Don't Miss!
- Sports
వచ్చే సీజన్ ఆరో ట్రోఫీ పక్కా.. హామీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్
- News
టీడీపీ అడ్రస్ గల్లంతు.. మంత్రి బొత్స కామెంట్స్
- Finance
క్రిప్టో మార్కెట్ లాభాల్లోనే ఉంది, కానీ బిట్ కాయిన్ 30,000 డాలర్లకు దిగువనే
- Lifestyle
విరేచనాలు ఎక్కువ అయ్యిందా? ఈ టీలో ఏదైనా తాగితే వెంటనే ఆగిపోతాయి ...
- Automobiles
Eeco ప్రియులకు గుడ్ న్యూస్.. ఎందుకో ఇక్కడ చూడండి
- Technology
ఆపిల్ వాచ్‌లో ఎయిర్టెల్ Wynk మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కి యాక్సెస్!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Bigg Boss 5 విజేతను నేనే.. తప్పు జరిగిందని నిర్వాహకులు కూడా.. ఫేక్ ఎవరంటే? యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో 12వ వారం ఎలిమినేషన్ వివాదాస్పదంగా మారింది. ఎవరు ఊహించని విధంగా యాంకర్ రవి ఎలిమినేట్ కావడం అభిమానులకు, స్నేహితులకు జీర్ణించుకోలేని విషయంగా మారింది. అయితే బిగ్‌బాస్ ఇంటి నుంచి ఆయన బయటకు వచ్చిన తర్వాత భారీగా అభిమానులు ఆయనకు స్వాగత పలికారు. లోబో, విశ్వ, ఇతర స్నేహితులు రవికి మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా అభిమానులు, మీడియాతో మాట్లాడుతూ..

బిగ్‌బాస్ ఇంటి వద్ద తెలంగాణవాదుల నిరసన
యాంకర్ రవిని ఎలిమినేట్ చేయడం అన్యాయం అంటూ అన్నపూర్ణ స్టూడియోలోని బిగ్‌బాస్ సెట్ వద్ద తెలంగాణవాదులు నిరసన వ్యక్తం చేశారు. యాంకర్ రవి తప్పుడు తీర్పు ద్వారా బయటకు వచ్చారు. నిర్వాహకులు ఆయనకు అన్యాయం చేశారంటూ నినాదాలు చేశారు. అయితే అభిమానులను ఆవేదనకు రవి ఎమోషనల్ అయ్యారు. అనంతర వారిని ఉద్దేశించిన ఉపశమనం కలిగించే విధంగా వారితో మాట్లాడారు.

ఎలిమినేట్ అవుతానని ఊహించలేదు అంటూ
బిగ్‌బాస్ తెలుగు 5 నుంచి ఎలిమినేట్ కావడం ఊహించలేదు. చాలా బాధగా ఉంది. హృదయం భారంగా ఉంది. వాస్తవానికి నేను ఎలిమినేట్ అవుతానని ఊహించలేదు. ఎవిక్షన్ ఫ్రీ కార్డు ఉపయోగించడమనేది ప్రధానమైన అంశం కాదు. సన్నీ ఉపయోగిస్తాడని అనుకొన్నాను. కానీ నాకు కాజల్ కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. కానీ నాకు తక్కువ ఓట్లు వచ్చాయంటే నేను నమ్మడం లేదు. ఏం జరిగిందనే విషయం నాకు ఇంకా బోధపడటం లేదు. అయితే త్వరలోనే అసలు ఏం జరిగి ఉంటుందనే విషయాన్ని విశ్లేషించుకొంటాను అని యాంకర్ రవి అన్నారు.

తప్పుడు తీర్పు జరిగిందని
బిగ్‌బాస్ నుంచి బయటకు రావడం అన్యాయమని అందరూ అంటుంటే.. నాకు చాలా కొంత గర్వంగా ఉంది. నా విషయంలో తప్పుడు తీర్పు జరిగిందని నా స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు అనుకొంటున్నారు. బయటకు వచ్చిన తర్వాత నా చుట్టు ఇంత మంది అభిమానులు నాపై ప్రేమను కురిపించడం చాలా హ్యాపీగా ఉంది. నా ఎలిమినేషన్ విషయంలో తప్పుడు నిర్ణయం జరిగిందని ప్రజలు భావిస్తున్నారు. నిర్వాహకులు కూడా ఎక్కడో తప్పు జరిగిందని భావిస్తున్నారు అని యాంకర్ రవి అన్నారు.

నేను బాగా ఫెర్ఫార్మ్ చేశాను అంటూ
ఇంటిలో జరిగే విషయాలు వేరే ఉంటాయి. బయటకు చూపించే విషయాలు మరో రకంగా ఉంటాయి. కానీ నాకు ఎలాంటి కంటెంట్ బయటకు వచ్చిందనే విషయం నాకు తెలియదు. ఇంట్లో ఎవరు ఎలా ఆడుతున్నారో నాకు స్పష్టమైన అభిప్రాయం ఉంది. అయితే బయటకు వచ్చిన కంటెంట్ ఎలా ఉందో అనే విషయం తెలియకుండా నేను మాట్లాడటం సరికాదు. ఇంటిలో బాగా ఫెర్ఫార్మ్ చేసిన వారిలో నేను ఒకరిని. అన్ని టాస్కులు ఆడాను అని యాంకర్ రవి తెలిపారు.

ఇంటిలో ఎవరు ఫేక్ అంటే..
ఇంటిలో ఎవరు ఫేక్, ఎవరు రియల్ అనే విషయంపై స్పందిస్తూ.. ప్రజల ప్రేమ రియల్. ఇంటిలో ఉండే వాళ్లలో ఫేక్ ఉన్నారు. ఫేక్ అనేది విషయానికి వస్తే.. ఒకరితో కనెక్ట్ అవుతాం. మనం వారితో ఏం మాట్లాడుతున్నామనేది ముఖ్యం. అయితే గేమ్ పరంగా రియల్, ఫేక్, విలువలు ఎవరూ ఫాలో కారు. కంటెంట్ చూసిన తర్వాతనే నేను మాట్లాడుతాను అని యాంకర్ రవి అన్నారు.

నేనే విజేతను.. కానీ బాధగా ఉంది
బిగ్‌బాస్ తెలుగు విజేత ఎవరు అనే విషయంపై స్పందిస్తే.. విన్నర్ విషయానికి వస్తే.. ఈ సమయంలో నేనే విన్నర్. నాకు ఉన్న ఫాలోవర్స్ బట్టి చూస్తే నేనే విజేతను. అంతకంటే ఏమీ చెప్పను. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా చాలా బాధగా ఉంది. మిమ్మల్ని చూసిన తర్వాత నేను గెలిచానని అనుకొంటున్నాను. యాంకర్‌గా చాలా సంవత్సరాలుగా ఆదరించారు. బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు కూడా నన్ను సపోర్ట్ చేశారు. అందుకు ధన్యవాదాలు అని యాంకర్ రవి ఎమోషనల్ అయ్యారు.

తప్పులను సరిదిద్దుకొనేందుకు ప్రయత్నిస్తాను
బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత లభిస్తున్న ఆదరణ చూసిన తర్వాత విన్నర్ వాళ్లు ఎవరో చేయడం కాదు.. మీరు నన్ను విజేతగా చేశారు. ఇక బతికి ఉన్నంత కాలం మీకు ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తాను. జీవితంలో బిగ్‌బాస్ కొత్త లర్నింగ్. తప్పులను సరిదిద్దుకొనేందుకు ప్రయత్నిస్తాను. లోబో, విశ్వ వెళ్లిపోయిన తర్వాత నేను ఇంటిలో ఒంటరిని అయ్యాను. కానీ మీ అందరి సహకారంతో ముందుకు వెళ్తాను అని యాంకర్ రవి తెలిపారు.