కోసం రష్మీ గౌతమ్ బాగానే కష్టపడిందని చెప్పాలి. దీనికోసం తొలిసారి ఆమె పాటను కూడా పాడింది. ‘కురిసింది మేఘం మేఘం' అంటూ గొంతు సవరించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కొన్ని పాటలకు స్టెప్పులు కూడా వేసింది. అలాగే, సంగీతతో కలిసి కొన్ని మూమెంట్లు కూడా చేసింది. మొత్తానికి ఈ ఈవెంట్‌లో రష్మీ గౌతమ్ మాత్రం బాగా హైలైట్ అయింది.

  హాట్ ఫొటోలతో యాంకర్ విష్ణుప్రియ రచ్చ: ఎద అందాలు కనిపించేలా రెచ్చిపోయిన బ్యూటీ

  వయసు, పెళ్లిపై షాకింగ్ కామెంట్స్

  వయసు, పెళ్లిపై షాకింగ్ కామెంట్స్

  ఈ ఈవెంట్‌లో భాగంగా రష్మీ గౌతమ్ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఓ గేమ్‌లో భాగంగా ప్రముఖ నటిని రెండు చెంపలపై కొడుతుంది. అప్పుడు యాంకర్ శ్యామల ‘హేయ్.. నువ్వు అత్తలా మారకు.. కోడలు మాత్రమే' అని గుర్తు చేస్తుంది. అప్పుడు రష్మీ గౌతమ్ ‘ఇంత వయసు వచ్చినా పెళ్లి కాలేదు. డైరెక్టుగా నేను అత్తలా అప్‌గ్రేడ్ అవుతా' అంటూ వయసు, పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

  బట్టలు విప్పేస్తా... ఉన్నది తీసేస్తా

  బట్టలు విప్పేస్తా... ఉన్నది తీసేస్తా

  ‘ఆషాడం అత్తాకోడళ్లు' ఈవెంట్‌లో యాంకర్ రష్మీ గౌతమ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తరచూ ఆమె పంచులు వేస్తూ హల్‌చల్ చేసింది. మరీ ముఖ్యంగా యాంకర్ రవిని ఉద్దేశించి ‘నీకు ఉన్నది తీసేస్తా.. నీ బట్టలు విప్పేస్తా' అంటూ ఎన్నో డబుల్ మీనింగ్ డైలాగులను వదిలింది. ఆమెను ఇలా చూసి అక్కడున్న వాళ్లంతా షాకైపోయారు. దీంతో ఈ ప్రోమో విపరీతంగా వైరల్ అవుతోంది.

  English summary
  Tollywood Actress, Anchor Rashmi Gautam Now Participated in Aashadamlo Athakodallu Event. She did Sensational Comments on her Age and Marriage.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X