బావతో అలా కోరిక తీర్చుకొంటా.. పెళ్లిపై శ్రీముఖి మోజు
తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా దూసుకెళ్తున్నారు శ్రీముఖి. ఎంతో మంది యాంకర్లు వస్తున్నారు, వెళ్తున్నారు కానీ శ్రీముఖి మాత్రం తన హవాను గట్టిగా చూపిస్తున్నారు. మూవీ ఈవెంట్స్, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలను తగ్గించేసి పూర్తిగా టీవీపైనే దృష్టి పెడుతున్నారు శ్రీముఖి. ఆల్రెడీ 30 క్రాస్ చేసేసినా ఇంకా పెళ్లి మాట ఎత్తడం లేదు ఈ మద్దుగుమ్మ.. శ్రీముఖి పెళ్లిపై పలుమార్లు మీడియాలో గాసిప్స్ వైరల్ అవ్వగా.. అవన్నీ గాలివార్తలుగానే మిగిలిపోయాయి. తాజాగా తన పెళ్లిపై శ్రీముఖి ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
10 మే 1993న నిజామాబాద్‌లో జన్మించారు శ్రీముఖి. దంత వైద్యంలో గ్రాడ్యుయేషన్ చేసిన శ్రీముఖి.. తొలుత అదుర్స్ షోకు హోస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత సూపర్ సింగర్‌కు కూడా యాంకరింగ్ చేశారు. ఈ దశలో జులాయి సినిమాలో అల్లు అర్జున్‌కు చెల్లెలి పాత్రతో సినీరంగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్, నేను శైలజ, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ధనలక్ష్మీ తలుపు తడితే, సావిత్రి, జెంటిల్‌మెన్, మనలో ఒక్కడు, బాబు బాగా బిజీ, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, క్రేజీ అంకుల్స్, మ్యాస్ట్రో, భోళా శంకర్ తదితర సినిమాలలో నటించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాలలోనూ కనిపించారు.

బిగ్‌బాస్‌తో పాపులర్
సినీరంగంలో అంతగా సక్సెస్ కాలేకపోవడంతో బుల్లితెరనే టార్గెట్ చేసిన శ్రీముఖి హోస్ట్‌గా పలు ఛానెల్స్‌లో పదుల సంఖ్యలో షోలు చేస్తున్నారు. తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం శ్రీముఖి డామినేషన్ కనిపిస్తోంది. ఇక 2019లో బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ దక్కించుకున్నారు శ్రీముఖి. తన మైండ్ గేమ్, టాస్క్‌ల్లో దూకుడుతో ఫైనల్‌కు చేరుకుని తృటిలో టైటిల్ కోల్పోయి రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. బిగ్‌బాస్ తర్వాత శ్రీముఖి పాపులారిటీ మరింత పెరిగింది. ప్రస్తుతం ఆదివారం విత్ స్టార్ మా పరివారం తదితర షోలను హోస్ట్ చేస్తున్నారు.
అతనితో బ్రేకప్
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడే తన రిలేషన్ గురించి బయటపెట్టింది శ్రీముఖి. అతనితో అంతా ఓకే అనుకున్నప్పుడు తమ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని.. ఆ తర్వాత అది బ్రేకప్‌కు దారి తీసిందని, ఒకానొక దశలో చచ్చిపోదాం అనుకునే వరకు పరిస్ధితి వచ్చిందని ఆమె ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత రిలేషన్‌కు దూరంగా ఉంటున్న శ్రీముఖి.. కెరీర్‌పైనే ఫోకస్ చేస్తూ బ్యాచిలర్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని మనసులోని మాటను బయటపెట్టి బాంబు పేల్చింది శ్రీముఖి.
కార్తీక పౌర్ణిమకు స్పెషల్ ఎపిసోడ్
స్టార్ మాలో ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకు సెపరేట్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. స్టార్ మాలో ప్రసారమవుతున్న పలు సీరియల్స్‌లో నటించే నటీనటులతో పాటు ఇతర బుల్లితెర సెలబ్రెటీలను ఒకచోటికి తీసుకొచ్చి వారితో ఆడిపాడిస్తుంది శ్రీముఖి. తాజాగా కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గత ఆదివారం ఓ స్పెషల్ థీమ్‌తో షో సాగింది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ విడుదల చేసింది. కార్తీక పూర్ణిమ సందర్భంగా ఇక్కడున్న వారంతా వారి మనసులోని కోరికలను ప్రేక్షకులతో పంచుకోవాలని అవి నెరవేరుతాయో లేదో వారే డిసైడ్ చేస్తారని అంటుంది శ్రీముఖి
బావతో రావాలని అనుకుంటున్నా
ప్రోమో ప్రారంభంలోనే శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి షాకింగ్ న్యూస్ చెప్పింది. వచ్చే కార్తీక పౌర్ణమికి నేను మీ బావగారితో పాటు ఎపిసోడ్‌కి రావాలని కోరుకుంటున్నానని మీరు ఏమంటారు? అని ప్రేక్షకులను ప్రశ్నించింది. దానికి గ్యాలరీలో కూర్చొన్న ప్రేక్షకులు యస్ అనే బోర్డ్ పైకెత్తారు. దాంతో ఆమె పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లేనని, అందుకే అలాంటి కోరిక కోరుకున్నదని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. శ్రీముఖి మరోసారి ప్రేమలో పడ్డారా? త్వరలోనే పెళ్లి విషయం బయటపెడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











