Don't Miss!
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- News
తారకరత్నను చూడగానే ఒక్క సారిగా జూ ఎన్టీఆర్ ..: తారక్ కోసం మంత్రిని పంపిన సీఎం..!!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్‌పై వెటరన్ కామెంట్స్!
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
అతడికి ముద్దు పెట్టి బుక్కైన శ్రీముఖి: తెర వెనుక జరిగిన దానిపై నోరు విప్పన యాంకర్
శ్రీముఖి.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ దాదాపు ఐదారేళ్లుగా టెలివిజన్ రంగంలో తన హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన టాలెంట్ ఉన్న ఈ భామ.. చేతి నిండా షోలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సినిమాల్లోనూ నటిస్తూ అక్కడ కూడా సత్తా చాటుతోంది.
కెరీర్ పరంగా సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోన్న శ్రీముఖి.. తన వ్యవహార శైలితో మాత్రం తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు ముద్దులు పెట్టి విమర్శలను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంపై రాములమ్మ తొలిసారి నోరు విప్పింది. ఆరోజు అసలేం జరిగిందో వెల్లడించింది. ఆ సంగతులు మీ అందరి కోసం!

నటిగా పరిచయం.. యాంకర్‌గా మారింది
మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. అల్లు అర్జున్ 'జులాయి' సినిమాతో నటిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది లోకల్ బ్యూటీ శ్రీముఖి. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మంచి మంచి పాత్రలను పోషించిన ఈ బ్యూటీ.. చక్కని గుర్తింపును అందుకుంది.
ఈ క్రమంలోనే 'అదుర్స్' అనే షోతో బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి అద్భుతమైన యాంకరింగ్‌తో అలరిస్తూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. ఫలితంగా తెలుగులో స్టార్ యాంకర్‌గా వెలుగొందుతోందీ బ్యూటీ. అదే సమయంలో ఫాలోయింగ్‌ను కూడా పెంచుకుంది.
Bheemla Nayak First Glimpse: పవన్ కల్యాణ్ ఊరమాస్ అవతారం.. భీమ్లా నాయక్ టీజర్ హైలైట్స్ ఇవే

ఆచితూచి అడుగు.. అందులో హల్‌చల్
యాంకర్‌గా వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయిన శ్రీముఖి.. కొన్నేళ్ల క్రితం బిగ్ బాస్ రియాలిటీ షోలోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినప్పటికీ.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. దీంతో ఈ అమ్మడికి నిరాశే ఎదురైంది.
ఇక, ఆ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీముఖి.. ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే వరుసగా షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తోంది. ఇక, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటూ అప్పుడప్పుడూ అందాల విందు కూడా చేస్తోంది.

ముద్దులు... రొమాంటిక్ డ్యాన్సుతో రచ్చ
కెరీర్ పరంగా సక్సెస్ అయినప్పటికీ.. శ్రీముఖి తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే పలు వివాదాల్లో కూడా చిక్కుకుంది. తద్వారా విమర్శలను కూడా ఎదుర్కొంది. ఇక, కొద్ది రోజుల క్రితం యాంకర్ శ్రీముఖి.. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌తో కలిసి రెచ్చిపోయిన విషయం తెలిసిందే.
ఓ షోలో భాగంగా అతడితో కలిసి రొమాంటిక్ డ్యాన్స్ చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఏకంగా అందరి ముందే అతడికి ముద్దులు ఇచ్చింది. దీంతో ఆ ఎపిసోడ్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. అదే సమయంలో శ్రీముఖిపై విమర్శల వర్షం కూడా ఓ రేంజ్‌లో కురిసింది.
ఘాటు ఫొటోతో హీటు పెంచేసిన రాయ్ లక్ష్మీ: స్విమ్‌సూట్‌లో అందాలు మొత్తం కనిపించేలా!

మరోసారి రెచ్చిపోయిన శ్రీముఖి.. కిస్‌లు
ఈ మధ్య కాలంలో బుల్లితెరపై పెద్దగా కనిపించని శ్రీముఖి.. ఇప్పుడు 'కామెడీ స్టార్స్' షోలో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ నుంచి అమె ఇందులో తెగ సందడి చేస్తోంది. ఈ షోకు శేఖర్ మాస్టర్ జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే.
యాంకర్‌గా చేసిన మొదటి ఎపిసోడ్‌లోనే శ్రీముఖి తనదైన మార్కును చూపించే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే మరోసారి శేఖర్ మాస్టర్‌తో డ్యాన్స్ చేసింది. అంతేకాదు, అతడి బుగ్గపై ముద్దు కూడా పెట్టేసి అందరికీ బిగ్ షాక్ ఇచ్చింది. దీంతో మరోసారి ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.

అంకుల్స్‌తో కలిసి సందడి... ప్రమోషన్స్
కెరీర్ ఆరంభంలో శ్రీముఖి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపింది. అయితే, ఆ తర్వాత ఈ బ్యూటీ పెద్దగా సినిమాల్లో నటించలేదు. తనకు కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే వస్తున్నాయని, అందుకే మూవీలకు దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చిందామె. ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘ విరామం తర్వాత శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'క్రేజీ అంకుల్స్'.
ఈ సత్తిబాబు తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో సింగర్ మనో, రాజా రవీంద్ర, భరణిలు ముఖ్య పాత్రలను పోషించారు. ఇది ఆగస్టు 19న విడుదల కాబోతుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది శ్రీముఖి.
ప్రియుడి కోసం హద్దు దాటిన నయనతార: ఆ పని చేసి అడ్డంగా దొరకడంతో దారుణంగా!

శేఖర్ మాస్టర్ ముద్దులపై శ్రీముఖి క్లారిటీ
'క్రేజీ అంకుల్స్' మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా శ్రీముఖి ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమెను శేఖర్ మాస్టర్‌కు ముద్దులివ్వడం గురించి యాంకర్ ప్రశ్నించింది. ఇది కావాలనే జరిగిందా? లేక అప్పటికప్పుడు జరిగిందా? అని కూడా అడిగింది. దీంతో అప్పుడు అతడికి ముద్దులు ఇవ్వడంపై శ్రీముఖి క్లారిటీ ఇచ్చింది. 'షోలో ఇద్దరం కలిసి పాల్గొన్నాము. ఇద్దరం ఆర్టిస్టుల్లానే బిహేవ్ చేశాము. అందుకే అప్పుడు ముద్దులు పెట్టాను. ఇందులో పెద్ద తప్పేం లేదని నా అభిప్రాయం' అంటూ వివరణ ఇచ్చింది రాములమ్మ.
Recommended Video

ఆయన సైగలు చేయడంతో పెట్టేశానంటూ
అసలు ఆరోజు ఏం జరిగిందో చెబుతూ.. 'సిక్త్ సెన్స్ ప్రోగ్రాంకు వెళ్లినప్పుడు 'క్రాక్' సినిమాలో పాటకు డ్యాన్స్ చేశాం. అప్పుడు అందులో అప్సరా రాణి ఎన్నిసార్లు ఉమ్మ అని అన్నది అనే విషయంపై నాకు, శేఖర్ మాస్టర్‌కు డిస్కర్షన్ జరిగింది. అప్పుడు ఆ ప్రశ్నను నేనే కరెక్ట్‌గా ఆన్సర్ చేశాను. ఆ సమయంలో శేఖర్ మాస్టర్ నా పక్కనే ఉన్నారు. సరిగ్గా అప్పుడే ఓంకార్ గారు కూడా ముద్దు పెట్టు అన్నట్లు సైగలు చేశారు. దీంతో ఆయనకు కిస్‌లు ఇచ్చాను. యాంకర్ల గురించి ఇలానే ఎన్నో వస్తాయి. నవ్వు రాకపోయినా అప్పుడప్పుడూ నవ్వాలి' అని వెల్లడించింది శ్రీముఖి.