పబ్ లో రష్మీ గౌతమ్ రచ్చ.. నా స్వభావం అదే అంటూ పోస్ట్
బుల్లితెర ప్రేక్షకులకు రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాంకర్ గా తన టాలెంట్ ను రుజువు చేసుకుంది. టీవీ షోలతో యాంకర్ గా తెలుగు టెలివిజన్ రంగంలో స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా రష్మీ గౌతమ్ కు పాపులర్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా యాంకర్ గా తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ ను సొంతం చేసుకుంది.
ఇక యాంకర్ గా క్రేజ్ సంపాదించుకోవడం కంటే ముందే నటిగా ఎదిగేందుకు రష్మీ గౌతమ్ ఎంతగానో ప్రయత్నించింది. పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ అలరించే ప్రయత్నం చేసింది. కానీ మొదట్లో సినిమాల పరంగా రష్మీ గౌతమ్ కు పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ ఆ తర్వాత యాంకర్ గా మాత్రం మంచి క్రేజ్ దక్కించుకుంది. యాంకర్ గానే కాకుండా, హీరోయిన్ గా కూడా రష్మీ గౌతమ్ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక రష్మి గౌతమ్ ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షోతో పాటు అటు అవకాశాలు వచ్చినప్పుడు హీరోయిన్ గా, సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటిస్తూ వెండితెరపై అలరిస్తూ వస్తోంది. చివరిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రంలో క్యామియో రోల్ లో నటించింది.

ఇదే సమయంలో రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటోంది. తన గురించిన విషయాలను ఎప్పటికి అప్పుడు తన అభిమానులతో పంచుకుంటూనే వస్తోంది. అయితే జూలై 22న ఇన్ స్టా గ్రామ్ లో ఒక పోస్ట్ ను పంచుకుంది. తన ఇక కొద్దికాలం సోషల్ మీడియాలో కనిపించనని చెప్పుకొచ్చింది. డిజిటల్ డిటాక్స్ లో భాగంగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్స్ డివైజ్ లకు దూరంగా ఉంటానని చెప్పింది. కానీ తాజాగా మళ్లీ సోషల్ మీడియాకు రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వీకెండ్ కావడంతో తను తాజాగా పబ్ లో పార్టీ చేసుకుంటూ కనిపించింది.
అందుకు సంబంధించిన ఒక వీడియోను ఇన్ స్టా గ్రామ్ వేదికన విడుదల చేసింది. 'ఏమీ మాట్లాడకుండా ఉండటం నా స్వభావం కాదు.. కానీ ట్రై చేస్తాను. హాట్ ఇన్ స్టా ఫ్యామిలీ' అంటూ ఆ పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చింది. తిరిగి తన అభిమానులను పలకరించింది. నెల రోజుల పాటు సైలెంట్ గా ఉన్న రష్మీ గౌతమ్ ఇకపై బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందంచేందుకు సిద్ధమైనట్టు ఇలా తెలిపింది.
సోషల్ మీడియాలోనూ రష్మీ గౌతమ్ యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. దాంతో పాటు సోషల్ అంశాలపైనా కూడా రష్మీ గౌతమ్ తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా పంచుకుంటూ వస్తుంది. ఇక రష్మీ గౌతమ్ కు ఇన్ స్టా గ్రామ్ లో 4.9 మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉంది. ఇక రష్మీ గౌతమ్ హీరోయిన్ గా తొలుత కన్నడలో గురు అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత తన నుంచి తెలుగులో గుంటూరు టాకీస్, అంతం, నెక్ట్స్ నువ్వే, బొమ్మ బ్లాక్ బాస్టర్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, హాస్టల్ బాయ్స్ అనే చిత్రాల్లో నటించి మెప్పించింది.


Click it and Unblock the Notifications











