Bigg Boss 5 Contestants: బిగ్ బాస్‌‌లోకి టాప్ యాంకర్.. చెప్పకనే చెప్పేస్తూ ఇన్‌స్టాలో కామెంట్

తెలుగు వాళ్లకు అసలే మాత్రం పరిచయం లేని కంటెంట్‌తో ప్రసారమైనా భారీ స్థాయిలో ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్‌ను అందుకుని నెంబర్ వన్ షో అయిపోయింది బిగ్ బాస్. ఆరంభం నుంచి ఆకట్టుకున్న ఇది ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఐదో దానిని కూడా మొదలెట్టడానికి నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ పలువురు పేర్లు వైరల్ అవుతున్నాయి. అందులో ప్రముఖ యాంకర్ రవి కూడా ఒకడు. తాజాగా దీనిపై అతడు స్పందిస్తూ క్లారిటీ ఇచ్చేశాడు. ఆ సంగతులు మీకోసం!

నాలుగు సీజన్లు.. అన్నీ సూపర్ హిట్టే

నాలుగు సీజన్లు.. అన్నీ సూపర్ హిట్టే

తెలుగులో బిగ్ బాస్ నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అన్నింటికీ ప్రేక్షకుల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా అన్నీ ఒకదాన్ని మించి ఒకటి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అదే సమయంలో బుల్లితెరపై ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇక, ఈ షో ఇంత సక్సెస్ అవడం వెనుక దీన్ని హోస్ట్ చేసిన ముగ్గురు స్టార్ హీరోల పాత్ర ఎంతో ఉంది.

ఐదో సీజన్‌కు ఏర్పాట్లు.. తెర వెనుకనే

ఐదో సీజన్‌కు ఏర్పాట్లు.. తెర వెనుకనే


బిగ్ బాస్ షో ప్రారంభం అయినప్పటి నుంచి ప్రతి ఏడాది ఇది ప్రసారం అవుతూనే ఉంది. దీంతో ఈ సారి కూడా ఇది ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, కరోనా రెండో దశ కారణంగా ఈ సారి షో జరిగేది అనుమానమే అని కూడా ప్రచారం జరిగింది. కానీ, ఈ షోకు సంబంధించిన పనులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు, దీన్ని సెప్టెంబర్ 5 నుంచి మొదలెడతారని అంటున్నారు.

కంటెస్టెంట్ల ఎంపిక పూర్తి.. అలా ప్రాసెస్

కంటెస్టెంట్ల ఎంపిక పూర్తి.. అలా ప్రాసెస్


కరోనా ప్రభావం కారణంగా కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా కొంత ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే దాదాపు వంద మంది జాబితా నుంచి షార్ట్ లిస్టును తయారు చేశారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక, ఇప్పుడు హౌస్‌లోకి పంపించబోయే వాళ్ల కోసం జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారట నిర్వహకులు. త్వరలోనే ఫైనల్ లిస్టును ఫిక్స్ చేస్తారని సమాచారం.

కంటెస్టెంట్ల పేర్లు లీక్.. ఈ సీజన్‌లో వీళ్లే

కంటెస్టెంట్ల పేర్లు లీక్.. ఈ సీజన్‌లో వీళ్లే


ఐదో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల ఎన్నో ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే సిరి హన్మంత్, నవ్య స్వామి, శ్రీహాన్ ఫైనల్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. వీళ్లతో పాటు షణ్ముక్ జశ్వంత్, హేమచంద్ర, మంగ్లీ, జబర్ధస్త్ నరేష్, రఘు మాస్టర్, టిక్ టాక్ దుర్గారావు సహా పలువురి పేర్లు ఈ సారి లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది.

 బిగ్ బాస్‌‌లోకి టాప్ యాంకర్ రవి ఎంట్రీ

బిగ్ బాస్‌‌లోకి టాప్ యాంకర్ రవి ఎంట్రీ


బుల్లితెరపై దాదాపు పదేళ్లుగా తన హవాను చూపిస్తూ నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతోన్న రవి కూడా ఈ సారి బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇస్తాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. వాస్తవానికి రెండేళ్ల నుంచే అతడి పేరు మారుమ్రోగుతున్నా హౌస్‌లోకి వెళ్లలేదు. కానీ, ఈ సారి మాత్రం యాంకర్ రవి ప్రవేశం తప్పకుండా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

చెప్పకనే చెప్పేస్తూ ఇన్‌స్టాలో కామెంట్

చెప్పకనే చెప్పేస్తూ ఇన్‌స్టాలో కామెంట్


తాజాగా యాంకర్ రవి బిగ్ బాస్ ఎంట్రీపై స్పందించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడు పెట్టిన ఓ ఫొటోకు అభిమాని 'అన్నా.. ఈ సారి బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తున్నావంట కదా' అని కామెంట్ పెట్టాడు. దీనికి రవి 'ఏమో మరి.. అంట' అని రిప్లై ఇచ్చాడు. తద్వారా బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం లేదని చెప్పకనే చెప్పాడు. దీంతో ఆ వార్తలకు పుల్‌స్టాప్ కూడా వేసేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X