»   » నన్ను నీకు ఇచ్చేసుకుంటా.. తాళి కట్టించుకొంటా అంటున్న శ్రీముఖి

నన్ను నీకు ఇచ్చేసుకుంటా.. తాళి కట్టించుకొంటా అంటున్న శ్రీముఖి

Posted By:
Subscribe to Filmibeat Telugu

టెలివిజన్ తెరపై హాటెస్ట్ యాంకర్‌గా శ్రీముఖి జోరు సాగిస్తున్నది. చానెళ్లలో వివిధ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నది. కేవలం టీవీ తెరపైన కనిపిస్తునే సినిమా అవకాశాలను అంది పుచ్చుకున్నది. ఇలా రకరకాల పనులతో బిజీ ఉంటూనే సోషల్ మీడియాలో అభిమానులను శ్రీముఖి ఆకట్టుకొంటున్నది. గతంలో డబ్ స్మాష్ వీడియోలతో శ్రీముఖి ఇంటర్నెట్‌లో దుమ్ము రేపింది. తాజాగా గురు చిత్రంలోని పాటకు తన అభినయాన్ని ప్రదర్శించిన శ్రీముఖి నెటిజన్లకు పండుగ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గురు పాటకు డబ్ స్మాష్

గురు చిత్రంలో ‘ఓ సక్కనోడా పట్టు పిడికిలై నాడు చేసినావే దడదడా‘ అంటూ సాగే పాటకు తన అభినయాన్ని జోడించి డబ్ స్మాష్ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోకు విపరీతమైన క్రేజ్ లభించింది. ఆ వీడియోను సుమారు 9 వేల మంది షేర్ చేయగా, 9 లక్షల మంది వీక్షించారు. దాదాపు 3 వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి.

ఫ్యాన్స్ నుంచి అదిరిన రెస్సాన్స్

ఫ్యాన్స్ నుంచి అదిరిన రెస్సాన్స్

‘ఇరగదీసావు రా. ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగా పెట్టావ్. పది సార్ల కంటే ఎక్కువగా ఆ వీడియోను చూశాను. ఐ లవ్డ్ సో మచ్. యూ ఆర్ ఆసమ్ టాలెంటెడ్. శ్రీముఖి డబ్ స్మాష్ ఈ రేంజ్‌లో ఉంటే మూవీలో పాటలో నటించి ఉంటే ఏ రేంజ్‌లో ఉండేదో. నీ యాక్టింగ్ పీక్ స్టేజ్‌లో ఉంది. సూపర్ శ్రీ' అని ఒకరు వీడియో పోస్టింగ్ కింద కామెంట్ పెట్టాడు. చివరకు నిన్ను ఎప్పటీకి ఇష్టపడుతాను (ఫైనల్లీ లవ్ యూ ఫర్ ఎవర్). ఇది పది నెలల మై క్యూట్ ఏంజెల్ మిథునకు నీవు అంటే చాలా ఇష్టం. తల్లి దగ్గర పాలు తాగడం ఆపి నిన్నే చూస్తుంది. తన ముఖం కూడా నీ మాదిరిగానే ఉంటుంది అని మరో అభిమాని కామెంట్ చేశాడు. ఇలాంటి కామెంట్లు చాలా చాలా ఉన్నాయి.

బాబు బాగా బిజీలో హాట్‌గా

బాబు బాగా బిజీలో హాట్‌గా

టెలివిజన్ కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే ప్రస్తుతం బాబు బాగా బిజీ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌తో హాట్‌ హాట్‌గా నటించిందంటూ వార్తలు రావడంతో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో బాబు బాగా బిజీలో తన పాత్రపై వివరణ ఇచ్చింది. మితిమీరిన శ‌ృంగార సన్నివేశాల్లో నటించలేదని మీడియాకు శ్రీముఖి వివరించింది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో శ్రీముఖితోపాటు అవసరాల శ్రీనివాస్, మిష్తి, తేజస్వి, సుప్రియ ప్రధాన పాత్రల్లో నటించారు.

అవకాశాలు మిస్..

అవకాశాలు మిస్..

అద్భుతమైన టాలెంట్‌తో రాణిస్తున్న శ్రీముఖి తన హైట్ కారణంగా ఇటీవల సినిమాల్లో మంచి అవకాశాలు కోల్పోయినట్టు వార్తలు వచ్చాయి. మిస్టర్ చిత్రంలో వరుణ్ తేజ్ పక్కన ప్రత్యేక పాటలో నర్తించే అవకాశం కూడా కోల్పోయినట్టు సమాచారం. గతంలో మనోహరి పాటలో నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారినట్టు సమాచారం.

English summary
Anchor Sreemukhi is hottest anchor in Television Industry. She is active in social media. Recently she acted dumb smash video for Guru song. That video goes viral in social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X